ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

" హితేష్ " చేరికతో .......? పురందేశ్వరిని విమర్శించే హక్కు ఎవరికి ఉంది ?





       " హితేష్ " చేరికతో .......?  పురందేశ్వరిని విమర్శించే హక్కు ఎవరికి ఉంది ?

స్వయానా నందమూరి ఆడపడుచు తనయుడు వై యస్ అర్ లో చేరటం, అతన్ని ఏం పి అభ్యర్ది గా ప్రకటించే సూచనలు ఉన్నాయి అన్న వార్తలు బయటకు రావటం తో కొత్త రకమైన చర్చలు జరుగుతన్నాయి. నందమూరి అడపడుచుగా ఆమె పుట్టినింటి వారికీ ప్రతి ఫంక్షన్ లో తన వంతు బాధ్యత నిర్వర్తిస్తుంటారు, అలాగే తన రాజకీయ ప్రస్థానం లో బంధాలకి, బంధుత్వానికి తావు ఇవ్వకుండా, ఎక్కడా రాజి పడకుండా పదవుల కోసం ఆశించకుండా, తెలుగుదేశం పార్టీ నుంచి ఆమెకు ఓపెన్ ఆఫర్ ఉన్నా, తను నమ్మిన సిద్దాంతాన్ని ఎక్కడ విడవకుండా, పట్టుదలతో ఫలితం  ఏది, ఏమైనా బరి లోకి దిగి తనకంటు రాష్ట్రం లో ఒక పేరు ని , ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న నాయకురాలు. 


ఆమె తనయుడు వై ఎస్ అర్ కాంగ్రెస్ లో చేరికతో, వై ఎస్ అర్ నుంచి వలసల విషయం పైన చర్చలు సద్దుమనిగినవి.  తన తనయుడి రాజకీయ అరంగేట్రం తెలుగు దేశం తో  కాకుండా వై యస్ అర్ కాంగ్రెస్ తో చెయ్యించడం రాజకీయముగా అతని రాజకీయ భవిష్యత్తు కి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. తెలుగు దేశం తోనే అతని రాజకీయ అరంగేట్రానికి స్వాగతం పలకవచ్చు కానీ, ఆమె వై ఎస్ అర్ ని ఎంచుకోవటం లో నే  ఆశక్తి చూపించారు. అందుకే హితేష్ రాష్ట్ర మొత్తానికి ఒక్క రోజులో ఎలివేట్ అయ్యాడు. 

ఇప్పుడు కేవలం వై ఎస్ అర్ లోకి హితేష్ ని ఇంట్రడ్యూస్ చేసినందుకు కొంతమంది అత్యుత్యహులు ఆమె పైన, ఆమె భర్త పైన విమర్శలు చేస్తున్నారు. ఆమె  నందమూరి ఆడపడుచు అని మరిచిన అత్యుత్యహ విమర్శకులు తమ విమర్శలు ప్రజల ని ప్రభావితం చెయ్యకపోగా, అన్నగారి సంతనం, మరియు ఆడ కూతురు పైన చేస్తున్న ఆరోపణల తో  వ్యతిరేకత భావాలు వ్యక్తం అవుతున్నాయి అనే విషయం గ్రహించలేక పోతున్నారు .

పురందేశ్వరి గురించి మాట్లాడాలి అంటే ఆత్మాభిమానం  తాకట్టు పెట్టని  వారు అయ్యి ఉండాలి, ఆమె రాజకీయముగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురుకున్న, ఎన్నడు ఆమె ఆత్మాభిమానం తాకట్టు పెట్టలేదు, స్వర్గీయ రామారావు గారి పట్టుదలతోనే వ్యవహరించారు ఆమె. ఎవరి మీద నోరు పారేసుకొని స్థాయి తక్కువ విమర్శలు చెయ్యలేదు. తనకంటు ప్రత్యేక స్థానం సమాజం లో ఏర్పాటు చేసుకున్నారు. అదే విధముగా మేనత్త గా , అక్క గా , చెల్లి గా నందమూరి వంశస్థుల ఇళ్ళలో ఎటువంటి ఫంక్షన్ ఉన్న ఆమె అ ఇంటి అడపడుచుగా తన బాధ్యత నెరవేర్చింది. విమర్శకులు మితి మిరిని ధోరణి మార్చుకుంటే మంచిది. 



 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement