ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్వలాభాలే ప్రజాప్రయోజనాలు ఏవి?





అన్ని స్వలాభాలే ప్రజాప్రయోజనాలు ఏవి?

జగన్ ప్రభుత్వం చెప్పేదంతా ప్రయోజనాలే, కానీ వాస్తవానికి ఎక్కడా కూడా ప్రజాప్రయోజనాలు కనపడవు. కేవలం జగన్ యొక్క అహం చల్లార్చుకోవడానికి కొన్ని విధానాలని తెరపైకి తీసుకువస్తున్నాడు, ఇందులో ముఖ్యంగా సినిమా టికెట్లు రేట్లు దగ్గరనుంచి రాజధాని అంశం వరకు అన్ని జగన్ యొక్క అహాన్ని చల్లర్చుకోవడానికి వేస్తున్న అడుగుల్లో ఒక భాగమేనాని అర్ధమౌతుంది. బయట ప్రపంచానికి ఇది ఏదో ప్రజాప్రయోజనం కోసం చేస్తున్నామని అధికార పార్టీ చెప్పుకుంటున్న ప్రజలు వాస్తవాన్ని గుర్తిస్తున్నారు.

ఒక రాజధాని నిర్మించలేని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఎట్ల నిర్మిస్తుంది ఎట్లా అభివృద్ధి చేస్తుంది అనే ప్రశ్నలు ప్రజల మనసులను తొలిచేస్తున్నాయి. సినిమా టికెట్లు తగ్గించింది పేదల కోసమే అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరూ జగన్ వద్దకు వెళ్లగానే ఆ ఊసే ఎత్తకుండా, ఆ విషయాన్ని కప్పేసి ఇతర ఇతర విషయాల మీద ఫోకస్ చేయటాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు కానీ అహంకారపూరితమైన చర్యలను ప్రజలు స్వీకరించి లేకపోతున్నారు.

మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓపెన్ గా స్టేజి మీద తన మీద ఉన్న పగతో తన అన్నను అవమానిస్తున్నారని తన అన్న నమస్కరించిన జగన్ తిరిగి నమస్కరించే సంస్కారాన్ని దూరంగా పెట్టారని కనీసం తన అన్న వయసుని కూడా పరిగణలోకి తీసుకోలేదని, తమ కుటుంబ సభ్యులు కష్టార్జితంతో ఆస్తులు కూడా పెట్టుకున్నాం తప్ప ఎవరో సొమ్ము దోచుకోలేదని అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా తాము కష్టపడితేనే వచ్చాయని  తమకే ఎటువంటి నేర చరిత్ర లేదని ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్సీపిని ఓడించడమే తన లక్ష్యంగా పవన్ బహిరంగ మీటింగుల్లో మనసులో మాటనే చెప్పగానే చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితము అవుతుంది తప్ప కార్యరూపంలో ఎక్కడ కనిపించడం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పిన జగన్ ప్రస్తుతం ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో కొన్ని విమర్శలైతే బాహాటంగానే వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులాల కుంపటిని రగిలించి ఆ మంటలో అప్పటి పాలక పక్షాన్ని తగలబెట్టి ఆ సెగతో ఎన్నికలు గెలుచుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నా కార్యకర్తలను స్థానిక నాయకులను నిరుత్యాహ పరుస్తున్నారని చెప్పుకోవాలి.

పథకాలు? సామాన్య ప్రజలు ?

కేవలం పథకాలనే నమ్ముకున్న జగన్ ప్రస్తుతం  సీఎం హోదాని తప్ప సామాన్య ప్రజలకి చెరువాలో లేరని చెప్పాలి. విమర్శాత్మకతలో ప్రతిపక్షానికి ఉన్న వెసులుబాటు ఎప్పటికి కూడా పాలకుపక్షానికి ఉండదు. మునుపటి ఎన్నికల్లో జగన్ కి ప్లస్ అయిన పాయింట్ ఇదే, ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే అంశాన్ని ఎత్తుకొని దీన్నే ఆయుధంగా చేసుకొని అప్పటివరకు అధికారంలోకి రాని వైఎస్ఆర్సిపిని విమర్శ అస్త్రములు సంధించే విధముగా పబ్లిసిటీ ఏర్పాట్లు చేసినాడు. ఆ ఫార్ములా ఆంధ్ర ప్రదేశ్ లో బాగా వర్కౌట్ అయింది. కానీ 2024 ఎన్నికల్లో సొంత పార్టీ నుంచే వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశాలు జగన్కు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలియదు అనే అంశం పైన సొంత పార్టీ నాయకులు బయటికి చెప్పుకోలేక కక్కలేక మింగాలేక సతమతమవుతున్నారనేది పార్టీలోనే అంతర్గత సమాచారం.

జగన్ పైన చేసిన అభియోగాలు ప్రజలకు 10 సంవత్సరాల్లో ఏ విధంగా బోర్ కొట్టిందో అదే విధంగా చంద్రబాబు నాయుడు మీద అతని కుటుంబ సభ్యుల మీద చేసే విమర్శలు అభియోగాలు అన్నీ కూడాను ప్రజలకు అదేవిధంగా బోర్ కొడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే జగనన్న యొక్క చర్యలు ప్రజల్లో చంద్రబాబు నాయుడు పైన సానుభూతిని పెంచుతున్నాయి పాలన విధానంలో కూడా చంద్రబాబు నాయుడు జగన్ కంటే మెరుగైన పాలన అందించారనే నానుడు లేకపోలేదు.

ప్రజాస్వామ్యం?

ఇంకా ప్రజాస్వామ్యం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఎన్నడూ కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. పోలీసుల్ని పూర్తిగా తమ కనుసన్నల్లో పెట్టుకున్న జగన్ సర్కార్, సామాన్య ప్రజల యొక్క  భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేస్తున్నారు అనే విషయంలో ఎటువంటి సంకోచం లేదు. పాత్రికేయులు కూడా ఏదైనా విషయం పైన సుదీర్ఘ చర్చ జరపాలన్న ఏదైనా విషయం పైన ఒక వార్తను ప్రచురించాలన్న ఒకటికి పది సార్లు ఆలోచించుకునే భయానకమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్నది అని చెప్పటానికి ఎటువంటి సంకోచం లేదు. జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇవన్నీ రాచరిక అంశాలుగా కనిపించవచ్చు కానీ ఒక్కసారి ప్రతిపక్షంలో వైఎస్ఆర్సిపి 2024 లో లేదా మరెప్పుడైనా వెళ్తే కనుక అప్పుడు కనీసం వీరి పైన సానుభూతి చూపించేవారు కూడా కరువవుతారు అనే చెప్పాలి. 

అవినీతి?

ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ కూడా ఏదో మామ అనే విధముగా పనిచేస్తుంది అని చెప్పాలి. పబ్లిసిటీ 100% కానీ కార్యాచరణలో మాత్రం పక్షపాతి ధోరణి మాత్రమే కనపడుతుంది. చిన్న స్థాయి ఉద్యోగుల్ని వాయిస్ రికార్డులతోనే పట్టుకుంటున్న ఏసీబీ అధికారులు వారి పైన కేసు నమోదు చేయడంలో ఎటువంటి జాప్యం చేయని ఏసీబీ అధికారులు, పై స్థాయి అధికారులు విషయానికొస్తే వీడియో రికార్డింగ్ క్లిప్పులు అనగా లంచం అడుగుతున్న వీడియో రికార్డింగ్ క్లిప్పులు ఇచ్చినా కూడా కేసు నమోదు చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఏదో పబ్లిసిటీ కోసం నాలుగు కేసులు నమోదు చేయడానికి ఒక బలి పశువు కావాలి కాబట్టి చిన్న స్థాయి అధికారుల మీద వారి ప్రతాపం చూపించడం తప్ప పైన స్థాయి అధికారులను ఏమీ చేయలేని వ్యవస్థ నేడు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ( ఇందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయి).

ఏ వ్యవహారం చూసినా స్వలాభం, రాజకీయ ప్రయోజనం తప్ప ఇక్కడ ప్రజాప్రయోజనార్థం జరిగే తంతు ఏమీ లేదు అనేది ఓపెన్ సీక్రెట్. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఇక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న నాయకుడి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి పొట్ట వచ్చినట్టు కనపడుతుంది. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి సామాజిక వర్గానికి లబ్ధి చేకూరే విధంగా 2014 ఎన్నికల తర్వాత ఎన్నో పథకాలను తీసుకొని వచ్చారు, కానీ 2019 వచ్చేసరికి అతన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్లో నెలకొంది. ప్రజలు పథకాల కోసం ఓట్లు వేసే రోజులు పోయాయి ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా తమకు పథకాలు వస్తాయని ధీమా గ్యారంటీ వారికి ఉంది. జగన్మోహన్ రెడ్డికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సింపతితో ఒక్క అవకాశం ఇవ్వటం అనేది జరిగింది. కొత్త మొహం రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఒక్క అవకాశం అంటున్నాడు ఒక్కసారి చూద్దాం ఇప్పుడు కొత్తగా చేసేదేముంది ఉన్న పరిస్థితులు మారకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో ప్రజలు ఒక ఆలోచన చేశారు, కానీ అల్టిమేట్ గా వారి నిర్ణయం తప్పు అనే భావన చాలామందిలో కలుగుతుంది. రాజధాని మార్పు, పరిశ్రమల దూరం చేయడం, రాష్ట్ర ఆదాయానికి  గండి కొట్టకుండా ఉండుంటే జగన్ మరో రెండు టర్మ్ లు సీఎంగా ఉండేవాళ్ళు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు జగన్మోహన్ రెడ్డి మరో మారు ముఖ్యమంత్రి అవ్వటం అనేది అసాధ్యం ఒకవేళ అయినా కష్టంతో కూడుకున్న వ్యవహారం.

ప్రజల్లో వైయస్సార్సీపీ పైన అసంతృప్తి వెలువబడుతుంది. తాము బయట పెడితే స్థానిక నాయకులు వచ్చే పథకాలను ఎక్కడాపెస్తారో అనే భయంతోనూ ఎందుకులే వీళ్ళతో అనే ఆలోచనతోనో ఎవరికి వారు మాకెందుకులే ఎన్నికలు వచ్చిన తర్వాత చూసుకుందాం అనే ఉద్దేశంతో అనేకమార్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క అహాన్ని సంతృప్తి  పరుచుకోవడానికి ప్రజాప్రయోజనార్థం అనే ముసుగులో సినిమా పరిశ్రమల్ని రాజధానుల్ని వివాదాల్లోకి తీసుకురావడం మూలాన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది పెట్టుబడిదారులు నిరాకరిస్తున్నట్టు తెలిసిందే. ఒకవేళ మూడు రాజధానులు అమలుపరిచిన తర్వాత దానిని మళ్లీ యధాస్థితికి తీసుకొని రారు అనే గ్యారెంటీ లేకపోలేదు కేవలం అక్కడ టిడిపి వాళ్లు కమ్మ సామాజిక వర్గ వాళ్లు భూములు కొన్నారు వారికి మాత్రమే భూమి ఉన్నది వారు మాత్రమే బాగుపడుతున్నారు అనేది ఒక బూచి కథ. వాస్తవానికి వైయస్సార్ సీపీలో ఉన్న అధికమంది నాయకులు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే అలాగే చాలామంది వైఎస్ఆర్సిపి నాయకులకి రాజధాని పరిసర ప్రాంతాలలో స్థిరాస్తులు ఉన్నాయి. 

మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో ఈ విధ్వంసానికి పాల్పడుతున్నారు అనేదానికి ఒకే ఒక సమాధానం టిడిపిలో ఉన్న ప్రధాన నాయకులు అందరికీ రాజధాని పరిసర  ప్రాంతాలలో స్థిరాస్తులు ఉన్నాయి వాళ్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే రాజకీయంగా తనని ఎదురుకోవడానికి భవిష్యత్తులో గాని ప్రస్తుతం గాని ఎవరు సాహసించరని ఆలోచన మరొకటి ఏ రాష్ట్రంలో అయినా పాలకపక్షం ప్రతిపక్షం రెండు ఉన్నప్పుడు పాలక పక్షం వారు ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్షానికి ఒక టిప్ అనేది ఇస్తారు కానీ చంద్రబాబు నాయుడు పాలక పక్షంలో ఉన్నప్పుడు రాజధాని విషయంలో అప్పటి ప్రతిపక్షానికి ఎటువంటి టిప్పు ఇవ్వలేదని ఒక విషయం ఈ మధ్యన ప్రజల్లో నానుతుంది.

మొత్తానికి జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాలలో ఆచరణాత్మకంగా వ్యక్తిగత రాజకీయ లాభం తప్ప ప్రజా ప్రయోజనార్థం అన్ని శూన్యంగానే కనిపిస్తున్నాయి ఇది ప్రజలకు కూడా నెమ్మది నెమ్మదిగా అర్థమవుతూ వస్తుంది ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి గెలవలేని పరిస్థితి వస్తే ఆ నాయకులు వేసిన వేషాలకి చేసిన చేష్టలకు ఖచ్చితంగా నూటికి 200% మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని చెప్పొచ్చు. అధికారం రాకముందు అందరినీ కలుపుకొని వెళ్లిన స్థానిక నాయకులు కూడా అధికారం రాంగానే అహంకారహంకారాలు చేస్తూ తమ ఎదుగుదలకు కారణమైన వారిని మరిచి అధికార అహంకార చర్యలను ప్రదర్శించి తాము కూడా నాయకులమేనని నిరూపించుకోవాలని అత్యుత్సాహంతో వేసిన వెధవ వేషాలు చేసిన అహంకారపూరిత పనులకు, భవిష్యత్తులో వీరి పైన సానుభూతి చూపించాలన్న చూపించలేని దుస్థితి, అంటు రోగిని మాదిరిగా చూసే పరిస్థితి ఏర్పడిన ఆశ్చర్యపోవనవసరం లేదు. 

ప్రస్తుతం టిడిపి వాళ్లకు ప్రజల్లో కాస్త సానుభూతి అయినా మిగిలింది కానీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి వైఎస్ఆర్సిపి నాయకులకి వస్తే, కనీసం ప్రజలు సానుభూతి కాదు కదా అయ్యో పాపం అనే దిక్కు కూడా ఉండదు. మీడియా వ్యవస్థలు కూడా వీరిని బహిష్కరించే సూచనలు లేకపోలేదు అదేవిధంగా, గెద్దరెక్కలు చూసి ఆకాశానికి  ఎగరాలనుకున్న కాకి వలె, ప్రతి పిల్ల కాకి నేలకొరిగి సమాజాన్ని ఫేస్ చేయలేక చేసిన ప్రతి పనికి పశ్చాతాపం చెందవలసిన రోజు అనేది ఒకటి వస్తుంది. ఒకవేళ టిడిపి గెలిచిన గెలవలేకపోయినా ఇంతకు మించిన అవమానం ఇంతకు మించిన కౌరవ అవమానం వైఎస్ఆర్సిపి చేయలేదు. టిడిపి గెలిచిన గెలవకపోయినా ఖచ్చితంగా ఒకనాడు వైయస్సార్సీపి అనేది ఓడి తీరాల్సిందే ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. పవర్ అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు. ఈరోజు ఒక చేతిలో ఉన్నది రేపు మరొకరి చేతిలోకి కచ్చితంగా చేరాల్సిందే అది సృష్టి ధర్మం అదే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రాముఖ్యత అదే.

In Association with 
 News9 

Follow us in 




Advertisement