ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆమె మాతృత్వం పైన నిందలు! శ్రుతి మించిన అధికార మదం !

నారా భువనేశ్వరి 

రాజకీయం దిగాజరవచ్చు కానీ మరి ఇంటిలో ఉన్న ఆడవాళ్ళ పైన, రాజకీయానికి ఏ రకమైన సంబంధం లేని ఆడవారి పైన ఏ మాట పడితే ఆ మాట అనేనంతగా దిగజారకూడదు.  అది అసెంబ్లీ రాష్ట్రం మొత్తం  వీక్షించే ప్రాంగణం, అక్కడ చిన్న మాట కూడా చిటిక వేసే సమయములో రాష్ట్రం మొత్తం వ్యాపిస్తుంది. 

అసెంబ్లీ లో  చంద్రబాబు నాయుడు టర్మ్ వచ్చినప్పుడు అతను అన్న మాటలు ఇవి " అధ్యక్షా సభ సంప్రదాయలు  అధ్యక్షా , ఒకసారి వాళ్ళు రైజ్ చేసి ఒక మెంబెర్ని విమర్శించినప్పుడు , ఆ మెంబెర్ కూడా ఈ హౌస్ ద్వార ప్రజలకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలి అధ్యక్షా , అధ్యక్షా ఇంకా అధ్యక్షా, ఒక ఏదైన సరే అధ్యక్షా ఈ హౌస్ లో చెప్పేసి పారిపోవటం కాదు అధ్యక్షా, చెప్పినదానికి కూడా మేము చెప్పేది విని, నికేమన్న సత్తా ఉంటె సమర్దవంతముగా నువ్వు చెప్పు అన్ని డిస్కస్ చేద్దాం,  బాబాయి గొడ్డలి బెట్టు దగ్గర నుంచి, తల్లి కి ద్రోహం చేసిన దగ్గరనుంచి అన్ని డిస్కస్ చేద్దాం "  ఇందుకు అధికార పార్టీ నుంచి వచ్చిన ప్రతి విమర్శ " లోకేష్ ఎలా పుట్టాడు  "

ఇంతక మునుపే లోకేష్ ఫోటో మరియు దివంగత నేత ఒకరి ఫోటో పెట్టి సోషల్ మీడియా లో ట్రోల్ చేయించారు. ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు యెన్ టి ఆర్ కు వెన్నుపోటు పొడిచాడు అనే విమర్శలు, ఇప్పుడు చూస్తే అదే నోటి తో యాన్ టి ఆర్ కుమార్తె భువనేశ్వరి మాతృత్వం పైన అసభ్య కరమైన పరోక్ష విమర్శలు. 

సరే నారా చంద్రబాబు నాయుడు యన్ టి ఆర్ కు ద్రోహం చేసాడు, అయన పార్టీ లాగేసుకున్నాడు, కానీ వై ఎస్ ఆర్ సి పి అధినేత జగన్ చేసింది ఏమిటి? "రాజధాని లో చంద్రబాబు నాయుడు కి సొంత ఇల్లు లేదు, నేను ఇక్కడ ఎంతో ఖర్చు చేసి ఇల్లు కట్టుకున్న "  అంటేనే కదా రాజధాని ప్రజలు నమ్మి ఒక అవకాశం ఇచ్చింది మరి దిన్ని ద్రోహం గా వెన్నుపోటు గా ఎందుకు పరిగణించకూడదు  అని చాల మంది అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.  

చంద్రబాబు నాయుడు అధికారం లో ఉనప్పుడు మహా అయితే జగన్ మోహన్ రెడ్డి కేసు లు మీద ప్రత్యక్ష విమర్శలు ఉండేవి తప్ప ఎన్నడు కూడా జగన్ మోహన్ భార్య మీద కానీ అతని కుటుంబం లో ఉన్న ఆడవారి గురించి కానీ ఇటువంటి స్థాయి తక్కువ విమర్శలు  చెయ్యలేదు. ఇది ముమ్మాటికి ఖండించదగ్గ చర్య, సున్నితమైన విషయాలు, అత్యంత స్థాయి తక్కువ రాజకీయలను ప్రేరేపించే ఇటువంటి చేష్టలు సిగ్గు చేటు.  

అసలు రాజకీయాలకు సంబంధం లేని ఇంటిలో ఉన్న ఆడవాళ్ళను ఉద్దేశించి,వారి యొక్క మాతృత్వాన్ని సైతం కించ పరిచే విధముగా అసెంబ్లీ స్థాయలో వ్యాఖ్యలు చెయ్యటం రాజకీయ విలువలను ఎక్కడికి తిసుకేల్తుందో అక్కడ ఉన్న నాయకులకే తెలియాలి. 
   


In Association with