ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

తెలుగుదేశం పార్టీ లో నిజంగానే అధినేత కి ముఖ్య నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడిందా ?

తెలుగుదేశం పార్టీ లో నిజంగానే అధినేత కి ముఖ్య నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడిందా ?


2014 ఎన్నికలలో మండల స్థాయి నాయకులూ పనితీరు చాల బాగుంది. వారిని చూసి ఓటు వేసినవారు ఎక్కువమంది. అప్పటికే 10 ఏళ్ళు ప్రతిపక్షం లో ఉన్న   తెలుగుదేశం ఒక్కసారిగా పాలకపక్షం లోకి రావటానికి ముఖ్య కారణము ఈ నాయకులే. అయితే అంత కష్టపడి పని చేసిన నాయకులకు పవర్ లోకి వచ్చిన తరువత గుర్తింపు తగ్గింది అనే చెప్పాలి . అప్పటిలో ఎంత వరుకు అమరావతి , పోలవరం మీద ఫోకస్ చేసిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్రింద స్థాయి లో జరిగే పొరపాట్లను అంతగా పట్టించుకోలేదు అనే చెప్పాలి.  మండల స్థాయి లో కష్టపడిన నాయకులను అంతగా పట్టించుకోకపోవటం , వారిని చూసి ఓటు వేసిన కార్యకర్తల మరియు అభిమానులా  మనోభావాలు దెబ్బతినతినటం పార్టీ కి మరో మైనస్ అని చెప్పాలి. 



రాజకీయాలు 


లోకేష్ :- లోకేష్ కి రాజకీయ అనుభవం లేకపోయినా పార్టీ అంతర్గత వ్యవహారాలలో తల దూర్చటం బెడిసికొట్టింది అనే చెప్పాలి. ఏ విధముగా అంటే లక్ష్మి పార్వతి ని వాడుకొని అప్పటిలో యన్ టి ఆర్ ని  అల్లరి చేసారో ఇప్పుడు లోకేష్ ని వాడుకుని చంద్రబాబు ని అలాగా అల్లరి చేస్తున్నారు. లోకేష్ ని డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు, దీన్నే కర్మ ఫలం అని చెప్పాలి.  లోకేష్ స్వయం కృతాపరాధం.  బాధ్యత గల పదవి లో ఉండి నోటికి ఏమొస్తే అది మాట్లాడివెయ్యటం ఎంతటి పరిణామానికి దారి తీస్తుంది అనే దానికి లోకేష్ చేష్టలు మంచి ఉదాహరణ.


ఆర్టికల్స్




లక్ష్మీపార్వతి -లోకేష్ : యన్ టి ఆర్ అధీనంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లక్ష్మీపార్వతి ని అడ్డుపెట్టుకొని పార్టీ లో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు రెచ్చగొట్టిన వైనం అందరికి తెలిసిందే.  ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల ని క్షుణ్ణముగా గమనిస్తే అదే విధముగా తెలుగు దేశం పార్టీ  లో లోకేష్ విషయములో కూడా అవే అంతర్గత విభేదాలు భయటపడుతున్నవి.
లోకేష్ - తెలంగాణ టి డి పీ : లోకేష్ రాజకీయాలలో  ఎదగాలి  అంటే అతనికి రాజకీయ అనుభవము ఖచ్చితముగా అవసరం . అటువంటి సందర్భం లో  నేరుగా అతనికి మంత్రి పదవి ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నాయకుల నెత్తి మీద అతన్ని కూర్చో పెట్టటంకంటే తెలంగాణ రాజకీయాలలో కీలక వ్యక్తి గా నియమించి ఉంటె బాగుండేది అనేది చాల మంది అభిప్రాయం.
చంద్రబాబు నాయుడు పొరపాట్లు :
1.  వనజాక్షి విషయం లో చింతమనేని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా, వనజాక్షి ని  ఇంటికి పిలిపించి రాజి కుదర్చటం అనేది మొదటి పొరపాటు. ఈ  విషయం రాష్ట్రం మొత్తం అల్లరి అయ్యింది.
2. క్రింద స్థాయి క్యాడర్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా, మండల స్థాయి నాయకులను నిర్లక్ష్యం చేసి వారి గోడు పట్టించుకోకుండా, ఎంత వరుకు పోలవరం, అమరావతి అనే అంశం పైన ఎక్కువ శ్రద్ద చూపించటం.
3. క్రింద స్థాయి నాయకులలో అవినీతి ని (కమిషన్  వ్యవస్థ ను ) అరికట్టలేకపోవటం. 
4. ప్రశాంత్ కిషోర్ యొక్క  ప్రణాళికలు పసిగట్టలేకపోవటం, పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకోవటం . 
5. మీడియా లో పార్టీ కి అనుకలుముగా వార్తలు వస్తే చాలు అనే ఆలోచన విధానం, వాస్తవాలకు చాల దూరం చేసింది.
6. పబ్లిసిటీ మేనేజిమెంట్ లో  నిర్లక్ష్యం వహించటం.
7. "నేను" అనే పదం  !!!
8. లోకేష్ ని ఆంధ్రరాష్ట్రం రాజకీయాలలో మరియు పార్టీ లో కీలక వ్యక్తి గా  మలచాలి అనే ఉద్దేశం తో ఏం ఎల్ సి కోట లో మంత్రి ని చెయ్యటం.


క్రైమ్ 




అన్ని అంశాలు  కలిపి ఒక్కసారిగా ఎన్నికలలో  ప్రతికూల ప్రభావం చూపించాయి.
ఓటరు : ఓటరు ఒక్కసారి మార్పు ఆశించాడు.  ఒక్క అవకాశం అనే మాట ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది . కమిషన్ వ్యవస్థ తో విసిగిపోయిన మధ్య తరగతి, దిగువ తరగతి వారు ఒక్కసారిగా మార్పు కావాలని కోరుకున్నారు.


సినిమాలు 




ఓటరు : ఓటరు ఒక్కసారి మార్పు ఆశించాడు.  ఒక్క అవకాశం అనే మాట ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది . కమిషన్ వ్యవస్థ తో విసిగిపోయిన మధ్య తరగతి, దిగువ తరగతి వారు ఒక్కసారిగా మార్పు కావాలని కోరుకున్నారు. అయితే ప్రస్తుతం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిషన్ వ్యవస్థను ఎలాగ ఎదురుకుంటుంది అనేది ప్రశ్నర్ధకం . ఎందుకంటె ఏ పార్టీ లో అయిన ఈ  వ్యవస్థ ఉంటుంది, కానీ ఏ స్థాయి వరుకు పరిమితం అవుతుంది అనే అంశం పైన ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వం మీద ఒక అభిప్రాయానికి వస్తారు.



To Read in English










Advertisement