ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

" హనీ ట్రాప్ " ఎలాగా ? ఎవరిని ? ఎందుకు ? డిఫెన్స్ - 383, 389 ipc   

ఈ భూ ప్రపంచం లో ప్రతి జివి ప్రకృతి లో భాగమే, మనిషి అందుకు మినహాయింపు కాదు. సృష్టి కార్యం లో సహజ కోరికలు మనిషి యొక్క సహజ లక్షణం. అ సహజ కోరికలు కొందరి బలహీనతలు గా మారతాయి, అవి ఉగ్ర రూపం దలిస్తే వికృత చేష్టలు భయట పడతాయి. కానీ సహజ కోరికలను బలహీనతగా మర్చి, భయ పెట్టి పని చేయించుకోవటం, లేదా కావాల్సింది బెదిరించి తీసుకోవటం హనీ ట్రాప్పింగ్ అని చెప్పవచ్చు.

నిఘా సంస్థల లో కీలక పదవులు నిర్వహించే వారి పైన ఇటువంటి హనీ ట్రాప్ లు ఎక్కువ జరుగుతు ఉంటాయి, లేదా సమాజం లో కీలక పాత్రా వహించే వారి పైన కూడా ఈ హనీ ట్రాప్ లు ఎక్కువ జరుగుతు ఉంటాయి.


ప్రస్తుతం అంతరజాలం విస్తృతముగా వినియోగం లో ఉండటం వలన  హనీ ట్రాప్ ల లో చాల మంది ఇర్రుకొని పోతున్నారు. పైన తెలిపిన వారు తమ కి కావాల్సిన సమాచారాల కోసం హనీ ట్రాప్ లు వేస్తుంటే, ప్రస్తుతం ప్రస్తావనలో ఉన్నవారు మాత్రం బ్లాక్ మెయిల్ కి పాలుపడి డబ్బు లు గుంజటానికి ఈ హనీ ట్రాప్ ల కు పాలుపడుతున్నారు.

రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టలను వాడుకొని, ఏ విధముగా దుర్వినియోగ పరిచి తమ దారి కి తెచ్చుకోవాలి అనే విషయం తెలుసుకొని మరి ట్రాప్ చేసి ఆటడేసుకుంటున్నారు.

ఈ హనీ ట్రాప్ ని  భారత దేశ రక్షణ వ్యవస్థ సైతం చాల సీరియస్ గా తీసుకోని, నియంత్రణకి తగిన చర్యలు తీసుకోని, తమ సైనికులు ప్రత్యర్ది దేశాల భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది, అంటే ఇది ఎంత ప్రమాదకరమైన ఉచ్చో ఉహించాకోవచ్చు.


సోషల్ మీడియా ద్వార : సోషల్ మీడియా ద్వార పరిచయలు పెంచుకొని, ఎంతో అభిమానం, ప్రేమ, ఇష్టాలు , కష్టాలు, అభిరుచులు తెలుసుకుంటారు, అటు వైపు అమ్మాయి అని తెలియగానే ఆమె చెప్పేది నిజామా అబ్బాద్దమ అనే విషయం ఆలోచించకుండా అన్ని విషయాలు ఇటు నుంచి అటు  చేరవేసి ఏదో ఒక రోజున వారిని కలిసి చేసిన ప్రకృతి కార్యాలను కెమెరా లో బందించి, సమాజం లో బట్టబయలు చేస్తాము అని బెదిరించి  డబ్బులు గుంజుతారు.  లొంగక పోతే చట్ట రిత్య ఉన్న వెసులుబటులను ఉపయోగించుకుంటారు ఇది " ఓపెన్ సీక్రెట్ ".

మెట్రిమోనియల్  వెబ్ సైట్ : కొత్త ఉద్యోగం వచ్చిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, సంపన్నులు విరే వారి టార్గెట్. వివాహం చేసుకొని భర్త పైన కేసులు పెట్టి డబ్బులు గుంజి అ పైన విడాకులు తీసుకోని, మెట్రిమోనియల్  వెబ్ సైట్ లో అవివాహితులు గా ప్రొఫైల్ సృష్టించి పరిచయం పెంచుకుంటారు . అ పైన లైంగిక సంభంధాలకి ప్రేరేపిస్తారు.  పొరపాటున ఒక్కసారి వారి ఉచ్చులో ఇర్రుకుంటే అయితే భారి మూల్యం అయిన చెల్లించాలి లేదా కటకటాలు అయిన లెక్కించాలి.  చట్టం లో ఉన్న వెసులుబాటులు ఉపయోగించుకొనిఈ బ్లాక్ మెయిల్ నడుస్తుంది.

కేసులు ఎందుకు పెడతారు : దంద ! బ్లాక్ మెయిల్ చెయ్యాలి అదే వృత్తి గా పెట్టుకున్న వారికీ మరొకరికి భయం కలిగించాలి అంటే ఇదే బ్రమ్మస్త్రం. ట్రాక్ రికార్డు అని చెప్పవచ్చు.

ఈ  మెట్రిమోనియల్  వెబ్ సైట్ బాధితుల లో స్త్రీ పురషులు ఇద్దరు సమానముగా నే మోసపోతరు. నాకు నెలకి లక్ష జీతం అంటే మోసపోయిన అమ్మాయిలు ఉన్నారు, అలాగే నాకు పెళ్ళి కాలేదు అని విడాకులు తీసుకోకుండా, తీసుకోని ఫేక్ ప్రొఫైల్స్ ట్రాప్ లో పడిన అబ్బాయిలు, మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు.

డిఫెన్సు ఎలాగా ?

ట్రాప్ లో పడిన చాల కొద్ది రోజులకే వారికీ అర్ధమౌతుంది వారు ట్రాప్ చేయ్యపడ్డారు అని, కానీ అ విషయాలని భయటకు చెప్పటానికి, ఎవరి వద్ద అయిన ప్రస్తావించటానికి చాలామంది సంకోచిస్తారు (ఫాల్స్ ప్రెస్టేజ్), లేదా భవిష్యత్తులో విరి వద్ద నేను తగ్గి ఉండాలి ఏమో అనే అహం భావం, లేదా నా గురించి ఏమనుకుంటారు అనే భయం, రకరకాల మానసిక ఒత్తిడుల ములన భయటకు చెప్పుకోలేక వారిలో వారె మదన పడి అన్ని దారులు మూసుకొని పోయాక అప్పుడు బహిర్గతం అవుతారు. ఇదే చాల మంది చేసే పెద్ద తప్పు, ఈ తప్పు మూల్యం ఎంత అంటే తప్పుడు ఉద్దేశం(ill intention) తో ట్రాప్ చేసేవారికి చట్టం లో వెసులుబాటులు ఉపయోగించుకునేటంత, అలాగే సమాజం వారి పైన జాలి చూపించేటంత.

సెక్షన్ 383 ఐ పి సి ( ఇండియన్ పీనల్ కోడ్ ) : ఎవరి నైన భయబ్రంతులను చేసి, బెదిరించి వారి వద్దనుంచి బలవంతపు వసూళ్ళు కి పాలుపడితే  వారికీ సెక్షన్ 384 ఐ పి సి  మూడేళ్ళ శిక్ష.

అలాగే బలవంతపు వసులు కోసం  ఎవరైన ఒక మనిషి పైన నేరాలు అభియోగిస్తాను అని  బెదిరింపులకు పాలుపడితే  సెక్షన్ 389 ఐ పి సి ప్రకారం 10 సంవత్యరాల జైలు శిక్ష .

ఇంకా మెట్రిమోనియల్  వెబ్ సైట్ నఖిలి వివరాలు పొందుపరిచి ట్రాప్ చెయ్యటం అనేది సైబర్ నేరం. ఒక వెబ్ సైట్ లోని డేటా సర్వర్ ప్రొవైడర్ దగ్గెర  ఉంటుంది డిలీట్ చేసిన డేటా తో సహా

హనీ ట్రాప్ అని తెలియగానే ముందుగానే సంబంధిత అధికారుల వద్ద  ఫిర్యాదు దాఖలు  చేస్తే తమని తము రక్షించుకోవటమే కాకుండా చాల మందిని రక్షించినవారు అవుతారు .  ఎందుకంటె ఈ బలవంతపు వసూళ్ళు కి పలుపడేవారు " నేను కేసు పెడతాను " " వీడియో లో భయట పెడతాను " " ఆడియో లు  భయట పెడతాను"  అని బెదిరిస్తారు, వినకపోతే విడితో ఉపయోగం లేదు, వీడికి జరిగింది చూసి మరొకరు అయిన భయపడి డబ్బులు  చెల్లిస్తారు అని సమాజం లో ఉన్నత వ్యక్తులను టార్గెట్ చేసి  చట్టం లో వెసులు బాటు ఉపయోగించుకొని ఇరికిస్తారు, ఈ వ్యవహారం లో అదే చట్టం లో వెసులుబటులను ఉపయోగించుకొని పోలీస్ వారిని వారికీ తెలియకుండానే    ఈ బలవంతపు వసులలో ఒక భాగముగా వాడివేయ్యటమే  ఈ హనీ ట్రాప్ చేసే వారి  "స్కిల్ ". హనీ ట్రాప్ నే వృత్తిగా మార్చుకున్న వారు చాలామందే ఉన్నారు. సో మొదటి అడుగు వెయ్య వలిసింది బాధితులే.

బలవంతపు వసూళ్ళు హనీ ట్రాప్ లో భాగం , " హనీ ట్రాప్ " కన్నా " హనీ హంట్ " అనటం మంచిది. ఎందుకంటె హనీ ట్రాప్ చేసేవారు బాధితులను వేటడతారు, వేట లో ఎప్పుడు వేగంగా స్పందించే వారిదే పై చెయ్య.  హనీ ట్రాప్ అని తెలుసుకున్న వెంటనే అప్రమత్తం అయ్యా సరైన చర్యలు తీసుకోని సంభందిత అధికారులను సంప్రదిస్తే కొన్ని విషయాలను నియంత్రించవచ్చు. 

" హనీ ట్రాప్ " : శృంగారాన్ని రహస్యం గా చిత్రీకరించి, వాటి ని చూపించి బ్లాక్ మెయిల్ చేసి కావలసిని సమాచారం పొందటం మరియు ప్రేమ పేరుతో లేదా అందాన్ని చూపించి స్నేహం చేసి రహస్య వివరాలు కనుక్కోవటం మరియు చిత్రీకరించిన వీడియో లను, చేసిన చాట్ హిస్టరీ ని ఉపయోగించి బలవంతపు వసూళ్ళు చెయ్యటం .   

ఈ హనీ ట్రాప్ కి పోలీసులు మినహాయింపు కాదు, వారిలో కూడా చాల మంది బాధితులు ఉన్నారు.  లొంగని వారు లోపల ఉన్నారు, లొంగిన వారు మానసిక ఒత్తిడలలో ఉన్నారు .
  

 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image