చింతలపూడి మండలం చింతలపూడి గ్రామం లో ది.14-07-2012 వ తేదిన రాత్రి 11:00 గంటలకి అప్పటి సిట్టింగ్ ఎమెల్యే మద్దాల రాజేష్ గారికి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. దాని సారాంశం ఏమిటి అంటే "సర్ ఇంత లేట్ గా డిస్తరబ్ చెయ్యటం తప్పటం లేదు - వెంకటరామ బగ్ లో రోడ్ లు సరిగా లేక చాల మంది ఇబ్బంది పడుతున్నారు మొన్నటికి మొన్న ఒక పునుగుల బండి క్రింద పడి ఒకరి ఒక రోజు జీవన ఆధారం పోయింది, వారు రోడ్ బాగోలేదు అని అర్ధంకాక ఎవరో ఎదురు రావటం వలన అలాగా జరిగింది అని తిట్టుకుంటున్నారు, కొంచెం అ సమస్య పైన చర్య తీసుకోండి అని" .
అ సమయములో అయన ఒకే ఒక మాట ఇచ్చారు " నేను నెక్స్ట్ గ్రాంట్ లో వేపిస్తాను" అని రెస్పాండ్ అయ్యారు . ఆహ!అందరు చెప్పే విధముగా చెప్పాడు లే అని లైట్
అనుకుంటే వెంటనే సమస్య పైన స్పందించటం వెంకటరామ బగ్ లోని అయిన దృష్టిలోకి తీసుకోని వచ్చిన రోడ్ల సమస్యల పైన స్పందించి రోడ్లు మంజూరు చెయ్యటం, అలాగే రోడ్ వెయ్యటం కూడా జరిగిపోయింది.
|
వీధికి ఒక లీడర్ పుట్టుకొస్తున్న ఈ రోజులలో అభివృద్ధి చెందటానికి మధ్య స్థితి లో ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో ఈ యువనాయకుడు పని తీరు స్పూర్తి కావాలి అనేది ఈ ప్రచురణ యొక్క ముఖ్య ఉద్దేశం (రాజకీయ కోణం లో చూసే వారికీ ఈ ఆర్టికల్ మింగుడుపడకపోవచ్చు ). చింతలపూడి లో ఇతను పదవి లో కొనసాగింది 3 1/2 సంవత్యరాలు, ఈ మూడున్నర ఏళ్ళ లో చింతలపూడి కి తన శక్తి మేరకు ఒక ఐ టి ఐ కళశాల, వంద పడకల ఆసుపత్రి. యర్రగుంటపల్లి తాడువాయి లో 1.4 కోట్లతో పి హెచ్ సి కి మంజూరు చేయ్యించారు. కొన్ని ప్రాంతాలలో బోర్ వెయ్యడం నిషిద్దం, కానీ అయిన హయం లో ఈ నిషిద్దం ఎత్తి వెయ్యించారు ఇంకా స్వయం ఉపాధి ప్రోత్యాహం డైరీ ఫార్మ్స్ తదితర రంగాలు. విద్య, వైద్యం, రైతులు, వృత్తి రవాణా ఈ నలుగు రంగాల మీద దృష్టి పెట్టారు.
సమస్య అతని వరుకు వెళ్ళితే స్పందించే విధానము వేరు అనటానికి పొందుపరిచిన ఈ సాక్ష్యం ఒక ఉదాహరణ కాబట్టి చాట్ హిస్టరీ భయట పెట్టవలసివచ్చింది . ప్రతి మనిషికి ఉన్నట్టే ఇతనకి లోపాలు లేకపోలేదు అవి ఏమిటి అంటే , మొండి వైఖరి, ఎవరికి తలవంచాకపోవటం, తనకి న్యాయం అనిపిస్తే ముందు వెనుక ఆలోచించాకపోవటం, ఆవేశం, రాష్ట్రం విడి పోతే అభివృద్ధి చెందదు అనే ఆవేశం తో పదవిని అది ఎమెల్య పదవిని వదులుకోవటం, స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వటము, ఆత్మాభిమానం కలిగి ఉండటం ......
ఎవరికి తలవంచాకపోవటం: మాకు ఉన్న సమాచారం మేరకు అప్పటి పాలక పార్టీ లో ఒకరు ప్రత్యర్ది ఒకరిని, కక్ష సాధింపు చర్య గా ఒక కేసు లో ఇరికించాలి అని చూస్తే ఈ యువ నేత కలగచేసుకొని అది తప్పు అని నిర్మోహమటముగా ఖండించారు, ఇందుకు గాను అయిన పైన కొంత మంది గుర్రు గా .........!
గెలుపు ఓటములు రాజకియల`లో సహజమే రాజకీయంగా ఎదగాలి అనుకునే ప్రతి నాయకుడు, ప్రతి యువకుడు తన దృష్టి లోకి ఒక సమస్య వస్తే మాట ఇచ్చినప్పుడు ఎలాగా నిలపడలి అనేదానికి పైన తెలిపిన వస్తావా గాధ మంచి ఉదాహరణ. యువత ఖచ్చితంగా రాజకియంలోకి రావాలి కానీ ఏ విధముగా పని చెయ్యాలి అనే విషయం లో ఎవరో ఒకరి స్పూర్తి అవసరం చింతలపూడి నియోజకవర్గం లో ఈ యువ నాయకుడి పాలక పటిమ అనుసరించి ప్రజా సమస్యల మీద స్పందించటానికి మరింత స్పూర్తి అవ్వాలి అని కోరుకుంటున్నాము. మధ్య తరగతి సామాన్యులకి విద్య, ఆరోగ్యం అనేది చాల ముఖ్యమైన అంశం, మూడున్నర ఏళ్ళ లో సేనక్షన్ చేయించుకొని రావటము అంటే మాటలు కాదు. సేనక్షన్ చేయ్యించినవి ఆమలు కాకపోవటానికి ముఖ్య కారణం ఏమిటో తెలుసా ? కేవలం రాష్ట్రం విడిపోవటం వలన కలిగిన ఆర్ధిక ఇబ్బందులు - మరి రాష్ట్రం విడిపోకుండా పోరాడిన సమైఖ్య పోరాటం చేసిన వారి ప్రయత్నం అర్ధమైందా?
కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారముగా తీసుకోని ఈ ప్రచురణ చెయ్యటం జరిగింది రాజకీయ అత్యుతహులు ఈ విషయాన్ని రాజకీయ కోణం లో కాకుండా చింతలపూడి నియోజకవర్గ విద్య, వైద్య, వ్యవసాయం, రవాణా అభివృద్ధి ఏ విధముగా చెయ్యాలి అని ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న జనాభ కే కాకుండా, తరువాత తరం వారుకూడా మీరు, మీ పేరు ప్రస్తావిస్తారు లేకుంటే శిలపలకల మీద మిగిలి పోతారు.
Post by