Skip to main content

పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ....?       

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ పరిస్థితి భిన్నం గా ఉంది. వై ఎస్ ర్ కాంగ్రెస్, టి డి పి, జనసేన , కాంగ్రెస్ , సిపిఐ మరియు సిపిఎం.  ఎవరి పట్టు వారిది, కానీ జనసేన రంగం లోకి దిగాక మునుపు విషయం వేరు ఇప్పుడు పరిస్థితి వేరు.  నిజమే ఏముంది లే  అని చాల మంది అనుకుంటున్నారు, ప్రక్కన పెట్టేస్తున్నారు కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి,  కృష్ణ, గుంటూరు జిల్లా లో కొన్ని ప్రాంతాలు లో జనసేన గట్టి పోటి ఇచ్చే సూచనలు ఉన్నాయి. అవి సామజిక ఓట్ల చిలికే కానివ్వండి, లేదా అభిమానుల ఫాలోయింగ్ అయిన  కానివ్వండి, ఏది ఏమైనా  జనసేన తన శక్తి మేరకు ఓట్ల చీలిక చేస్తుంది.


వై ఎస్ ర్ కాంగ్రెస్ తన స్థాయి లో విస్తృత ప్రచారం చేస్తుంది మొన్న జరిగిన ఎన్నికలలో కేవలం 1 % ఓటింగ్ తేడ తో టి డి పి నెగ్గుకొచ్చింది ,  అ సమయములో జగన సీన్ లో లేకుండానే చక్రం నడిపారు కానీ ఇప్పుడు పాదయాత్ర పేరుతో ప్రజలలో బాగానే మమేకం అవుతున్నారు . అన్ని ఎదురు దెబ్బలు తగిలిన నిలతోక్కుకొని, ఇప్పటి వరుకు పార్టీ ని ఈ విధముగా కొనసాగించటం మాటలు కాదు. విరికి పట్టు ఉన్న ఏరియా లోనే కాకుండా, పట్టు లేని చోట కూడా వీరు ప్రస్తుతం పట్టు సాధించే పని లో ఉన్నారు. అమరావతి పరిధి లో ఈ పార్టీ పవర్ లోకి వస్తే రాజధాని కడప వైపు మళ్ళించే అవకాశం ఉంది, అమరావతి చుట్టూ ప్రక్కల ఇండస్ట్రియల్ ఏరియా క్రింద కేటాయిస్తారు అనే ఉహాగానాలు వ్యక్తం అవుతున్నవి, ప్రజలలో విస్తృతంగా జరుగుతున్నా ఈ చర్చ  వలన  అ ప్రాంతం లో ఈ పార్టీ  బలహీన పడుతుంది అనే చెప్పాలి.

తెలుగు దేశం ఇప్పుడు వై ఎస్ అర్ కాంగ్రెస్ లో నుంచి వలస వచ్చిన ఏం ఎల్ ఏ లకి ఎన్నికలలో సీట్ ఇస్తుందా ? లేకపోతే వారి పైన పోటి చేసిన ఓడిపోయినా అభ్యర్ధులకు సీట్లు ఇస్తార ? గంగని చూస్తే మంగకి మంట - మంగని చూస్తే గంగకి మంట ? ఇద్దరిలో ఎవరికి ఇచ్చిన వేరొక వర్గానికి మంటే - అ మంట అ నియోజకవర్గాన్ని ఆహుతి చేస్తుంది, అ ఆహుతి లో ప్రత్యర్ది చలి మంట కసుకోవచ్చు. కొంత మంది నాయకులు చేసే దౌర్జన్యా ఖండాలు గురించి  ప్రజలలో విపరీతమైన ప్రతికూల చర్చ జరుగుతుంది, అతని నియోజకవర్గము దేవుడు ఎరుక అ ఇంపాక్ట్ పార్టీ మీద పడుతుంది. సీనియర్ నాయకులను ప్రక్కన పెట్టి వెయ్యడం, నియోజకవర్గ స్థాయి పట్టు ఉన్న సీనియర్ నాయకులను నిర్లక్ష్యము చెయ్యడం, నియోజకవర్గం పైన  పర్యవేక్షణ లేకపోవడం పెద్ద మైనస్ ? ఇంటికి ఒక ఉద్యోగం ఏ విధముగా అమలు పరచలేదు - బాబు వస్తే జాబ్ వస్తుంది అనే విషయం పైన ప్రజలకి క్లారిటీ ఇవ్వకపోవటం - పార్టీ ముసుగులో రైతుల మీద కక్ష పూరిత చర్యలకు పలుపడటం. రోడ్ రవాణా శాఖ రవాణా శాఖ మంత్రి ది అయిన సామాన్య ప్రజల దృష్టిలో అక్కడ స్థానిక శాసనసభ్యులే వాటి కి బాధ్యులు, ఈ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వము మీదే ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ, పోలవరం ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టి రాజకీయ పరిస్థితులు గమనించకపోవటం, చేసేది మంచి పని అయిన 2019 ఎలక్షన్ స్ తరువాత పోలవరం సిద్దం అయ్యి చేతికి రావటం జరుగుతుంది - లాంగ్ టర్మ్ గోల్స్ తో షార్ట్ టర్మ్ గోల్స్ నిర్లక్ష్యం చెయ్యటం అంత ఆరోగ్యకరమైన విషయం కాదు . పింషణ్ లు , పోలవరం ప్రాజెక్ట్ , ప్రత్యేక హోదా , కేంద్రం పైన నిరసన, ప్రతిపక్షాలకి సానుకులముగా వ్యవహరించటం, ధోరణి మార్చుకోవటం, అనుభవపురక రాజకీయ వ్యూహం  ప్లస్ పాయింట్స్. ఎన్నికలు దగ్గెర లో ఉన్నాయి ఏ నియోజకవర్గం లో పరిస్థితులు ఎలాగా ఉన్నాయో తెలుసుకోవడం మంచిది లేక పోతే ఏమి చేసిన తెల్లరదు.

ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సి ఏం అవుతార లేదా అనే విషయాల పైన సానుకూల స్పందన ఉంది ఎందుకంటె ఒక వేళా కర్ణాటక పరిస్థితి ఆంధ్రలో ఏర్పడితే ఏ పార్టీ కి అయిన వేరొక ఆప్షన్ లేదు జనసేన తప్ప ?  ప్రజారాజ్యం సమయం లో విమర్శలు ఎదురుకున్న వారిని ప్రక్కన పెట్టి, కమ్యూనిస్ట్ పార్టీ ల తో జత కట్టిన పవన కళ్యాణ్ సమయస్పూర్తి ని మేచ్చుకోవలిసిందే.  పార్టీ ఫండ్ ని కలక్షన్ పర్వముగా ప్రసారం లోకి తెచ్చిన కేవలం అవి  విమర్శా చెయ్యటానికి  వేత్తుకున్న మార్గాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో రాష్ట్రం లో ఏ పార్టీ పగ్గాలు పడుతుంది అనే విషయం అంచనా వెయ్యడం కష్టం - కానీ ఏ పరిస్థితులు ఎవరు సి ఏం అవగలరు అనే అంచనా వెయ్యవచ్చ్చు అనేది సీనియర్ రాజకీయ నాయకుల అభిప్రాయం.

        Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics