ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

వల్లభనేని వంశి దౌత్యం ఫలించిందా ?



వల్లభనేని వంశి దౌత్యం ఫలించిందా ?


     

ఈ మధ్య రాష్ట్ర  రాజకీయాలలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్ర రాష్ట్రం లో కొన్ని అవంచనియ సంఘటనల తరువాత రెండు కుటుంబాల మధ్య వివాదం కుల వివాదం గా మరి అది రాజకీయ రంగు పులుముకొని నీరు పోసిన ఆరని మంట గా రాష్ట్రం లో  చెలరేగుతూనే ఉంది. అయితే మారిన రాజకీయ సమీకరణలు రాష్ట్ర ఐకమత్యానికి కొత్త ఉపిరి పోసింది.

అయితే వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారటం లో ముఖ్య పాత్ర వహించింది వల్లభనేని వంశి అనే ఉహాగానాలు విస్తృతముగా ప్రచారం లో ఉన్నాయి, ఇందుకు భిన్నముగా ఆలోచించటానికి ఆస్కారం లేకపోవటం తో, ఈ దౌత్యం, వంశి రాజకీయ మేధస్సు గురించి అవగహన ఉన్నవారు ఎవరు ఖండించలేకపోతున్నారు.



పార్టీ మారటం తో రాధాకృష్ణ కి విమర్శలు ఎదురైన అది అతనకి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ తెచ్చ్చి పెట్టింది. అలుపు సొలుపు లేకుండా ప్రజలు ఈ విషయం గురించి విపరీతమైన చర్చలు కొనసాగించినారు.  ప్రధాన ప్రతిపక్ష పార్టీ వారు విమర్శలు కురిపిస్తే, పాలక పక్షం వారు మాత్రం రాధా నోటి వెంట వచ్చిన మాటలని అస్త్రాలుగా సంధించుకొని డిఫెన్సు లోకి దిగారు.

ఒక్క మాట లో చెప్పాలి  అంటే ఈ అంశం పైన  రాష్ట్ర స్థాయి విస్తృత చర్చలు జరిగాయి, వంగవీటి రంగ గారి తనయుడి గా పేరు ఉన్న రాధా, ఇప్పుడు రాష్ట్ర స్థాయి లో చర్చనీయ అంశం అవటానికి కారణం ఎవరు.....? అగ్రహ ఆవేశాలు తట్టుకోలేని ప్రధాన ప్రతి పక్షమా ? డిఫెన్సు మెకానిజం ఉపయోగించిన పాలక పక్షమా ....?  లేదా రాజకీయ చాణిక్యం ప్రదర్శించిన వంశి దౌత్యమా....?

వల్లభనేని వంశి ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలని ఒక్కసారిగా కీలక మలుపులు తిప్పగల సమర్ధుడు , ఏ పక్షం వారు అయిన అతని  పక్షాన  కొంచెం జాగ్రత్త వహిస్తారు, సైలెంట్ యస్ససిన్ (Silent Assassin) గా పేరు, అంటే తన పని తను చేసుకొని వెళ్తాడు, ఏ దారి లో వెళ్ళిన ప్రతి సమస్యకు ఒక సమాధానం ఇస్తాడు అనేది అతనికి ఉన్న  పేరు.

ఎన్నికల వేళా ఈ వలసలు "ఇరు" పార్టీ ల లో జరగటం వలన  ఎన్నికల ఫలితాల మీద సందిగ్ధత ఇంకా విడలేదు. వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది కానీ కొన్ని నియమాలు అ వ్యతిరేకత నుంచి లబ్ది పొందేవారు పాటించటం లేదు, ఏమున్నది లే అనే విధముగా ఆలోచించే వారి ధోరణి " కుందేలు, తాబేలు" కధ లాగా ఉంది. 


   







 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement