వై యస్ ఆర్ సిపి & టి డి పి సెర్చ్ రికార్డు

Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Sunday, 9 September 2018

ఈ సమయములో కాంగ్రెస్ లో విభేదాలు అవసరమా ? ఏలూరు కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు - అసభ్యపదజాలం తో దద్దరిల్లిన సభ ప్రాంగణం - వీడియో
     

అసలే ప్రతిపక్షం - రాష్ట్రం లో  బలహినముగా ఉన్న కేడెర్ - ఈ సమయములో నాయకులు మొత్తం ఏకతాటి మీద నడవవలిసిన పరిస్థితి కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో మాత్రం కాంగ్రెస్ శ్రేణుల మధ్య విభేదాలు తర స్థాయికి చేరుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అసభ్య పదజాలంతో ఒకరిని ఒకరు దుషించుకునే పరిస్థితి ఏర్పడింది.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ తన వంతు గుర్తింపు పొందిన పార్టీ నిజం చెప్పాలి అంటే రాష్ట్ర విభజన జరగక మునుపు కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కన్నా ఎక్కువ గుర్తింపు ఉండేది. కానీ రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ పరిస్థితులు వికటించి ఇప్పుడు ఉనికిని కాపాడుకునే పరిస్థితి కి చేరుకుంది.
నాయకులు మధ్య విభేదాల వీడియో

ఇప్పుడు ఇప్పుడే ఉనికి లోకి వస్తున్న పార్టీ ఇప్పుడు కోల్డ్ వార్ తో క్రుంగిపోతుంది, నిజం చెప్పాలి అంటే ఏలూరు లో జరిగిన ఈ అంశం సానుకూల స్పందనకి చేరువయ్యే సమయం లో ప్రజలలో చులకన భావం వ్యక్తం చేసే పరిస్థితి కి దారి తీస్తుంది.

సమీకరణ ముఖ్య పాత్రా పోషించే ఈ సమయములో అంతర్గత విభేదాలు పార్టీ కి చాల పెద్ద నష్టం. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో శుక్రువారం కాంగ్రెస్ సమన్వయ కమిటి మీటింగ్ జరిగింది, ఈ సమావేశం లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రఫీ ఉల్లా బేగ్ పైన కార్యకర్తలు తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. సభ అంత ఒక్కసారిగా స్తంభించింది, అసభ్య పదజాలం తో సభ ప్రాంగణం దద్దరిల్లింది . 


Advertisement
టీ షర్ట్స్ మరియు ఇతర ప్రింటింగ్ సర్వీసెస్ కొరకు సంప్రదించండి - అతి తక్కువ ధర కే ప్రింటింగ్ చెయ్యబడును - కాష్ ఆన్ డెలివరీ సర్వీస్ కలదు  - ప్రాంతం తో సంబంధం లేదు  
 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image