ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

మహిళలపై క్రూరత్వం ఆగడం లేదు? ఈ దేశం ఎటు పోతోంది? ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదా? ఈ హత్యలు ఏమిటి? ఎందుకని?


మహిళలపై క్రూరత్వం ఆగడం లేదు?
ఈ దేశం ఎటు పోతోంది?
ఈ దేశంలో మహిళలకు రక్షణ లేదా?
ఈ హత్యలు ఏమిటి?
ఎందుకని?

లఖింపూర్ ఖేరీ జిల్లా లఖింపూర్‌లో చెట్టుకు వేలాడుతున్న ఇద్దరు బాలికల మృతదేహాలను పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

మృతులిద్దరూ సోదరీమణులు. వారి వయసు 15, 17 ఏళ్లు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ బాలికల బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో లఖింపూర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. కేంద్రమంత్రి తనయుడు తన కన్వర్‌తో రైతులను తొక్కి చంపిన ప్రాంతం కూడా లఖింపురే కావడం తెలిసిందే.

జార్ఖండ్‌లోని దుమ్కా

తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఓ ఉన్మాది నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. . ఈ ఘటన జార్ఖండ్‌లోని దుమ్కా (దుమ్కా) జిల్లాలో చోటుచేసుకుంది.

దుమ్కాకు చెందిన 19 ఏళ్ల యువతి 12వ తరగతి చదువుతోంది.అదే ఏరియాకి  చెందినా షారుఖ్  అనే యువకుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. తన ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో గత మంగళవారం ఆమె నిద్రిస్తున్న సమయంలో కిటికీలో నుంచి  పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 90 శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె ఆదివారం మృతి చెందింది.

 ఉత్తరప్రదేశ్‌లోని హుపూర్‌లో

అన్నం వడ్డించడంలో ఆలస్యం చేసినందుకు 21 ఏళ్ల కుమార్తెను కాటికి పంపించిన తండ్రి. మహ్మద్ ఫరియాద్ (55)కి ఆరుగురు పిల్లలు. అన్నం వడ్డించడంలో జాప్యం కారణంగా ఫరియద్ తన కుమార్తె రేష్మ (21)తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. కూతురు రేష్మ కోపంతో తండ్రితో వాగ్వాదానికి దిగింది. కూతురు ప్రతిఘటనను తట్టుకోలేని ఫరియాద్ పదునైన కత్తితో కూతురిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రేష్మ అక్కడికక్కడే మృతి చెందింది.

హర్యానాలోని ఫతేహాబాద్‌లో

హర్యానాలోని ఫతేహాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ దుండగుడు తన చిన్న కొడుకు ముందే మహిళపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను రైలు నుంచి తోసేశాడు. తర్వాత ఆ వ్యక్తి కూడా దూకాడు. స్టేషన్‌లో వేచి ఉన్న తండ్రికి కొడుకు నిజం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

రాజస్థాన్, మెహదీపూర్ లో

బీహార్ రాష్ట్రంలోని దర్భంగా ప్రాంతంలోని కంథోల్ గ్రామానికి చెందిన ఒక బట్టల వ్యాపారి తన కుటుంబంతో కలిసి రాజస్థాన్ రాష్ట్రంలోని మెహదీపూర్ ప్రాంతంలోని లార్డ్ బాలాజీ మహారాజ్‌ను ఆగస్టు 25న దర్శించుకున్నారు. వారంతా రాత్రికి గెస్ట్ హౌస్‌లో బస చేశారు. అయితే ఉదయం లేచి చూసే సరికి కూతురు 15 ఏళ్ళ నేహ కనిపించలేదు. దీంతో అందరూ అయోమయంలో పడ్డారు. తెలిసిన ప్రాంతాల్లోని ఎంత వెతికినా ఫలితం లేదు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మెహందీపూర్ సమీపంలోని కాలువలో మృతదేహం లభ్యమైంది.

దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. శారీరకంగానే కాదు మానసికంగా కూడా. దేశంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. శారీరకంగానే కాదు మానసికంగా కూడా. మహిళలకు రక్షణ కల్పించడంలో అధికార పార్టీలు విఫలమవుతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాలను దేశంలోని అధికార పార్టీలు ఇంకా కఠినంగా నిరోధించలేదు. మహిళా రక్షణ గురించి దేశ నాయకులు ఇంకా ఆలోచించలేదు. మహిళల పైన దాడులను ఏ నాయకుడు నివారించ లేకపొతున్నారు  ఎందుకు .......? ఒక్కసారి ఆలోచించండి





In Association with 
 News9 

Follow us in 




WhatsApp

Advertisement