వై యస్ ఆర్ సిపి & టి డి పి సెర్చ్ రికార్డు

Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Thursday, 14 November 2019

నేను జగన్ కి సపోర్ట్ చేస్తాను: వల్లభనేని వంశీ


నేను జగన్ కి సపోర్ట్ చేస్తాను: వల్లభనేని వంశీ
వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు 1995 నుంచి తెలుసని కానీ జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా కలవటానికి ఎన్నడు తాను వెళ్లలేదని ఎందుకంటే తాను పార్టీకి అత్యంత కట్టుబడి ఉన్నానని పార్టీ కోసం స్నేహాన్ని బంధాన్ని లెక్కచేయకుండా పని చేశానని చెప్పారు వల్లభనేని వంశీ.
రాజకీయాలు 


అలాగే వైకాపా ప్రస్తుతం నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఇంకా నూతన ప్రభుత్వానికి పురిటి వాసన పోలేదని, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఇసుక విషయంలో అంత రాద్ధాంతం చేయడం తగదని వంశీ విలేకర్ల సమావేశంలో వెల్లడి చేశారు.


ఆర్టికల్స్


జూనియర్ ఎన్టీఆర్ 2009లో తన భవిష్యత్తును త్యాగం చేసి టీడీపీకి సపోర్ట్ గా ప్రచారం చేశారు కానీ ఇప్పుడు డు 2014 ఎన్నికలకు అలాగే 19 ఎన్నికలు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ పార్టీకి పదేళ్లు దూరంగా ఉండవలసి వచ్చిన పరిస్థితులు ఏమిటి అనే ప్రశ్నను వంశీ సంధించారు.

క్రైమ్ 


జగన్ కి మద్దతు ఇవ్వడం వలన తనకు వ్యక్తిగతంగా ఎటువంటి లాభం లేదని తనని నమ్ముకున్న కార్యకర్తలకు ప్రజలకి మాత్రమే లాభం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పదవి ఉన్నప్పుడు అవసరం లేకున్నా అవసరం లేకున్నా ధర్మ పోరాట దీక్ష పేరుతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుజనా చౌదరి లాంటి వ్యక్తుల కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్లొద్దు అని చెప్పిన వారిని లెక్కచేయకుండా కేంద్రంతో అనవసర వైరాన్ని కొని తెచ్చుకొని ప్రస్తుత పరిస్థితులకు కారణం ఎవరు ఆలోచించి చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.


సినిమాలు 
చంద్రబాబు నాయుడు ఎందుకని హైదరాబాదులో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొనలేదు అనే ప్రశ్నను వంశీ లేవనెత్తారు! అక్కడ ఒకవేళ నోటికి ఓటు కేసు గురించి భయపడ్డారా అనే ప్రశ్నను అని సూటిగా ప్రశ్నించారు. అలాగా కేసులు గురించి భయపడే వ్యక్తిని తాను కాదని కేవలం తనను నమ్ముకున్న వర్గం కార్యకర్తల క్షేమం కోరి తాను జగన్ కు మద్దతు తెలిపానని నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయం అని వివరించారు.