ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

చంద్రబాబు వర్సెస్ మెనీ ....!



       
ప్రత్యర్ది ఒక్కడు ఉంటేనే ఆచితూచి అడుగు వెయ్యాలి. మరి ప్రత్యర్డులు ఎక్కువయ్యి ప్రత్యర్ది ఒక్కడే అయితే. ఇక్కడ మన ముఖ్యమంత్రి  పరిస్థితి ఇదే. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రధాన  ప్రత్యర్ది. నిజం చెప్పాలి అంటే బిజెపి కన్నా కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో పట్టు ఎక్కువ.

తెలుగు దేశం పార్టీ బలహీన పడితే అందువలన లబ్ది పొందేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ  సిద్ధాంతం  ఎప్పుడు తను నియమించిన అభ్యర్ది మాత్రమే ముఖ్యమంత్రి గా వ్యవహరించాలి అని అనుకునే సిద్దాంతం అ విషయం అందరికి తెలుసు. బిగ్ బాస్ హౌస్ లాగా  ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.


సరే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం లో తన ప్రధాన ప్రత్యర్ది అయిన తెలుగుదేశం పార్టీ తో జత కట్టిన కాంగ్రెస్ పార్టీ రేపు పదవి వచ్చిన తరువాత చంద్రబాబు ని  ఇబ్బంది పెట్టదు అనే విషయం మీద ఎవరు ఒక క్లారిటీ ఇవ్వలేరు. ఇది వాస్తవం. 

ఒక పక్కన వై.ఎస్.అర్ . సి. పి అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి ప్రచారం లో ఉన్న విషయం ఏమిటి అంటే తన రాజకీయ ప్రత్యర్ది ని రాజకీయ ప్రత్యర్ది గా కాకుండా తన ప్రధాన శత్రువు గా చూస్తారు అని.  ఒక వేళా ప్రజలు ప్రధాన ప్రతిపక్షం పైన మక్కువ చూపిస్తే చుక్కలు .....దెబ్బ తిన్న పులి కి ఎరగా జింక మాంసం దొరికినట్టే. 

ప్రత్యేక హోదా విషయం లో కమ్యూనిస్ట్ పార్టీ వారిని ప్రజా సంఘాల వారిని ఉసాలు లేక్కపెట్టించిన విషయం కొంత మంది నర నరాలలో భాలముగా నాటుకొని పొయ్యింది. పదివి లో ఉన్నారు అనే ఒక్క కారణం తప్ప వారు ఉపెక్షించడానికి వేరొక ప్రత్యేక  కారణం లేదు అనే చెప్పాలి.   

అసలే ఏమి జరుగుతుందో తెలియని సందిగ్ధ అవస్తలో పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించటానికి టి డి పి లో నుంచి భయటకు వచ్చి నేను పోటి చేస్తాను అని హుంకరలు మొదలపెట్టారు. గుడ్డి వాడి బాణం ఎవరికి దిగుతుందో తెలియినట్టు ఉన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఎక్కడికి దారి తిస్తావో చెప్పలేని విధముగా ఉన్నాయి.

ఇంకొక ప్రక్కన మోది మీద వీరంగం అడుతున్నందుకు అక్కడ పరిస్థితి గురించి వేరే వివరించనవసరం లేదు. ఏది ఏమైనా ప్రస్తుత పాలక పార్టీ  జరగబోయే పరిణామాలు గురించి విశ్లేషణ చేసి నీకాసైన  రిపోర్ట్ తెచ్చుకుంటే చాల మంచిది. ఎందుకంటె ఓటర్ తెలివైన వాడు యెంత పంచిన, వంచిన ఓటర్ తను వేలుని మాత్రం తనకి నచ్చిన వారికే చూపుతాడు. మునుపటి ఎన్నికలలో రాష్ట్ర పరిస్థతి వేరు ప్రస్తుతం వేరు. అప్పుడు రాష్టం విభజించి పడి, అ పరిస్థితుల్లలో తెలుగు దేశం తప్ప వేరే ఆప్షన్ ఆంధ్ర ప్రజలకు లేదు. చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి ఉంటుంది అనే ఆశ. కానీ రాను రాను రాష్ట్రం లో రాజకీయా పరిణామాలు మారిపోతున్నాయి. కార్యకర్తలు కూడా ఇబ్బంది పడి- కక్క లేక మింగ లేక వెళ్ళి వేరే పార్టీ లో చేరలేక  మానసిక క్షోబకి గురి అయ్యే  స్థాయికి నియోజకవర్గ రాజకీయాలు దిగజారిపోయాయి. 

ఇది ఇలాగ ఉంటె పత్రిక స్వేచ్చ కి భంగం కలిగిస్తూ జరిగిన అవినీతి ని వెలికి తీస్తే సరిదిద్దే ఆలోచన పోయి వారి మీద కేసులు పెడితే నిజాలు భయటకు రావు అనే స్థాయి ఆలోచనల తో ఇష్టానుసారం వ్యవహరించి చెలరేగిపోయారు. 

కాంగ్రెస్ తో జట్టు ప్రస్తుతం బాగానే ఉండవచ్చు కానీ తరువాత పరిణామాలు పులి మీద సవారీ తో సమానం అనే చెప్పాలి. ప్రధాన ప్రతిపక్షం మీద అవినీతి ఆరోపణలు - పాలక వర్గం లో ప్రధాన నాయకులు దౌర్జన్యా చేష్టలకు చెల్లు క్రింద ప్రజలు పరిగణించే సూచనలు ఎక్కువ. 

జియో దెబ్బతో వార్త అనేది ఎక్కడ ఆగటం లేదు. వార్త సంస్థలు ప్రచురితం చెయ్యని విషయాలు సైతం సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్లలో హల్చల్ చేస్తున్నవి. ఫేస్ బుక్ లాంటి సంస్థలకి కొన్ని దేశ ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నవి . టెక్నాలజీ విపరీతముగా పెరిగిపోతుంది ఏ విషయం దాగటం అనేది కల. ఇవ్వని లాంగ్ రన్ లో చాల ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది వాస్తవం. లాంగ్ రన్ అంటే ఎన్నికల సమయం.

గ్రామా స్థాయి లో నాయకులు వికలాంగుల పెన్షన్ విషయం లో తప్పుడు ధ్రువ పత్రలు పొందుపరిచిన విషయాలు దాచి పెట్టాలి అని అనుకున్న దాగవు. చంద్రబాబు అంటే ప్రభుత్వ ఉద్యోగులు పని తిరు సక్రమముగా ఉంటుంది అనే మార్క్ " ఉండేది " , ప్రస్తుతం అ మార్క్ కనపడటం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త వారిని పార్టీ ఆహ్వానిస్తున్న, లోకల్ నాయకులు వారిని రానివ్వకపోవడం మరొక మైనస్ అనే చెప్పాలి. 

ఈ విషయాలు ఏవి పాలక పార్టీ ముఖ్య నాయకుడి వరుకు చెరక పోవచ్చు. కానీ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని లాభం లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళ ఓట్ల చీలిక ఖాయం. ఉదహరించాలి అంటే ప్రజారాజ్యం స్థాపన వాళ్ల  ఎవరికి నష్టం జరిగింది అనే విషయం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సీన్ మొత్తం అర్ధం అవ్వుతుంది. గెలుపు ఓటములు ప్రక్కన పెడితే ఓట్ల చీలిక మాత్రం ఖాయం కానీ అ బాణం ఎవరికి తగులుతుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి.  

డబ్బు అన్ని వేళల పనిచెయ్యదు ......అ విషయం తరువాత వచ్చే ఎన్నికలలో నే తెలుస్తుంది. ఒకప్పడు నిరక్షరాస్యత ఎక్కువ ఉన్న సమయంలో ఏమి చేసిన చెల్లుబాటు అయ్యేది. అయితే అక్షరాస్యత పెరిగే కొద్ది ప్రజలు  అభివృద్ధి కోరుకుంటున్నారు, దాని కార్య రూపమే పాలక వర్గం. కానీ ఇక్కడ జరిగే సున్యాన్ని ప్రజలు గమనిస్తున్నారు. 

