Skip to main content

కక్కిన కుడు కి కక్కుర్తి అవసరమా ? పాలక వర్గం పైన రైతుల కు ఈ విషయం లో వ్యతిరేకత వస్తుందా ?     


పశ్చిమగోదావరి జిల్లా లో చింతలపూడి ఎత్తి పోతల పధకం ప్రధాన కాలువ నిమిత్తం
భూ సేకరణ జరిగింది, అప్పుడు  రైతుల వద్ద నుంచి భూమి సేకరించిన ప్రభుత్వం అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారం రైతులకి పరిహారం చెల్లించింది. పరిహారం నిమిత్తం ఇచ్చిన సొమ్ము తమ బ్యాంకు ఖాతా లో జమ చెయ్యటం తో రైతులు నష్ట పోయిన తమ భూమి కి కన్నీటి వీడ్కోలు చెప్పి ఇప్పటకి    సంవత్యరం పైన మాటే .

అయితే ఇప్పుడు తాజాగా రెవిన్యూ డిపార్టుమెంటు వారు రైతులకి మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ సొమ్ము చెల్లించం అని చెప్పి, మిగిలిన సొమ్ము తిరిగి చెల్లించకపోతే రెవిన్యూ రికవరీ చట్టం క్రింద నిర్బందిస్తం అని చెప్పి నోటీసు లు జారి చెయ్యటం కక్కిన కుడు కి కక్కుర్తి పడిన వైనం గా ప్రజలలో విభిన్న చర్చలు జరుగుతున్నాయి.

మహా కూటమి వ్యవహారం తరువత కే సి అర్ రైతు సంక్షేమ పధకాలు గురించి ఆంధ్రప్రదేశ్ లో  బాగా చర్చ జరుగుతుంది. ఇందుకు తోడుగా రైతు వ్యతిరేక పార్టీ గా పేరొందిన పాలక పార్టీ కి వ్యతిరేకముగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ   ఈ అంశాన్ని ఉపయోగించుకుంటే అసలే వలసల బాట పడుతున్న జిల్లా వాసులు సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఎక్కువ. పర్మిషన్ లేని ఫ్లెక్ష్సి ల గురించి రచ్చ చెయ్యకుండా యువ నాయకులు ఇటువంటి అంశాలు పైన పోరాడితే పచ్చనోటులకు పనిచెయ్యని మీడియా సంస్థలు వారి కోసం ఒక కాలమ్ ని రిజర్వు చేసి ఉంచుతారు.

