ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విద్య సంస్థలలో శాడిస్ట్ లు ! అత్మహ్యత్య లే శరణ్యమా?       బుండి జిల్లా, రాజస్తాన్ కి చెందిన 16 ఏళ్ళ దీపక్ దడిచ్   ఐ ఐ టి కలల తో కోచింగ్ సెంటర్ లో అడుగుపెట్టాడు. ఏమైందో తెలియదు కోట లో కోచింగ్ సెంటర్ లో  వారం క్రిందట  శవం అయ్యి కనిపించాడు . అతని బందువు ఒకరు మాట్లాడుతూ అతను ఐ ఐ టి పరిక్ష పాస్ అవ్వకపోతే అతనికి కుటుంబ వ్యవసాయం చేసుకునే వెసులుబాటు ఉంది.

     ఈ విధముగా దీపక్ దడిచ్ ఒక్కడే కాదు మరో ఇద్దరు విద్యార్దులు, బీహార్ కి చెందిన  జితేష్ గుప్త మరియు , ఉత్తరప్రదేశ్ కి చెందిన దీక్ష సింగ్ కూడా బల్వమర్ణనికి పాలుపడ్డారు. ఈ ఒక్క సంవత్యరం లో 19 విద్యార్ధుల  ఆత్మహత్య లు నమోదు అయ్యాయి.

     రాజస్తాన్ లో ఉన్న కోట అనే పట్టణం లో సుమారు 1.50 లక్షల విద్యార్ధులు మారుమూల గ్రామల నుంచి ఇక్కడకి శిక్షణ నిమిత్తం, శిక్షణ సంస్థలకి తరలి వస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్యరం నుంచి మెడికల్ కోర్స్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో సీట్లు తెచ్చుకోవటానికి తమ పేరులు నమోదు చేసుకుంటారు.      అయితే పరిక్షలు దగ్గిర పడిన వేళ యువత మానసిక ఒత్తిడికి గురి అయ్యి, ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకి పాలుపడుతున్నారు. ముఖ్యముగా వేరొక ఉరునుంచి వెళ్లి చదువుకునేవారు తల్లి తండ్రుల పర్యవేక్షణ లో లేక పోవటం సరైన సమయానికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చే వారు లేకపోవటం, తమ పైన తము నమ్మకం కొలిపోవటం యువత ను మానసిక రుగ్మత కి గురి చేస్తుంది.

        కోళ్ళ ఫార్మ్   లో కోళ్ళను  పెంచినట్టు కార్పొరేట్ విద్య సంస్థలు విద్యార్ధుల చదువుల మీద తప్ప వారి ఆరోగ్యం మీద కానీ, వారి మానసిక భావ స్థితి మీద కానీ దృష్టి పెట్టకపోవటం, వేలువెన్ను లో ఉన్న ప్రముఖ విద్య సంస్థ లో చౌదరి లాంటి పైశాచిక అధ్యాపకుడు (ప్రస్తుతం అ పైశాచికుడికి షుగర్ బి పి, వచ్చింది అని మా సమాచారం, అన్ని బాగున్నప్పుడే వాడు పెద్ద శాడిస్ట్ ఇప్పుడు అక్కడ పిల్లల మీద ఎంత పైశాచికత్వం చుపిస్తున్నాడో, ఎంత మంది చావులకు కారణం అవుతున్నాడో, అయిన పర్వాలేదు లెండి అక్కడ అ ప్రముఖ విద్య సంస్థ లో చావులు భయటకు రావు, అలాగా మేనేజ్ చెయ్యగల సమర్ధుడు)    చర్యలు లాంటివే కావచ్చు మొత్తానికి పసి మొగ్గలు వడిలిపోతున్నాయి . చదువు భారం, ర్యాంకుల భారం మధ్య లో శాడిస్ట్ అధ్యాపకులు కొంతమంది. 

      విద్య సంస్థల వైఖరి మార్చుకోవాలి, శాడిస్ట్ అధ్యాపకులను ఒక కంట గమనించుకోవాలి, విద్యార్ధుల మానసిక స్థితిగతుల మీద ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి, మానసిక నిపుణుల చేత వారికీ కౌన్సిలింగ్ ఇప్పించాలి 100% విద్యార్ధుల ఆత్మహత్యలలో 75% విద్యాసంస్థల నిర్లక్ష్యమే కారణం. 


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image