ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో నిరసన సక్సెస్ - సానుకులముగా స్పందించిన ముఖ్యమంత్రి - విమర్శలు ఉన్న ...........





ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 వ తారీఖున అన్ని పార్టీ లు కలిసి పెరిగిన పెట్రోల్ ధరల మీద నిరసన వ్యక్తం చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకులముగా స్పందించారు. రెండు రూపాయలు ఆంధ్ర  రాష్ట్రం వరుకు ఉరట కలిగించారు. ఈ ఒక్క విషయం చాలు ఆంధ్రరాష్ట్రం లో  బంద్ విజయవంతముగా ముగిసింది అని చెప్పటానికి. ఈ సమ్మె లో ఒక్క ప్రధాన ప్రతిపక్షం తప్ప అందరు పాల్గొన్నారు. 


ఒక్క ప్రధాన ప్రతి పక్షం తప్ప కాంగ్రెస్ పార్టీ వారు , సిపిఐ , సిపిఎం , జనసేన తదితరలు   పాల్గొన్నారు. ఈ విషయం లో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పార్టీ ని ఎంతో బలోపెతం చేసే అవకాశాలు ఎక్కువ.  అలాగే రావాణ శాఖ వ్యాపారులకి అ శాఖ ని నమ్ముకున్న కార్మికులకి  ఎంతో ఉపయోగం.  ఇది రాజకీయ ప్రయోజనం కోసం చేసింది అనే విమర్శలు వచ్చిన, ఇది ఆరోగ్యకరమైన రాజకీయం అనే అభిప్రాయాలు లేక పోలేదు. ఎందుకంటె ప్రతి పక్ష పోరాటానికి పాలక పక్షం మద్దతు తెలపటం , అందులోను మధ్యతరగతి  కుటుంబాలకి ముఖ్యముగా ఆటో నడుపుకొని జీవనం కొనసాగించే వారికీ, రవాణా శాఖ ని నమ్ముకొని వ్యాపారం చేస్తున్న వారికీ ,  అలాగే అ వ్యాపారస్తులు    నమ్ముకున్న కార్మికులకి కొంచెం ఉరట, అ రెండు రూపాయల మార్జిన్ వారికీ సందేహం లేకుండా కొంత లో కొంత అయిన మిగులు అనే చెప్పాలి.    



ఈ విజయం  ఒక రకముగా నిరసన కి సహకరించిన ప్రతి ఒక్కరిది ముఖ్యముగా   ప్రతి మధ్య తరగతి వారిది, అలాగే బంద్ కి సహకరించిన ప్రతి వ్యాపారస్తుడి , కష్ట సమయములో రాజకీయ ప్రయోజనాలు ప్రక్కన పెట్టి ఐకమత్యమే మహా బలం క్రింద భావించి సమ్మెకి పూనుకున్న ప్రతి రాజకీయ పార్టీ వారిది.

ప్రజలు ఇబ్బంది పడే విషయాల పైన  ఇకమత్యముగా  నిరసన వ్యక్తం చేస్తే  ప్రభుత్వం  స్పందిస్తుంది అనే ఆలోచనకి  ఇది ఒక మంచి ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ మొండి వైకారి మీద విమర్శలు లేక పోలేదు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన ఇంధన ధర ల మీద చేసిన బంద్ తెలిపిన నిరసన విజయవంతము.





 Post by

 Quickandhra Independent Web Media Publication

  


In Association with

Image

Advertisement