అవసరానికి మించిన కమిషన్ వ్యవస్థ : అవసరానికి మించిన కమిషన్ వ్యవస్థ బాగా నెగటివ్ ప్రభావం చూపిస్తుంది. ఇంతక ముందు జరిగింది అని ఆరోపిస్తున్న అవినీతి ప్రజల మీద భారం పడలేదు, ప్రత్యక్షముగా ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదురుకోకుండా అప్పటి పాలక వర్గం పటిష్టమైన ప్రణాళిక రచించింది. కానీ ఈ కమిషన్ వ్యవస్థలో ప్రతి సామన్యుడు బాధితుడు, పిడితుడు. డబ్బు ఇవ్వటానికి ఎవరు వెనకడుటంలేదు కానీ డబ్బు ఇచ్చిన ప్రతి సరి ఎంత ఇచ్చారు ఎంత ఇబ్బంది పడి ఇచ్చారు అనే విషయం గుర్తు పెట్టుకుంటున్నారు. మండల కార్యాలయం లో రాజకీయ నాయకుల హావ - రువాబు అని చెప్పాలి. 

ఇటువంటి పరిణామాలు పాలక పార్టీ మీద  ఖచ్చితంగా ప్రతికూలమైన అభిప్రాయాలూ ఏర్పరచే విధముగా ఉంటాయి. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అప్పటిలో ఏ పార్టీ వారు అయిన ప్రతి పధకములో వారికీ సమాన  లబ్ది పద్దతి ఉంటుంది అనే  నినాదం తో వేరే పార్టీ వారిని కూడా తమ పార్టీ లోకి వచ్చే విధముగా వ్యవహరించేవారు, ప్రజల మనసులు కొల్లగొట్టారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ప్రస్తుత రాష్ట్రం లో రాజకీయ పరిస్థితులు   ఇందుకు విరుద్దంగా ఉన్నాయి. 

ఇక్కడ ఒక్క సిద్ధాంతం మిస్ అవుతుంది, ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నవారు అంత పాలక పార్టీ వారు కాదు, అందుకు గాను పార్టీ ని భాలోపెతం చెయ్యడానికి వేరొక చెట్టు నీడ లో ఉన్న వారిని తమ పార్టీ కి తెచ్చుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి కానీ, భయపెట్టి కాదు అని.  ప్రజలను భయపెట్టి రాజకీయాలు చెయ్యటం కొంచెం కష్టం తో కూడిన వ్యవహారం. అది ఎన్నకల సమయం లో ఏంటో కొంత ప్రభావం చూపిస్తుంది.  

పధకాలు పార్టీ ని భల పరచటానికి పెట్టిన అ పధకాలను స్థానిక నాయుకులు కొందరు తప్పుడు ధ్రువ పత్రలు పొందు పరిచి అ లబ్ది ప్రజల వరుకు చేరకుండా ఎవరో ఒక అనమకుడిని అడ్డు పెట్టుకొని దొంగ లబ్ది దారులును సృష్టించి ప్రభుత్వ సొమ్ముకి గండి గొడుతున్నారు (సాక్ష్యాలు కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి ) - అధినేత ముఖ్య ఉద్దేశం నిజమైన నిస్సహాయుడికి  తమ పధకం చేరాలి అని. కానీ స్థానిక లేకి నాయకులు వాటిని తమ స్వార్ద ప్రయోజనాల కోసం పధకాల ముఖ్య ఉద్దేశాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు అది కూడా అతి చిన్న మొత్తానికి కక్కుర్తి పడి.

మరొక సరి పాలక పార్టీ కి అవకాశం రావచ్చు ఏమో కానీ ఒక్కసారి సవారి దిగితే ప్రత్యర్ది కార్యరూపానికి మరొకసారి అవకాశం దక్కటం కష్టం.  
  


  





 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image

Advertisement