ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో విద్యార్దుల సమస్యల పైన స్పందించిన ఎలిజా - శాస్త్రవేత్తలకు పెద్ద పిట వెయ్యాలి అని చెప్పి మనవి



     


వి ఆర్ ఎలిజా చింతలపూడి శాసనసభ్యులు  11-7-2019 వ తేదిన జరిగిన  అసెంబ్లీ సమావేశం లో విద్యార్దుల సమస్యల పైన ప్రస్తావించారు.  విద్యార్దుల పైన చదువు పేరుతో పెరిగే ఒత్తిడిని ప్రస్తావించి, ఒలింపిక్స్ లో దేశ పరిస్థితి ని ఒక్కసారి గుర్తుచేస్తూ మండల స్థాయి లో క్రిదకరులను గుర్తించి వారి ని ప్రోత్యహించే విధముగా తగిన చర్యలు తీసుకోవాలని అని అయన విన్నవించారు.

రాష్ట్రం లో  సైంటిస్ట్ లు ను ప్రోత్యహించే విధముగా తగిన చర్యలు తీసుకోవాలని అయిన సూచించారు.


వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారత దేశం లో కొత్త అవిష్కరలకోసం శాస్త్రవేత్తలకు ఇచ్చే నిధులు మిగత దేశాల మిద పోల్చుకుంటే చాల తక్కువ. అలాగే సైన్సు ని అభ్యసించే విద్యార్దులు కి  పెద్దగా గుర్తింపు లేకపోవటము, అ విషయముగా ప్రభుత్వం ద్రష్టి పెట్టకపోవటం వల్ల మేధావులు చాల మంది వేరే దేశాలకి వలస వెళ్ళిపోతున్నారు. ఈ విషయం పైన చాల మంది సామజిక విశ్లేషకులు అసంతృప్తి వెల్లడి చేస్తున్నారు.

ఇప్పటి వరుకు ఈ సమస్య పైన అసెంబ్లీ లో ప్రస్తావన తెచ్చిన వారు ఎవరు లేరు, చింతలపూడి శాసనసభ్యులు ఈ విషయం పైన స్పందించటం అలాగే అసెంబ్లీ లో ఇటువంటి ఉన్నత సమస్యల పైన ప్రస్తావించటం తో విద్యావేత్తలు తమ అభినందనలు తెలియచేస్తున్నారు.

విద్యార్దుల ఆత్మహత్యల పైన విశ్లేషణ చేస్తూ, క్రీడారంగం లో కూడా వారిని ప్రోత్యహించే విధముగా మండల స్థాయిలో క్రీడ సంస్థలు స్థాపించాలి అని ఎలిజా ప్రస్తావించారు, ఈ విషయం పైన ఒలింపిక్స్ లో దేశ, రాష్ట్ర పరిస్థితి గుర్తు చేసారు .
విద్యార్ధుల సమస్యల పైన స్పందించిన చింతలపూడి శాసనసభ్యుల పైన మేము ఉంచిన  నమ్మకాన్ని వమ్ము చెయ్యలేదు, అసెంబ్లీ లో విద్యార్దుల సమస్యల పైన స్పందించి, ఉన్నత విద్యను అభ్యసించే వారిని ప్రోత్యహించి వారు దేశం దాటి పోకుండా మన దేశ ప్రతిభ ను మన దేశానికీ ఉపయోగపడే విధముగా చూడాలి అనే ఆలోచన తో, అలాగే విద్యార్దులు ఆత్మహత్య ల పైన స్పందించి వారిని క్రీడలు వైపు కూడా ప్రోత్యహించి మండల స్థాయిలో క్రీడ సంస్థలు ఏర్పాటు చెయ్యాలి అని  వ్యాఖ్యానించిన చింతలపూడి శాసనసభ్యులు వి ఆర్ ఎలిజా గారికి చింతలపూడి మండల విద్యార్ది విభాగం నుండి  అభినందనులు తెలియచేస్తున్నాము - మిర్యాల దిలీప్,  చింతలపూడి  విద్యార్ది విభాగం అధ్యక్షుడు    







 






 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement