ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి నియోజకవర్గం లో రైతు రధం పధకం లో ఏమి జరిగింది ?




 
    వ్యవసాయ రైతులకి లబ్ది కూర్చే ప్రయత్నం లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన
పధకం. ఈ పధకం లో లబ్దిదారుడుకి వ్యవసాయ యాంత్రిక పనిముట్లు, ట్రాక్టర్ లు సబ్సిడీ క్రింద ప్రభుత్వం అందచేస్తుంది. ఈ పధకాన్ని ఏ రాష్ట్రానికి చెందిన వారు వారి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలముగా పధకం యొక్క పేరు మార్చుకొని అమలు పరిచారు. మన ఆంధ్రరాష్ట్రం లో ఈ పధకం పేరు రైతు రధం.

ప్రభుత్వం ఈ పధకం లో అర్హుల క్రింద లబ్దిదారులను గుర్తించటానికి కొన్ని గైడ్ లైన్స్ జారి చేసింది అందులో ముఖ్యమైనది, అతి ముఖ్యమైన నిబంధన " లబ్దిదారుడు  కనీసం రెండు ఎకరాల భూమి కలిగి ఉండాలి " ఇది మా సొంత కవిత్వం కాదు సమాచార హక్కు చట్టం క్రింద కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా నాయకులు మమ్మిల్లపల్లి వసంత రావు గారు  పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి అగ్రికల్చరల్ ఆఫీస్ నుండి పొందిన సమాచారం .


ఈ సమాచారం ఆయనకి అందిచటానికి సదరు అధికారి,  అది కూడా  సమాచార హక్కు చట్టం క్రింద అందించటానికి ఒక మనిషిని  ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా  ఇబ్బంది పెట్టారు అయినా వసంతరావు గారు లెక్క చెయ్యలేదు, పధకములో అవినీతి జరిగింది అని తెలుసుకున్న వసంతరావు గారు పట్టు విడవకుండా పోరాడారు. ఈ పోరాటం లో కమ్యూనిస్ట్ పార్టీ కి సంబందించన ఒకరి  కుమార్తెని టార్గెట్ చేసి మరీ ఆమెను ఇబ్బందికి గురిచేసిన అధికారులు లేకపోలేదు. అవన్నీ  కేవలం వసంతరావు గారు సమాచారం క్రింద దాఖలు చేసుకున్న అర్జి ని వెనక్కి తీసుకోవటానికి బెదిరింపు చర్యలు. అయిన వాటిని  లెక్క చెయ్యలేదు, " మీరు పెట్టుకోండి రెండు ట్రాక్టర్ లు సేన్** చేస్తాను " అని ప్రలోభ పెట్టారు, అప్పుడు పెద్దాయన,  తన  స్టైల్  లో సమాధానం చెప్పి పంపించారు. సదరు సమాచార అధికారికి, సమాచారం ఇవ్వక తప్పలేదు.

సమాచారం ఏ విధముగా ఇచ్చారు   : ఒక లబ్దిదారుడి పేరు తప్ప అతని ఐ డి మరియు తండ్రి పేరు ఉండదు, అతనికి ఏ ఉరిలో ఎన్ని ఎకరాలు భూమి ఉన్నది అనే వివరం తప్ప సర్వే నెంబర్ ఉండదు. తప్పుని  కప్పి పుచ్చుకోవటానికి చేసే మరో తప్పు, అవినీతి జరిగింది అని అనే పెద్దాయన సమాచారం ఇక్కడతో దృఢ పడింది. ఇంకా అయన తరహ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు.




అవినీతి 

 ఎలాగా జరిగింది ?

ఏ విధముగా జరిగింది ?

అసలు లబ్ది దారులు ఎవరు ?

ఎన్ని దరఖాస్తులు వస్తే ఎన్నిటికి స్పందించారు ?

ములా విరాట్ అ లబ్దిదరుల లిస్టు లో ఉన్నాడా? లేదా ?

ఈ వ్యవహారం లో విలేఖరి మీద తప్పుడు కేసులు పెట్టి అతన్ని లొంగతీసుకున్నారు, ఎందుకు ?

నిస్సహయ మహిళను వేధించవలిసిన అవసరం ఎందుకు వచ్చింది ?


ఈ ప్రశ్నలని చేదించటానికి 46 సంవత్యరాలు రాజకీయ అనుభవము ఉన్న వసంతరావుగారికి ఎంత సేపు , అ సమాచారం తో తరువాత ఆర్టికల్ లో ........

 13-02-2019  ప్రచురణ లో సాక్ష్యాలు మరియు పైన ప్రశ్న లకు సమాధానాలు ...........





సంబందించిన ఆర్టికల్స్















 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement