ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

విజయసాయిరెడ్డి అతని బినామీలా? రెండువేల కోట్ల.....? ఎక్కడ? అసలు ఏం జరిగింది?



విజయసాయిరెడ్డి అతని బినామీలా? రెండువేల కోట్ల.....? ఎక్కడ? అసలు ఏం జరిగింది?

రాజధాని వికేంద్రీకరణ పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కుండ బద్దలు కొట్టినట్టు తెలియజేశారు. ఈ వికేంద్రీకరణలో విశాఖపట్నం ప్రధమ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా విశాఖపట్నంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుకున్నాయి. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రియల్టర్లు పాగా వేశారు. ఈ విధంగా చెందుతున్న అభివృద్ధిని తన బినామీలకి కట్టబెట్టాలనేది విజయ సాయి రెడ్డి యొక్క ఆలోచన అనేది ఒక వర్గపు అభియోగం. ముఖ్యంగా ఈమధ్య వివాదాస్పదంగా మారింది దసపల్లా భూముల వ్యవహారం, సుమారు రెండువేల కోట్ల పైనే విలువచేసే 76000 చదరపు గజాలు భూమి గురించి ప్రస్తుత  ప్రతిపక్షాలన్నీ ఒక్కటిగా కదిలి పోరాటం చేస్తున్నాయి.

అసలు ఈ దశ పల్ల భూముల విషయమేమిటి

విశాఖ నగరంలో టౌన్ సర్వే నెంబర్లు 1027, 10:28, 1196, 1197 లో ఉన్న 76 వేల చద రపు గజాల దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందుతాయని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే 2014లో అప్పటి కలెక్టర్ యువరాజ్ వాటిని  ప్రభుత్వ భూముల నిషేద జాబితా 22ఏలో చేర్చారు. ఆ తర్వాత ఆ తీర్పుపై అప్పీల్ చేశారు. మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూములపై పలు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పార్టీకి చెందిన కీలక నేత సాయంతో ఒక బిల్డర్, వ్యాపారి కలిసి డెవలప్మెంట్ అగ్రి మెంటు కుదుర్చుకున్నారు. అందులో భారీ బహుళ అంత స్థుల భవన నిర్మాణానికి డిజైను కూడా సిద్ధం చేశారు. ఆ -భూములు 22-ఏలో ఉన్నందున వాటిపై డెవలప్ మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయడం కుదరదని అధికారులు చెప్పినా వినకుండా ఒత్తిళ్లు తెచ్చి పెండింగ్ రిజిస్ట్రేషన్  చేయించుకున్నారు. కొంతకాలం ఆగాక రిజిస్ట్రేషన్ల శాఖ వాటిని తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే వాటిని అస్మదీయులకు అప్పగించేందుకు పాత తీర్పు లను ప్రామాణికంగా తీసుకుని. అడ్వకేట్ జనరల్ న్యాయ విభాగం ఇచ్చిన సలహా ప్రకారం ముందుకెళ్లాలని ఉన్నతాధికారులు తాజాగా కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. అంతేకాకుండా ఈ భూమాములపై గతంలో ప్రభుత్వం తరఫున వేసిన కేసులన్నీ హైకోర్టులో, సుప్రీం కోర్టులో ఓడిపోయిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్, క్యురేటివ్ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టేసినందున. అందులో ఎవరైతే, ఉన్నారో వారికే ఆ స్థలం చెందుతుందని పరోక్షంగా పేర్కొ న్నారు. ఈ భూములకు గ్రౌండ్ రెంట్ పట్టా 1958లో ఇవ్వగా, వాటిని రద్దు చేయాలని రెండు దశాబ్దాల తర్వాత కోరడం సరైన వాదన కాదని ప్రభుత్వం తన మెమోలో పేర్కొంది. ఒక కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ఐదేళ్ల అనంతరం మరో కమిషనర్ సమీక్షించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయని, వాటిని చట్టం అనుమతిం చదని చెప్పుకొచ్చింది. ఏతావాతా తేల్చిందేమిటంటే భూములపై సర్వహక్కులు రాజ్ కమలాదేవికే ఉన్నా. యని.. అవి వారికే చెందుతాయని, వాటిని ప్రభుత్వ భూముల జాబితా 22ఏ నుంచి తక్షణమే తొలగించాల నేది పరోక్ష ఆదేశం. అదే ఇప్పుడు కలెక్టర్కు అప్పగించిన బాధ్యత న్యాయపరంగా భూములను ఆయా పార్టీలు .జిస్టర్ చేసుకున్నా.. అవి 22-ఏలో ఉండడం వల్ల వాటిపై ఎటువంటి లావాదేవీలు, నిర్మాణాలు జరపడానికి వీలు కావడం లేదు. ఇప్పుడు వాటికి మోళ్లు కలిగించడమే కలె క్టర్ చేయాల్సిన పని అన్నమాట.

సి బి ఐ 

ఈ భూములు వ్యవహారంలో తనకు నచ్చిన మెచ్చిన బిల్డర్ ఒకరి పేరు మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించాలనేది వైఎస్ఆర్సిపి నాయకులు మరియు ముఖ్య నాయకుడైన ఎంపీ విజయసాయిరెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆ విధంగానే ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అధికార యంత్రాంగాన్ని ఒత్తిడిలకు గురిచేసి ఆ భూమిని 22 ఏ లిస్ట్ లో నుంచి తొలగించి కాజేయాలని తద్వారా తన కుమార్తె అల్లుడికి బినామీ ట్రాన్సాక్షన్ ద్వారా లబ్ధి చేకూర్చాలని విజయసాయిరెడ్డి ప్రణాళిక రచించినట్టు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలియజేస్తూ ఈ వ్యవహారం పైన సిబిఐ వారిని విచారణ జరిపించవలసిందిగా ప్రభుత్వం వారిని వారు డిమాండ్ చేశారు.

అసలు 22 ఏ లిస్ట్ అంటే ఏంటి.
రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 22ఏలో లిస్ట్ అయిన భూమిని ఏ రిజిస్ట్రేషన్ సమస్త వారు రిజిస్ట్రేషన్ చేయడానికి అనర్హులు ఆ లిస్టులో ఉన్న భూములను కేవలం కలెక్టర్ మాత్రమే తొలగించగలరు. 

2019లో జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించగానే 2020 సంవత్సరంలో ఒక కొత్త కంపెనీ సీతమ్మధార విశాఖపట్నం అడ్రస్ తో  వైజాగ్ పోస్ట్ రిసార్ట్స్ ఎల్ఎల్బి అనే పేరుతో రిజిస్టర్ కాబడింది. ఆ తర్వాత 2020లో ఎశ్యుర్ ఎస్టేట్స్ డెవలపర్స్ ఎల్ఎల్పి అనే పేరు మీద మార్పు చేయబడింది. అదే సంవత్సరంలో తన కుమార్తె అయిన పేనక నేహా రెడ్డి అల్లుడు పేనక రోహిత్ రెడ్డి లను డైరెక్టర్లుగా ఆవ్యాన్ రియల్ ఎస్ ఎల్ ఎల్ పి అనే కంపెనీని ఏర్పాటు చేశారు. దశపల్ల భూములు కొన్న 64 మందితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకున్నారు ఆ అగ్రిమెంట్ కి స్టాంపు డ్యూటీగా చెల్లించిన సొమ్మే 9.75 కోట్ల రూపాయలు. అప్పుడే పురుడు పోసుకున్న కొత్త కొత్త కంపెనీలకే అదే సంవత్సరంలో 9.75 కోట్ల రూపాయల ట్యాబ్ డ్యూటీ కట్టేటంత ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం గురించి సిపిఐ విచారణ చేయాలని చెప్పేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మరియు లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేశాయి. అదేవిధంగా దసపల్లా భూములు వ్యవహారంలో జరిగిన అధికార దుర్వినియోగం గురించి, ఇందులో విజయ్ సాయి రెడ్డి పాత్ర గురించి, అతని కూతురి అల్లుడు పాత్ర గురించి విచారణ జరిపించవలసిందిగా వారు కోరారు. ప్రస్తుతం వైజాగ్ లో ఇదే హాట్ టాపిక్.

కొంతమంది జీవీఎంసీ భూములు కూడా కాజాస్తారేమోనని భయాందోళన వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా ఇందులో సిబిఐ విచారణ జరిగితే నిజ నిజాలు బయటకు వస్తాయని అప్పుడు ఎవరు పాత్ర ఏమిటో బహిర్గతం అవుతుందని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

In Association with 
 News9 

Follow us in 




Advertisement