ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రూట్ మార్చిన చంద్రబాబు - మనం తిరిగి రావటం తో హైదరాబాద్ కళవిహినం అయ్యి పోయింది



     

జనం వద్దకే చంద్రబాబు ప్రయాణం మొదలపెట్టారు. మునుపెన్నడూ లేనట్టుగా జనం మధ్యకు వచ్చి స్పీచ్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు . వరాల జల్లు కురిపిస్తున్నారు, అత్మియమైన మాటలు తో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

"మీకు ఒకరిద్దరు తమ్ములు ఉండి ఉంటారు, నాకు కోటి మంది తమ్ముళ్ళు ఉన్నారు " అని వ్యాఖ్యానించటంతో , శ్రీకాకుళం సెవెన్ జంక్షన్ మారుమోగిపోయింది. బాబు లో ఉన్న వక్తని భయటకు తీసారు అనే చెప్పాలి, ఎందుకంటె మునుపటి పడికట్టు పదాలని వదిలి,  బాబు అలాగా మాట్లాడటం ప్రజలలో నూతన ఉత్యాహం ఉరకలేత్తించింది.



కట్టు బట్టలతో ఆంధ్రవారిని గెంటేసారు, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ ని ఎలాగా అభివృద్ధి చేసానో అ విధముగా అభివృద్ధి చేస్తాను అని  వ్యాఖ్యానించారు.

" మనం తిరిగి రావటం తో హైదరాబాద్ కళవిహినం అయ్యి పోయింది " - హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే ఆంధ్రావారి వలెనే అటువంటి ఆంధ్రవారు లేని అ ప్రాంతం కళవిహినం అయ్యిపోయింది అని ఆంధ్రావారి గోప్పతన్నని గుర్తుచేస్తూ, తను ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యగలను అనే నమ్మకం కలిగించారు.

ఈ వయస్సు లో అంత ఉత్యాహం తో,  మళ్ళి అక్కడ ప్రజలను తన వ్యాఖ్యల తో ఉత్తేజ పరచటం అభినందిన్చవలిసిన విషయం, ఈ విషయం చర్చించవలసిన అవసరం ఎందుక వచ్చింది అంటే, మీరు  ఒక్కసారి ఒక గిరి గిసి ఒక గంట దానిలో నుంచొని చూడండి.

కే సి అర్ ఆంధ్రవారిని ఏ విధముగా అవమానించారు, ఎన్ని మార్లు హేళన చేసారు, అసలు అమరావతి అభివృద్ధి అడ్డుకోవటంలో కే సి అర్ అంతరార్దం మీద విశ్లేషణ తో కూడిన వివరణ ఇచ్చారు. 






 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement