Skip to main content

రాఫాలే - వర్డ్ టాంపరింగ్ - మీడియా పార్ట్     

కార్గిల్ యుద్ధం లో అన్ని ఆయుధాలు పని చెయ్యని సమయం లో బోఫోర్స్  ఒకటే అప్పటి మన దేశ సైన్యాన్ని ఆదుకొని దేశ విజయానికి తోడ్పడిన ఘటన చాల  మందికి తెలియదు ఇండియా టుడే వారు ప్రచురించిన ఈ ఆర్టికల్ లో అ విషయాలు ప్రస్తావించారు https://www.indiatoday.in/india/story/kargil-winning-the-battle-with-bofors-331307-2016-07-25

అప్పుడు ప్రతిపక్షాలు రాజీవ్ గాంధీ ని ఈ విషయం పైన ఏకి పడేసిన విషయం అందరికి తెలిసిందే. అ విషయం  ప్రభుత్వం పైన ప్రజలలో వ్యతిరేక అభిప్రాయము ఏర్పరిచింది. కానీ అంత వ్యయం పెట్టి కొనుగోలు చేసిన అ ఆయుధం యొక్క విలువ కార్గిల్ యుద్ధం లో మన దేశ సైనికులకి బాగా తెలుసు. అయితే అప్పటి విమర్శలు ఎక్కువ ధరకు అవి కొనుగోలు చేసారు అని, అంత అవసరం ఉందా అని ? కానీ దాని విలువ యుద్ధం లో నే తెలిసింది.

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలండే   మీడియా పార్ట్ అనే వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో  చెప్పాడు అంటున్న  అసలు పదాలు ఇవ్విEn Inde, François Hollande s’invite dans l’affaire des avions Rafale


ఇంగ్లీష్ అనువాదం లో 

In India, François Hollande invites himself in the Rafale aircraft businessతెలుగు అనువాదం లో 

భారత దేశం లో  ఫ్రాంకోయిస్ హోలండే తను అంతట తనే  రాఫాలే యుద్ద విమానాల వ్యాపారానికి ఆహ్వానం పలికారు, ఇన్ అనే పదాన్ని తొక్కేసి ఇండియా మాత్రమే "  ప్రస్తావించారు "  


ఆర్టికల్ ఫ్రెంచ్ లో ఉండటం వలన చాల మంది గమనించి ఉండరు. ఇంకా లోతుకి వెళ్ళితే హోలండే ఇంటర్వ్యూ ఇంకా భయటకు రాలేదు ఎవరో చెప్పిన విషయాలు తప్ప, అసలు అ విషయాలు మాజీ అధ్యక్షుడు చెప్పాడా వేరొకరు చెప్పరా అనే విషయాలు, కనీసం వీడియో కూడా భయటకు రాకుండా ప్రచరం కొంచెం అనుమానాస్పదం. అసలు విషయం ఏమిటి అంటే ప్రస్తుత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమన్యుల్ మేక్రోన్ మార్చ్ నెలలో  పారిస్ క్లైమేట్ చేంజ్  అగ్రిమెంట్ పైన మాట్లాడటానికి భారత దేశం వచ్చి వెళ్ళారు. ఈ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ ట్రంప్ నిరాకరించిన అగ్రిమెంట్.  హోలండే ఒక నటి తో అక్రమ సంబంధం కలిగి ఉండటం పైన అప్పటి ఫ్రాన్స్  మీడియా ప్రచురితం  చేస్తే అ మీడియా సంస్థ తన వ్యక్తిగత విషయాల పైన చర్చ చేసింది అని, అందుకుగాను చట్ట పరమైన  చర్యలు తీసుకుంటాను అని చెప్పారు తప్ప, అ విషయాన్ని ఖండించలేదు ఈ మాజీ అధ్యక్షుడు.   


సరే ఇంటర్వ్యూ  లో ప్రచురించిన విషయాలు నిజమే అనుకుంటే, మోదితో సంబంధం లేకుండా హోలండే భార్య తీసిన సినిమా కి రిలయన్స్ సంస్థ ఫైనాన్సు చేసి ఉంది,  అ సలహా ఇచ్చింది మోది కాదు అంటే రిలయన్స్ సంస్థకి హోలండే కుటుంబానికి సత్యసంబందాలు ఇంతక మునుపే ఉన్నాయి అనేగా అర్ధం. అసలు ప్రపోసల్ తీసుకువచ్చింది హోలండే ఎందుకు కాకూడదు.

రాఫాలే  యుద్ద విమానాలు అంత పెట్టి ఎందుకు కొన్నారు అనే విషయం కేవలం యుద్ధం లో మాత్రమే తెలుస్తుంది, జరిగింది ఏమిటి అనే విషయం మనలని మనం ప్రశ్నించుకుంటే అర్ధమౌతుంది.

ప్రభుత్వ సంస్థతో  ఎందుకని సర్వీస్ ఒప్పందం చేసుకోలేదు ? ఒకవేళ అదే హోలండే అభ్యంతరం అయితే? అప్పటికప్పుడు ప్రకటన చెయ్యడం హోలండే నిబంధన ఎందుకు కాకూడదు? అసలే రాజకీయ సంక్షోబాన్ని ఎదురుకుంటున్న హోలండే రిలయన్స్ సంస్థ తో తనకి ఉన్న అనుబంధాన్ని ఫ్రెంచ్ ప్రజలకు తెలియకుండా ఉండటానికి, విషయాన్ని ప్రక్క దారి ఎందుకు పట్టించి ఉండకుడదు ?  హోలండే మాటలు వాస్తవము అయితే అతను అవినీతి కి పాలుపడినవాడు అవుతాడు అప్పుడు ఫ్రాన్స్ ప్రభుత్వం అతన్ని నేరస్థుడి గా పరిగణించాలి, నికోలస్ సర్క్యోజ్ (ఒకప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు)  ఒక్క ఉన్నత అధికారిని ప్రలోభ పరచడానికి చూసాడు అని అతన్ని ఇపటికి కేసులు వెంటడుతున్నవి ? మరి ఇంత విషయం లో నిజంగా వాస్తవం ఉంటె, ప్రలోభానికి గురి అయిన హోలేండే పైన ఇప్పటి వరుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? "అ వాస్తవం" లో వాస్తవం ఎంత ?  తన ప్రత్యర్ది అభ్యర్ధనను అంగీకరించిన నేటి పాలక వర్గం పైన హోలండే, తను నిరాకరించిన విషయం పైన సానుకులముగా స్పందించిన పాలక ప్రభుత్వం మీద ట్రంప్ గుర్రుగా ఉండకుండా ఉంటారా ? ఇది పరదేశిలతో తో కలిసిన " దేశాస్తుల " కుట్ర కాదు అని ఆశిస్తూ !      Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Articles

Politics

Crime

National Politics

International Politics