ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

" చంద్రబాబు నాయుడు " భరోసా ఇవ్వాలి !

కోవర్ట్ రాజకీయం తో తెలుగుదేశం పార్టీ దారుణంగా  దెబ్బతిన్నది. ప్రతిపక్షం లేకుండా చేద్దాం అనే ఆనాటి చంద్రబాబు నాయుడు చాణిక్య వ్యూహం ఫలించలేదు, చివరికి అదే ఎదురు దెబ్బగా మిగిలింది. అప్పటి రాజకీయ సమీకరణలలో అ వ్యూహం లో దీర్ఘకాలికమైన సమస్యలను ఎవరు గుర్తించలేదో లేక సలహా ఇచ్చిన పట్టించుకోలేదో ?.

మొత్తానికి అప్పటిలో టి డి పి కి పని చేసిన వారంత ఇదేమి చోద్యం అనట్టుగా కళ్లు అప్పగించి చూసారు. ప్రతిపక్షం ఉండకూడదు అనే  వ్యూహం తో పార్టి లో పట్టినంత మందిని టి డి పి లోకి లాగేసి పనిలో చంద్రబాబు నాయుడు నిమగ్నమై ఉండగా, అదే పనిగా టి డి పి లోకి వలస వచ్చిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు మాత్రం స్థానిక టి డి పి ని కబ్జా చేసేసారు అనే చెప్పాలి.

ఇక్క ఎవరికి అర్ధం కానీ ట్విస్ట్ ఏమిటంటే, కొత్తగా వలస  వచ్చిన నాయకులు  టి డి పి పునాదులను పెకిలించే పనిలో ఉన్నారు, పార్టీ కోసం కష్టపడిన నాయకులను వివక్ష , అవమానించడం  తమని నమ్ముకున్న వారికి న్యాయం చెయ్యలేని నిస్సహాయ స్థితి లో వారిని ఉంచటం, సొంత [పార్టీ కార్యకర్తలకు కూడా డబ్బు ప్రభుత్వ ఆఫీస్ లో పని జరగాలంటే చేతులు తడపవలసి వచ్చే పరిస్థితి ఏర్పరచటం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. వై ఎస్ అర కాంగ్రెస్ నుంచి టి డి పి లోకి వలస వచ్చిన నాయకులు వాస్తవానికి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కి విధేయులుగానే పనిచేసారు టి డి పి పార్టీ ని నిస్సహాయత స్థితి లో నెట్టేసి ఎన్నికల సమయం లో వారి వారి సొంత గూటికి వారు చేరుకున్నారు.

టి డి పి పాలక పక్షం లో ఉన్నప్పుడు వై ఎస్ అర కాంగ్రెస్ శ్రేణులకు టి డి పి వారికంటే ఎక్కువ పనులు జరిగేవి, ఇది వాస్తవం, కానీ టి డి పి ఒక్కసారిగా ప్రతిపక్షములోకి రాగానే ఏ ఒక్క టి డి పి నాయకుడుకి పని జరగటంలేదు, ఎందుకు ? చంద్రబాబు వ్యూహం మంచిదే కానీ తన పార్టీ లో ప్రజాస్వామ్యాన్ని విస్మరించటం సరి దిద్దుకోలేని పొరపాటు, ఆ పొరపాటుకు మూల్యమే ప్రస్తుత ప్రతిపక్ష హోదా కు కారణాలు.

కార్యకర్తలే నా బలం, ఏం తమ్ముళ్ళు ఇది సరిపోదు, నియోజకవర్గ స్థాయిలో ప్రతి గ్రామానికి తిరగలి ప్రతి కార్యకర్తను పలకరించాలి, మునపటి పొరపాటులు మరేన్నాడు జరగవనే భరోసా కార్యకర్తలలో, స్థానిక నాయకులలో కలగాలి అదే జగన్ మోహన్ రెడ్డి చేసింది, నా రూపాయి ఖర్చవ్వకుడదు ప్రజలలో వ్యతిరేకత వచ్చిన నాడే పార్టీ మళ్ళి వస్తుంది అనుకుంటే పార్టీ కి కష్టమే. రాజకీయ నాయకుడు ప్రజలలో ఉండాలి, ఉండి తీరాలి .కార్యకర్తలు ప్రజలలోని కొందరు, ప్రజలంతా కార్యకర్తలు కాదు అనే విషయం గ్రహించాలి.