ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆ దమ్మున్న పోలీస్ ఎక్కడ..?



ఆ దమ్మున్న పోలీస్ ఎక్కడ..?

ఎక్కువ కేసులు ఛేదించిన పోలీసులకు ర్యాంకింగ్ ఇస్తారు. వారికి పోస్టింగ్ సమయంలో, బదిలీ సమయంలో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతిష్టాత్మక కేసులకు ప్రత్యేక విచారణ అధికారులుగా ఎంపిక చేస్తారు. అలాంటి దమ్మున్న పోలీసులు ఎక్కడ అంటే అదంతా గతం అనే చెప్పాలి.. 

మరి ఇప్పుడూ...  ఎంత అవినీతి చేసినా ఓకే.. తప్పు చేసి వి.ఆర్ లో వేచి ఉన్నా ఓకే..!

అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయినా ఓకే.. కేవలం ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటే చాలు కావాల్సిన చోటే ఎస్సైలుగా, సిఐలుగా పోస్టింగులు, బదిలీలు సునాయాసంగా పూర్తి అయిపోతాయి. 

ఎమ్మెల్యే లేఖ కావాలంటే ఏం చెయ్యాలి..? ఎస్సై పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు.. సిఐ పోస్టుకు రూ.4లక్షలు సమర్పించుకుని సదరు ఎమ్మెల్యే చెప్పిన మాట వినుకుంటే చాలని కొందరు పోలీసులే అనధికారికంగా చెబుతున్నారు. సదరు ఎమ్మేల్యే సామాజిక వర్గానికి చెందిన వారికైతే కొంత శాతం ఇందులో రాయితీ కూడా ఇస్తున్నారని  పోలీసులే గుసగుసలాడుకుంటున్నారు.   

నేరాలను అరికట్టి, నిష్పక్షపతాముగా పని చేసి, సంఘ విద్రోహ శక్తుల గుండెలలో నిద్రపోయే ఆ దమ్మున్న పోలీసులు  స్టేషన్ డ్యూటీలలో  నేడు కనిపించడం లేదంటే  అతిఅయోక్తి లేదు. నిజాయితీగా పని చేద్దాం.. కసిగా పని చేసి చట్టాన్ని రక్షించేద్దాం.. పోలీసు అంటే ఏంటో అక్రమార్కులకు చూపించేద్దాం.. అనుకోని ఉద్యోగంలో చేరిన వారు కూడా ఇప్పుడు తమ ఆలోచనలు మార్చుకుని నాయకుల అడుగులకు మడుగులెత్తడం ప్రారంభించేసే పరిస్థితులు ఏర్పడడం ప్రజాస్వామ్యం పాలిట శాపంగా మారింది. 

  • ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను లక్షలు వెచ్చించి కొనుగోలు చేసుకుని మరీ విధుల్లో చేరిన పోలీసులు ఏం చేస్తారు..?
  • చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షిస్తారా..? 
  • ప్రజలకు న్యాయం చేస్తారా..?
  • న్యాయం కోసం స్టేషన్ కు వెళ్లే బాధితుల మొర ఆలకిస్తారా..?
  • కోడి పందెం, పేకాట, జూదం వంటి అసాంఘీక కార్యకలాపాలు నిలువరిస్తారా..?
  • రాజకీయ నాయకులు స్వార్ధం కోసం చెప్పిన మాట వినకుండా న్యాయం వైపు నిలబడతారా..?

ఈ ప్రశ్నలన్నిటికీ లేదు, కాదు అని మాత్రమే సమాధానాలు వినిపిస్తున్నాయి. 

స్టేషన్ చూసినా ఏమున్నది గర్వకారణం.. స్థానిక ఎమ్మెల్యే నామస్మరణం తప్ప.. 

అన్న చందంగా పోలీసు స్టేషన్లు ఉన్నాయని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అప్పు చేసైనా  ఎమ్మెల్యేలకు డబ్బు కట్టేద్దాం.. సిఫార్సు లేఖ తెచ్చేద్దాం.. అధికారి చేతిలో లేఖ పెట్టి పోస్టింగ్ కొట్టేద్దాం.. తర్వాత కౌంటర్ ప్రారంభించి కుమ్మేద్దాం.. అనే ఆలోచన ఉన్న వారికే పోస్టింగ్ అని కొందరు సిబ్బంది చెబుతున్నారు. 

దమ్మున్న పోలీసులకు(ర్యాంకిగ్ విధానంలో) పారదర్శకంగా పోస్టింగ్, బదిలీ వచ్చే రోజుల కోసం ప్రజలు ఎదురు చూడడంలో తప్పులేదు.. వేచి చూద్దాం..  ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచిన ఈ పరంపర ఇప్పటికీ కొనసాగడం శోచనీయం

                                                                                                  
                          

In Association with 
 News9 

Follow us in 




Advertisement