ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

3 కోట్ల పంచాయతి సొమ్ము స్వాహా - నిజాన్ని నిర్భయముగా భయట పెట్టిన చింతలపూడి కమ్యూనిస్ట్ పార్టీ వారు



     


  • ఎన్ని డివిజన్ ల లో  ఎంత దుర్వినియోగం జరిగింది ?
  • అసలు అంత గోల్ మల్ చేసిన వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ?
  • అవినీతి లో కులసంరక్షణా ?

జిల్లా పంచాయతి వారి కార్యాలయం పశ్చిమగోదావరి జిల్లా లోని గ్రామపంచయాతిలలో నిధులు సుమారు మూడు కోట్ల రూపాయల వరుకు దుర్వినియోగం జరిగాయి. అయితే నిధులు దుర్వినియోగ పరిచిన వారిలో కొంత మంది గ్రామ కార్యదర్శులు మాత్రమే సస్పెండ్ కావటం ఇక్కడ కొత్త అనుమానాలకు తవునిస్తుంది. మిగిలినవారికి అనుకూలముగా రిపోర్ట్ లు వెళ్ళాయి, సామజిక వర్గ కుల గజ్జి తో కొంత మందిని కాపాడి మరి కొంత మందిని నామా మాత్రం సస్పెండ్ చేసారు. సరే సస్పెండ్ చేసారు మరి దుర్వినియోగ పరిచిన సొమ్ము ఎవరి ఖాతా నుంచి జమ పరచాలి ? ఎవరు అవినీతి కి పాలుపడ్దరో వారి వద్దనుంచే రికవరీ చెయ్యాలి. 

లేకపోతే ప్రజల మీద అధిక పొన్ను రూపములో పొందాలి.  పంచాయతి శాఖ లో ఉన్నత అధికారులు ఈ విషయన్ని నిరు కార్చే ప్రయత్నం చెయ్యటం పసి గట్టిన చింతలపూడి కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా పార్టీ వారు  ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి కి మరియు పంచాయతి శాఖ వారి దృష్టి కి  తీసుకోని వెళ్ళారు. 

అసలు ఏ గ్రామంలో ఎంత దుర్వినియోగం జరిగిందో అక్షర రూపంలో ఫిర్యాదు అందించారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు  మామిళ్ళపల్లి వసంతరావు గారు.


  • జంగారెడ్డిగూడెం డివిజన్ , బుట్టాయిగూడెం మండలం లోని కమ్మయకుంట గ్రామంలో రూ.821061-00 నిధులు దుర్వినియోగ పరచాపడినవి
  • జంగారెడ్డిగూడెం డివిజన్, జంగారెడ్డిగూడెం మండలం, పట్టెన్నపాలెం గ్రామంలో  రూ.261475/- నిధులు దుర్వినియోగ పరచాపడినవి
  • జంగారెడ్డిగూడెం డివిజన్, కేతవ మండలం, కేతవరం గ్రామంలో రూ.328300/-  నిధులు దుర్వినియోగ పరచాపడినవి
  • జంగారెడ్డిగూడెం డివిజన్, కేతవ మండలం, అక్కంపేట గ్రామంలో రూ. 50000/- నిధులు దుర్వినియోగ పరచాపడినవి
  • జంగారెడ్డిగూడెం డివిజన్, కొయ్యలగూడెం మండలం, కొయ్యలగూడెం గ్రామం లో రూ. 7500000/-  నిధులు దుర్వినియోగ పరచాపడినవి

  • ఏలూరు రూరల్ లో  శనివారపుపేట గ్రామం లో  రూ.3500000/- నిధులు దుర్వినియోగ పరచాపడినవి
  • ఏలూరు రూరల్ లో  వెంకటాపురం గ్రామంలో రూ.4000000/- నిధులు దుర్వినియోగ పరచాపడినవి
  • నరసాపురం డివిజన్ లో పాలకొల్లు రూరల్ లో పాలకొల్లు లో రూ. 5000000/- నిధులు దుర్వినియోగ పరచాపడినవి
  • కొవ్వూరు యలమంచిలి మండలం లో చించినాడ గ్రామం లో రూ. 2500000/- నిధులు దుర్వినియోగ పరచాపడినవి

వసంతరావు గారి ఫిర్యాదు తో విచారణ పునః ప్రారంభం చేసిన జిల్లా పంచాయతి శాఖ వారు నిజాలు నిగ్గు తేల్చే పని లో ఉన్నారు. 
    
క్రింద వాటి డాక్యుమెంట్స్ పొందు పరిచాము 






 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement