ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వ్యాక్సిన్ ప్రజలకు అందిచలేక పుకారులా ?
ప్రపంచం రెండు మహమ్మార్లతో బాధించాపడుతుంది అని  ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. ఒకటి కరోనావైరస్ వ్యాప్తి, కానీ మరొకటి, అంతే ప్రమాదకరమైనది, తప్పుడు సమాచారం , అలాగే  తప్పుడు సమాచారం యొక్క వ్యాప్తి గురించి. వైరస్, చికిత్సలు, వ్యాక్సిన్‌లు, మాస్క్‌లు మరియు మహమ్మారి యొక్క ప్రతి ఇతర అంశాల గురించి తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం పుట్టుకొచ్చింది.

ఉద్దేశపూర్వకంగా పుకార్లు వ్యాప్తి :

విటమిన్ సప్లిమెంట్లు, పుస్తకాలు మరియు DVDలను విక్రయించడంలో లేదా వారి స్వంత ప్రభావాన్ని పెంచుకోవడంలో సహాయపడటానికి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఈ పుకార్లను వ్యాప్తి చెందిస్తున్నారు. కానీ చాలా మంది తమ  స్నేహితులు  లేదా బంధువుల  నుండి తప్పుడు సమాచారాన్ని విని ఉండవచ్చు, దానిని సోషల్ మీడియాలో చూసి ఉండవచ్చు లేదా సెలబ్రిటీలు లేదా రాజకీయ నాయకులు ద్వార  పదే పదే వినుండవచ్చు. యునైటెడ్ స్టేట్స్‌లో కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నిర్వహించిన ఒక సర్వేలో, దాదాపు 10 మందిలో 8 మంది వ్యక్తులు మహమ్మారి గురించి కనీసం నిరాదర  అబద్ధాన్ని విశ్వసిస్తున్నారు అనేది సమాచారం. దాదాపు 46 శాతం మంది ప్రజలు మహమ్మారికి సంబంధించిన ఒకటి నుండి మూడు అబద్ధాలను విశ్వసిస్తున్నారు , మరియు 32 శాతం మంది నాలుగు లేదా అంతకంటే ఎక్కువ తప్పు ప్రకటనలు నిజమా లేదా అబద్ధమా అనే సందిగ్థత అవస్థలో అనిశ్చితంగా ఉన్నారు. సర్వేలో 22 శాతం మంది పెద్దలు మాత్రమే తప్పుడు ప్రకటనలను నమ్మలేదు.

కరోనావైరస్ వ్యాక్సిన్‌లు వంధ్యత్వానికి కారణమవుతాయని ఒక పుకారు ప్రపంచమంతా షికారు చేస్తుంది. సర్వేలో, 8 శాతం మంది ప్రజలు ఆ తప్పుడు ప్రకటనను నమ్ముతున్నామని  చెప్పారు. సర్వే చేయబడిన మరో 23 శాతం మంది వ్యక్తులు టీకాలు మరియు వంధ్యత్వానికి మధ్య సంబంధాన్ని అధ్యయనాలు చూపించాయో లేదో ఖచ్చితంగా తెలియదు అని తెలియ చేసారు.  అది కాకుండా సెలబ్రిటీలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినప్పుడు కల్పితం నుండి నిజం భయటకు రావటానికి ఏది సహాయం చెయ్యదు. ఇటీవల, గ్రీన్ బే ప్యాకర్స్ క్వార్టర్‌బ్యాక్ ఆరోన్ రోడ్జెర్స్, పీపుల్ మ్యాగజైన్ నివేదించినట్లుగా, COVID-19 వ్యాక్సిన్ వంధ్యత్వానికి కారణమవుతుందనే ఆందోళనల కారణంగా టీకాలు వేయడం తమ విఫలత్వాన్ని సమర్ధించుకోవటానికి ఈ విధమైన పుకారులు లేపుతున్నారు అనే అభిప్రాయాలూ లేకపోలేదు. ట్రినిడాడ్‌లోని తన బంధువు స్నేహితురాలు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వృషణాలు వాపుకు గురయ్యాయని రాపర్ నిక్కీ మినాజ్ ట్వీట్ చేయడం జరిగింది. CNN ప్రకారం, ట్రినిడాడ్ మరియు టొబాగో ఆరోగ్య మంత్రి ఆ వాదనను వివాదాస్పదం చేశారు.

ఈ పుకార్లను కేవలం అథ్లెట్లు మరియు సెలబ్రిటీలు మాత్రమే వ్యాప్తి చెందించటం లేదు , అయితే COVID-19 వ్యాక్సిన్‌లు మరియు వంధ్యత్వం గురించి తప్పుడు పుకార్లను వ్యాప్తి చేయడం ప్రతిచోటా ఉంది. కెన్యా రాజధాని నైరోబీలోని అనధికారిక స్థావరమైన కిబెరాలో, కమ్యూనిటీ హెల్త్ వాలంటీర్లు వ్యాక్సిన్ పొందడం గురించి రెండు ప్రధాన ఆందోళనలను విన్నారు: “దీని తర్వాత నాకు పిల్లలు పుట్టవచ్చా?” మరియు "నాకు మధుమేహం లేదా క్యాన్సర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే నేను వ్యాక్సిన్ తీసుకోవచ్చా?" టీకా పంపిణీని సమన్వయం చేయడంలో సహాయపడే అంతర్జాతీయ లాభాపేక్షలేని సంస్థ CFK ఆఫ్రికా యొక్క ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎడ్డా ఒగోగో మాట్లాడుతూ, ఆ ప్రశ్నలను ఎవరు అడుగుతున్నారు అనేది ముఖ్యమైన విషయంగా పరిగణించారు, ఎందుకంటే అడిగినవారి వయస్సు  విషయములో తేడా ఉంది. "యువ జనాభా వంధ్యత్వం గురించి భయపడుతుంటే, వయో వృద్దులు మాత్రం  కొమొర్బిడిటీల గురించి భయపడుతున్నారు.

ఇందుకు సులభమైన మార్గం ప్రజలతో సున్నితముగా సంభాషణ చేసి వారికి నమ్మకం కలిగించటం  వ్యాక్సిన్ వారి మందులకు అంతరాయం కలిగించదని మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు COVID-19 యొక్క అత్యంత తీవ్రమైన సమస్యల తో బాధ పడేవారిన బాధ ను   నివారించడంలో సహాయపడవచ్చని ప్రజలకు భరోసా ఇవ్వడం ద్వార ప్రజలలో నమ్మకం కలిగించవచ్చు అని చాల మంది అభిప్రాయ  పడుతున్నారు.

స్థానిక మరియు గ్లోబల్ న్యూస్ అవుట్‌లెట్‌లు తరచూ కోవిడ్-19 వ్యాక్సిన్‌లు వంధ్యత్వానికి కారణమవుతాయని అనే వార్త లో  ఎటువంటి ఆధారాలు లేవని నిర్ధారణ చేస్తున్న,పుకార్ల ముందు అవి నిలువలేకపోతున్నవి. టీకాలు వంధ్యత్వానికి కారణం కాదని రుజువులు ఉన్నాయి.


 వ్యాక్సిన్‌లను పరీక్షించే క్లినికల్ ట్రయల్స్‌లో, వ్యాక్సిన్ గ్రూప్ మరియు అన్‌వాక్సినేట్ కంట్రోల్ గ్రూప్ రెండింటిలోనూ అనుకోకుండా గర్భం దాల్చినవరున్నారు. గర్భస్రావం రేట్లు కూడా సారూప్యంగా ఉన్నాయి, పరిశోధకులు అక్టోబర్ 21న ప్రచురించిన లాన్సెట్ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్‌లో గర్భాలను పరిశీలించారు. 

ఇజ్రాయెల్ నుండి 15,000 కంటే ఎక్కువ మంది గర్బిణిలకు  వాక్సినేషన్ ద్వార ప్రయోజనాలు పొందినట్టుగా తెలుస్తుంది. ఫ్యజర్(Pfizer) మరియు దాని జర్మన్ భాగస్వామి బయోఎన్‌టెక్ నుండి దాదాపు సగం మంది గర్భిణీలకు వ్యాక్సిన్‌ను అందించారు. కేవలం 2 శాతం మంది మాత్రమే కరోనావైరస్ బారిన పడ్డారు - అది కూడా  వారి మొదటి మరియు రెండవ షాట్‌ల మధ్య  గ్యాప్ లో. కానీ టీకాలు వేయని మహిళల్లో, ఇన్‌ఫెక్షన్ రేటు పెరుగుతూనే ఉంది, అధ్యయనం ముగిసే సమయానికి 4 శాతానికి చేరుకుంది, గర్భధారణ సమయంలో టీకాలు వేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చని సూచిస్తున్నారు,  ఇదే విషయాన్పని రిశోధకులు జూలైలో జామ (JAMA)లో నివేదించారు.
In Association with 
 News9 

Follow us in