ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చింతలపూడి రైతు రథం లో అనర్హులే ఎక్కువ ! - పైరసీ రైతులు ఉన్నారు జాగ్రత్త - సాక్ష్యాలు



     
విజిలెన్స్ ఎస్పి  గారికి రైతు రథం లో జరిగిన అవినీతి గురించి ఫిర్యాదు అందిస్తున్న  కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా జిల్లా సభ్యులు  మరియు వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు  మామిళ్ళపల్లి వసంతరావు గారు

  


ప్రెస్ మిట్ లో రైతు రథం లో జరిగిన అవకతవకల మీద సాక్ష్యాలు అందచేస్తున్న మామిళ్ళపల్లి వసంతరావు గారు, టి. బాబు తదితర కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా నాయకులు - వీడియో

చింతలపూడి నియోజకవర్గం లో రైతు రథం లో  ఆక్రమాలకు అవినీతి కి పాలుపడింది ఎవరు ?

అసలు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ? 

అనర్హులకు ఈ పధకం క్రింద లబ్ది చెయ్యకుర్చవలిసిన  అవసరం ఏమి వచ్చింది ?

ఈ అక్రమాల వెనుక ఎవరు ఉన్నారు ?


-మమ్మిల్లపల్లి వసంతరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా జిల్లా సభ్యులు 
మరియు వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షలు  





చింతలపూడి రైతు రథం లో అవకతవకలు జరిగాయి, అందులో అనర్హులే ఎక్కువ, అవినీతి చాల విధాలుగా జరిగింది. కానీ అవినీతి అని నోరు పరేసుకుంటే కుదరదు దానికి సాక్ష్యాలు కావాలి. డబ్బు ఇచ్చినవాడు నేను డబ్బు ఇచ్చాను అని చెప్పి పది మందితో చెప్పుతాడు కానీ సాక్ష్యానికి రమ్మంటే రాడు. సరిగ్గా కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా నాయకులు   మమ్మిల్లపల్లి వసంతరావు గారికి   ఇటువంటి పరిస్థితే ఎదురు అయ్యింది, అవినీతి జరిగింది, ఏ విధముగా జరిగిందో తెలుసు కానీ బాధితుడు నోరు మెదపడు.

వివరణ : బాధితుడు అంటే ఇక్కడ ఉదాహరణకు మీకు ప్రభుత్వ పధకం క్రింద ఒక వస్తువు రావాలి, అ వస్తువు మార్కెట్  విలువ  రూ.10,000/-,   అ వస్తువు  ప్రభుత్వ పధకం లో మీకు సబ్సిడీ పోను రూ.7500/- కి దక్కుతుంది, అంటే రూ.2,500/- మీకు దొరికే సబ్సిడీ.  మీకు రెండు వేల అయిదు వందలు రూపాయలు సబ్సిడీ వస్తుంది కదా మాకు దాని లో రూ.1050/- కమిషన్ ఇవ్వండి అని ఒకడు అంటాడు, మన భారత దేశం లో పోతే పోయింది లే సబ్సిడీ లో మిగిలిందే కదా ! అని వదులుకోవటానికి సిద్దంగా ఉన్న వారు చాల మంది ఉన్నారు ఎందుకంటె  అ పధకం లో పోటి దారులు, అర్జి దారులు ఎక్కువ మందే ఉంటారు, నేను కాకుండా వేరొక డి అర్జి కి టిక్ పెడతాడు ఏమో అనే ఆలోచనతో చక్ మని ఒప్పుకుంటాము. ఇచ్చిన వాడు దేవుడు, తీసుకున్నవాడు భక్తుడు, మరి చదివింపులు చదివించుకోలేని  వాడు ? సర్లే వదిలేయండి ఇక్కడ టాపిక్ అది కాదు ఈ ఉదాహరణ లో అవినీతి జరిగింది, అ రూ.1050/- ఇచ్చింది మిరే కావచ్చు , అక్కడ అ వస్తువు కి ఉన్న పోటి తో మీకు అ రూ. 1050/- లెక్కలోకి రాలేదు, సేనక్షన్ చేయ్యించినవాడు మీకు దేవుడు, కానీ పోయిన రూ.1050 /- గురించి మీకు బాధే, జరిగింది పది మందికి చెప్పుతారు మధ్యవర్తులకు ఫ్రీ మౌత్ పబ్లిసిటీ ఇస్తారు, పలనవాడిని పట్టుకుంటే పని అవుతుంది అని చెప్పుతారు, కానీ సాక్ష్యానికి రమ్మంటే ఎన్ని ఆలోచిస్తారు ?

పైన ఉదాహరణ లో చెప్పినట్టు గానే విషయం అయితే అందరు చెప్పుతున్నారు కానీ సాక్ష్యం ఎవరు చెప్పటం లేదు. అవినీతి జరిగింది అని తెలిసిన తరువాత కూడా అంత తేలికగా వదిలితే అయిన వసంతరావు గారు ఎందుకు అవుతారు.  సమాచారహక్కు చట్ట ప్రకారం సదరు డిపార్టుమెంటు వారు ఇచ్చిన సమాచారం అసంపురణం. అప్పుడు వెతికితే నిజమైన లబ్దిదారుడి యొక్క పూర్తి వివరాలు, ఎక్కడ భూమి ఉన్నది అని చెప్పి వాహనం తీసుకున్నారు, వారి ఆధార్ కార్డు నెంబర్ తో సహా సమాచారం దొరికింది. వసంతరావు గారి చేతి లోకి అ రిపోర్ట్ వెళ్ళింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది. అసలు ఎవరు ఏ ఉరిలో వారికీ ఎంత భూమి ఉన్నది అని చెప్పి ట్రాక్టర్ లబ్ది పొందారో వివరం దొరికింది   .

అసలు రైతు రథం ప్రభుత్వ నియమాలు ప్రకారం ఒక లబ్దిదారుడికి కనీసం రెండు ఎకరాల భూమి కలిగి ఉండాలి, మరి ఎకరం భూమి లేని వారికీ కూడా ట్రాక్టర్ వస్తే వాడు ఏమి చేసి ట్రాక్టర్ తెచ్చుకున్నట్టు ? వాడు లబ్ది దారుడు ఎలాగా అయ్యాడు ? వాడు లబ్దిదారుడు ఎలాగా అయ్యాడు అంటే నిజమైన రైతు ని  తొక్కి పైరసీ రైతు అయ్యాడు.

నిజంగా అర్జి దాఖలు చేసుకున్న నిజమైన  రైతు కి వాహనం రాకపోతే, రాకాపోతే!  పైరసీ రైతు కి అడ్డదారులలో వాహనం వచ్చి నిజమైన రైతు కల్ల ముందల కిరాయలకి తిరుగుతుంటే, అ రైతు కి మెతుకు మింగుతున్నప్పుడు ఎలాగా ఉంటుంది? ఒక మెతుకు అ గొంతులోకి వెళ్ళాలి, మింగలేక కక్కలేక బ్రతకటానికి ఒక పిడికడు, విలువలేని నిలువెత్తు జీవితాన్ని వెక్కిరిస్తున్నట్టు రైతు రధం పైన  పైరసీ రైతు.   

ఈ విషయం లో ఎన్నో  ఒతిళ్ళు, మరెన్నో ప్రలోభాలు, ఎన్నో సిఫార్సులు వీటిని ప్రక్కన పెట్టి  ఈ రోజు పూర్తి సాక్ష్యలతో రైతు రధం - పైరసీ రైతులు తాలుఖ  సాక్ష్యాలు. ఈ పోరాటం లో బంధువుల నుంచి ప్రలోభాలు వచ్చిన, సిఫార్సులు వచ్చిన, ప్రెస్ మీట్ అపివేయ్యమని బెదిరింపులు వచ్చిన వసంతరావు గారు వారి టీం లెక్క చెయ్యలేదు.

పూర్తి వివరాలు పొంది పరిచి ఉన్న రైతు రథం లబ్దిదారుల లిస్టు 



ఇప్పుడ ఇన్వెస్టిగేషన్ చేసిన వాటిలో కొన్ని పత్రాలు ఈ క్రింద పరిచిన లింక్ లో పొందండి

రైతు రథం ఇన్వెస్టిగేషన్ ఫైల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి



ఇది ఒక్కటే కాదు చాల పధకాల లో జరిగే వాటి కోసం తెలిసిన కేవలం ప్రజలు, పేదలు లబ్ది పొందుతున్నారు అనే ఉద్దేశం తో మాత్రమే గోప్యం వహించావలిసి వస్తుంది - !



 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement