ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఏంటి ఆ లుంగీ కథ ! ఏలూరు జిల్లా లో ఆ నియోజకవర్గం లో లంచాలు బాహాటంగానే అడుగుతారా ?



ఏలూరు జిల్లా లో ఏ నియోజకవర్గం అది ? 
ఎవరు ఆ సర్ ?
ఏంటి ఆ బేరం ?

16/10/2022 quickandhra.com: ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి నిర్మూలనంటూ తన పరిపాలనలో ఎటువంటి అవినీతి జరిగిన అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటూ టోల్ ఫ్రీ నెంబర్లు వెబ్సైట్లు స్థాపించి అవినీతికి పాల్పడుతున్న వారి వీడియో కానీ ఆడియో కానీ ఉంటే చాలు కేసు రిజిస్టర్ చేస్తాం అని బ్యానర్లు కట్టిచ్చి ఊరు ఊర ప్రచారం చేసి అవినీతి నిరోధక వ్యవస్థ అంటే తన దత్తత స్వీకారం లాగా భావించి ఒక మహాకార్యాన్ని తలపెడితే మరోవైపు లంచగుండిలు ఇవన్నీ తమను ఏం చేయలేవు అనే వ్యవహార శైలిలో వెంట్రుకముక్కను తీసిపడేసినట్టు చాలా బాగా ఇంట్లో హాయిగా కూర్చుని లుంగిల మీద బనియన్ల మీద లంచాలు డిమాండ్ చేస్తూ బయట ప్రపంచానికి తాము చరిత్ర ఎరగని నిజాయితీపరులుగా చలామణి అవుతున్నారు. 
 
అలాగే సోషల్ మీడియాలో తమకంటూ ఒక పెయిడ్ మీడియాని ఏర్పాటు చేసుకొని సొంత డబ్బాలు కొట్టుకుంటూ స్వయం విహారం చేస్తున్నారు. ఈ వ్యక్తిని గురించి తెలియని వాళ్ళు ఎంతటి నిజాయితీపరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు అనే విధంగా ప్రజలకి తన పెయిడ్ సోషల్ మీడియాతో ప్రగల్బాల్ పలికిస్తుంటాడు.

అసలు వీళ్ళ కథ ఏమిటి? ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేయగా సార్ గారు స్వయంగా విలేకరుల్ని లంచాలు అడిగే ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిసింది. సదరు విలేకరు తన మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడని తెలుసుకున్న సార్ వారు ఆ విలేకరి మీద ఒక అబద్దపు కేసు పెట్టారు అనేది సమాచారం ఆ విధంగా అతన్ని భయభ్రాంతులకు గురిచేసి అతని దగ్గర ఉన్న స్ట్రింగ్ ఆపరేషన్ తాలూకా వీడియో బయటకు రాకుండా కట్టుదిట్టమైన ప్రణాళికను తన పేయ్డ్ మీడియా సోషల్ మీడియా ద్వారా రచించారు. క్విక్ ఆంధ్ర నిర్వాహకుల వద్ద ఉన్న సమాచారం ప్రకారం సంఘంలో మహిళలకు జరిగే అన్యాయం పైన కూడా అన్యాయం అంటే సెక్సువల్ హరాస్మెంట్ మీద కూడా ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు అదే సమయంలో కొంతమంది బాధితులు తనకి విజువల్స్ అందజేశారని సదరు విలేకరి ఆ విజువల్స్ కూడా క్విక్ ఆంధ్రకు పంపించడం జరిగింది. 

తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి తప్పు ఒప్పులకు అధికారి అని కానీ, పేదవాడు అనే, కానీ డబ్బున్న వాడు అనే కానీ వ్యత్యాసం ఉండదు కాబట్టి విలేకరి అదే నమ్మకంతో జగన్ గారి మీద నమ్మకంతో జగన్ గారి వ్యవస్థాపన మీద నమ్మకంతో యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ వారికి ఆ విజువల్స్ ని తన ఫిర్యాదుని, తనను ఏ విధంగా బెదిరిస్తున్నారు అనే విషయాన్ని పంపించడం జరిగింది. కానీ సదరు అధికారి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళని కూడా తన కనుసన్నల్లో ఉంచుకోవడం అనేది గమనార్హం.

ఇంకా దయనీయమైన అంశం ఏంటంటే, ఈ అవినీతిని ప్రభుత్వమే పెంచి పోషిస్తుందా అనే అనుమానాలు వచ్చే విధంగా జిల్లా కలెక్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గాని, మున్సిపాలిటీ డైరెక్టరేట్ కానీ ఈ వ్యవహారం పైన పెదవి విపకపోవడం వారికి ఏమైనా ముడుపులందయ్యా ఈ ముడుపులు వాళ్లు ఎవరికైనా ఇస్తున్నారా అనే అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తు ఏసీబీ వాళ్లే ఫోన్ చేసి బాధితుల్ని ఫిర్యాదు వెనక్కి తీసుకోమనడం......? ఈ విషయాల్ని ఆలోచించడానికి ఏం జరిగింది అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద మేధావులు అనవసరం లేదు సామాన్యులకైనా ఈ నియోజకవర్గంలో అవినీతి తాండవం చేస్తున్న విషయం అర్థం అయిపోతుంది. ఇంకా ఈ పరిపాలన మీద ప్రజా కోర్టు కరెక్ట్ ఎక్కడికి వెళ్ళినా డబ్బే పని చేస్తున్నప్పుడు ఒక సామాన్యమైన మధ్యతరగతి విలేకరు తమ వృత్తిరీత్యా పోరాడాల్సిన విధానంలో పోరాటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వ విధానాల్ని రాష్ట్ర అధినేతల ఆదేశాలను క్రింది స్థాయి అధికారులు పైన స్థాయి అధికారులు ఏ విధంగా అమలుపరుస్తున్నారు అనేదానికి ఈ ఒక్క విషయం  పారదర్శకంగా ఉంటుంది.

ఒక్కరోజే అన్ని తెలుసుకుంటే, ఎలాగా, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం
అసలు ఏ వ్యవహారంలో లంచం అడిగారు? 

అసలు ఈ సోషల్ మీడియా పెయిడ్ బ్యాచ్ ఎవరు?

వాళ్ళకి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది?

లంచం యమౌంట్ ఎంత?

ఏసీబీ అధికారులు కేవలం వీఆర్వోల్ని లేదా దిగువ స్థాయి అధికారుల మీద తప్ప పై స్థాయి అధికారులను ఏమీ చేయలేరా?

ఏసీబీ అధికారులకి ఏమన్నా కానుకలు ముట్టినయ?

ఇదంతా కరప్షన్కే కరప్షన్ అనే వ్యవహారమా?

వాడు చేస్తే తప్పు మనం చేస్తే తప్పు కాదు? అంతేనా? వాళ్లకు శిక్ష ఉంది సార్ కి శిక్ష లేదు కనీసం న్యాయస్థానం లో విచారణ కూడా  రాదు, చట్టాలు వీళ్లకు వర్తించవు. డబ్బుతో ఏదైనా చేసేస్తారు? అసలు ఎవరు వీళ్ళు ?

వాయిస్ రికార్డ్ మీద ఎఫ్ ఐ ఆర్ లు రిజిస్టర్ చేసే ఏసీబీ వాళ్లు యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఫుల్ వీడియో చూపించిన ఎందుకని వెనకడుగు వేస్తున్నారు ఏసీబీలోనే సి బి నా. 

త్వరలో దాదాపు 22 నిమిషాలు తో కూడిన వీడియోతో మీ ముందకు కచ్చితంగా వస్తాము ఏ రోజు ఏంటి అని చెప్పము ప్రతిరోజు వెబ్సైట్ ని ఫాలో అవుతూ ఉండండి లుంగీ తో బనియన్లతో ఏం మాట్లాడారు అసలు డీల్ ఎలా సెట్ చేస్తారు అసలు డీల్ ఎలా సెట్ అయింది, రోజుకో అప్డేట్ లేదా రెండు రోజులకు అప్డేట్ వస్తూనే ఉంటుంది. 

ఇంకా ఇంటికెళ్లి తెల్ల బనియన్ వెతుక్కోండి దాచుకోండి. ఇది ట్రైలర్, సినిమా రిలీజ్ కి టైముంది. గుమ్మడికాయ దొంగ భయటకు రావాలి కదా సమయం పడుతుంది....

In Association with 
 News9 

Follow us in 




Advertisement