ప్రధాన ప్రతి పక్షం గుర్తు పెట్టుకోవలిసిన ముఖ్య విషయాలు  • ప్రధాన ప్రతి పక్షం అంటే పాలక పక్షం లో ఉన్న ముఖ్య వ్యక్తిని టార్గెట్ చేసి తిట్టడం కాదు, అలాగా చేస్తే ప్రజలు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అంతే  తప్ప పాలక వర్గం పైన వ్యతిరేకత రాదు, ప్రధాన ప్రతిపక్షం పైన సానుకూలత రాదు. 
  • ప్రతి పధకం లో జరుగుతన్న అవినీతి వెలికి తీసి ప్రజలకి అర్ధం అయ్యే లాగా వారిని ఎలాగా దోచుకుంటున్నారో ప్రజలకి చెప్పాలి, మీకు ఓటు ఎందుకు వెయ్యాలి మీ ప్రత్యర్ది కి ఎందుకు ఓటు వెయ్యకుడదో జరిగిన అవినీతిని అర్ధం అయ్యే లాగా విశ్లేషించి  మరి  విషయం  చెప్పాలి
  •    మహాకుటమి ఎందుకు దెబ్బతిన్నది అనే విషయం మరువకూడదు, పధకాలలో జరిగిన అవినీతి ప్రజలకి తెలియచేప్పకుండా కేవలం కే సి అర్ మరియు అతని కుటుంబ సభ్యులని తిట్టడానికి పరిమితం అయ్యారు, కనీసం ఎన్నికలకి మూడు నెలల వరుకు కూడా పద్దతి మార్చుకోలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం ఈ మహాకుటమి తరహ లోనే వ్యవహరిస్తుంది. 
  • కొంతమంది ప్రధాన ప్రతిపక్ష నాయకుల సోషల్ మీడియా స్పీచ్ పోస్ట్ లు గమనిస్తున్నాం. నిజంగా అద్బుతమైన విశ్లేషణ. కానీ స్థానిక రాజకీయానికి రాష్ట్ర రాజకీయ విమర్శా ఎంత వరుకు తగును, స్థానిక ఓటరు బూత్ కి వచ్చి మీకు ఓటు వెయ్యాలి - అప్పుడు స్థానికంగా ఉన్న సమస్యలు వెలికి తియ్యాలి, రాజకీయ బాధితులు ఉంటారు వారు ఎలాగా బాధిన్చాపడ్డారు అనే విషయం భయటకు రావాలి, ఏ పధకం లో యెంత అవినీతి జరిగింది, ఏ పధకము పేరు చెప్పి ప్రజలను ఎంత లాగా దోచుకుంటున్నారు, కమిషన్ యెంత ఇస్తే పని జరుగుతుంది మొదలైనవి భయటకు రావాలి. 
  •  నిజం చెప్పాలి అంటే ముఖ్యముగా పశ్చిమగోదావరి జిల్లా లో రైతు వ్యవసాయశాఖ లో ఏ పని కోసం వెళ్ళిన  కనీస మర్యద కూడా దక్కటం లేదు, ఇది స్వయం గా ఒక ప్రతిపక్ష నేత చెప్పిన వ్యాఖ్యలు. పొద్దున నుంచి సాయంత్రం వరుకు  లైన్ లో నుంచో పెట్టి 5 అయ్యింది వెళ్ళిపొండి అనే స్థాయి కి రైతు కి మర్యద దొరుకుతుంది, ఈ విషయం పైన పోరాటం చేస్తే ప్రధాన ప్రతి పక్ష పార్టీ యొక్క విలువ రైతుల దృష్టి లో ఎలాగా ఉంటుంది, ప్రధాన ప్రతి పక్ష పార్టీ నాకు అండ గా ఉంటుంది అనే భరోసా రైతు కి కలుగుతుంది, ఓటు మీరు అడగనవసరం లేదు అభిమానంతో అదే పడుతుంది. 
  • వ్యవహారం మొత్తం ఫ్లెక్స్ లు చుట్టూ ఎందుకు తిప్పుతున్నాము? దానికి ఒక కారణం ఉంది , ఎవరినో వ్యతిరేకించి కాదు కేవలం చిన్న బాధ, అ రోజు యెంత ఖర్చు అయ్యిందో మాకు తెలుసు అదే ఖర్చు ప్రజాసమస్య పైన స్పందించి ఉంటె అ వార్త అ యువనాయకుల ద్వార ప్రజలకి ఎంతో  ఉపయోగ పడేది అనే ఆలోచన. 
యువ నాయకులు పంధ మార్చుకుంటే ప్రజానాయకులు అవుతారు, లేదా ఎవరో ఒకరి పంచన పడి ఉండవలిసిందే.  నియోజకవర్గ స్థాయి లో ఉన్న సమస్యలు ప్రజలలోకి వెళ్ళకుండా , ఏదో ఒక పార్టీ ముఖ్య నేతలను తిడితే తిట్టిన వారు అవుతారు తిర్చినవారు అవ్వరు.  " మ మ " అనే  తరహ పోరాటాలు ఎవరికి ఉపయోగం ఉండదు. ఈ విశ్లేషణ ఎవరిని కించ పరచటానికి కాదు, అవినీతి ని ప్రశ్నించకుండా ప్రజలకి ఏ మాత్రం ఉపయోగం లేని విషయాలు గురించి రాద్దాంతం చెయ్యటం చూసే వారికీ చులకన.


 ఎప్పుడో ఇచ్చిన పరిహారం పొరపాటు అని చెప్పి రైతుల మీద కక్ష సాధించే విధముగా దానిలో కొంత తిరిగి ఇచ్చేయండి అని అనడం చాల మంది రైతులు జీర్ణించుకోలేని విషయం. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయే వ్యవహారం. అంతర్గత వ్యతిరేకతకు ఇది ఒక పునాది అవుతుంది. ఇటువంటి విషయాల పైన "మామ" అనే విధముగా పోరాటం చెయ్యటము కన్నా మనస్పూర్తిగా పోరాటం చేస్తే గెలుపు ఓటములు ప్రక్కన పెడితే ప్రతి రాజకీయ నాయకుడు చిరస్థాయి గా ప్రజల మదిలో పదిలముగా ఉంటాడు. ఇప్పటికే చాల మంది రైతులకి నోటీసు లు జారి చేసారు అనేది సమాచారం.


 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics