Archive

Search

హైలైట్స్

వీక్షించిన వారి సంఖ్య

Saturday, 30 June 2018

ప్రైవేటికరణ వలన దేశానికీ ముప్పు తప్పదు       
ప్రభుత్వ సంస్థలను ప్రైవేటికరణ చెయ్యటం వలన దేశానికీ ఒరిగేది ఏమిలేదు. అది వాస్తవం కూడా.  ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలు ఈ ప్రైవేటికరణ మాయలో పడి పెట్టుపడిదరి వ్యవస్థను ప్రోత్యహించి తమ తప్పు తెలుసుకొని బాధ పడి తప్పు సరిదిద్దుకున్న సంఘటనలు ఎన్నో .

పెట్టుబడిదారులకి వారి వ్యవస్థ లో వారి సరుకు అమ్ముడుపోవాలి నష్టం రాకుండా , తమ సరుకు మాత్రమే అమ్ముడుపోవాలి, దాని కోసం ఎంతవరుకు అయిన తెగిస్తారు. అవసరం అయితే తమ తయురు చేసిన ఖర్చు వస్తే చాలు , ముందుగ  తన  కంపెనీ పేరు పొందాలి అనే ఉద్దేశం తో  తయారీ చేసిన ఖర్చు కే వారు సరుకు అమ్మేస్తారు. ఈ విధముగా చేస్తే వారు తమతో పోటి పడే వారిని దెబ్బ తియగలరు అనే ఆలోచన , ప్రణాళిక.

అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ ఎవడో ఏమిటో తెలియకుండా ఋణాలు మంజూరు చేస్తారు. వారికీ కావలిసింది సంవత్యరం లో వారి టార్గెట్ చేరుకోవటం. నెలకి ఇన్ని లోన్ లు అని చూపించటం. ఈ పోటి వ్యవస్థ లో వినియోగదారుడు ఎక్కడ చెయ్యి జారిపోతాడ అనే అభద్రత భావనతో వాడు ఉన్న  ఆర్ధిక పరిస్థితులలో ఋణము కట్టగాలాడ లేదా అనే అంశం ప్రక్కన పెట్టి వసులు  చెయ్యగలం అనే గుడ్డి నమ్మకంతో ఋణాలు మంజూరు చెయ్యటం. ప్రభుత్వ అనుసంధనం ఉన్న బ్యాంకింగ్ సంస్థలతో జత కట్టి ఋణాలు తెచ్చుకొని మరి ఋణాలు మంజూరు చెయ్యటం వాళ్ళ దివాలా తీసిన ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థలు ఎన్నో.


అలాగే బ్యాంకు మేనేజేర్లు, వెరిఫికేషన్ ఏజేంట్ల తో కుమ్మకు అయ్యి బ్యాంకు ఋణాలు ఎన్నో మంజూరు చేసారు అనేది వాస్తవం.  వారి దగ్గెర సొమ్ము తిరిగి పొందే దమ్ము లేక సామన్యుడి మీద అ భారం మోపటమే కాకుండా ఫిక్స్ డు డిపాజిట్లు విషయం లో వెర్రి నిర్ణయాలు తీసుకోని ప్రజలను భయందోలనకు గురి చెయ్యటం చేతకాని చర్య క్రింద పరిగణించవచ్చు.

ప్రభుత్వ పరిధి లో నడుస్తున్న బ్యాంకు ల లోనే అవినీతి జోరుగా నడుస్తుంది. ఒక రైతు కి వ్యవసాయ ఋణం ఇవ్వాలి అంటే అక్కరలేని రూల్స్ , వెరిఫికేషన్లు, ఫీల్డ్ ఆఫీసర్ గారి అనుమతి, మేనేజర్ గారికి రాజకీయ సిఫార్సులు చేయిస్తే కానీ పని జరగటం లేదు. ఒక విద్యార్ది ఇతర దేశాలకి వెళ్లి చదువుకోవాలి అని ఎడ్యుకేషనల్ లోన్ కి దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష వంకలు , డొంకలు. అదే ఆర్ధిక నేరగాళ్లకు నకిలీ పత్రలు పెట్టుకొని లోన్ సేనక్షన్ చేసే కామినే వ్యవస్థ లో మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. 

దేశ ఆర్ధిక లావాదేవీలు మొత్తం బ్యాంకింగ్ నెట్వర్క్ ద్వారానే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఒక వేళా మన బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతింటే మన దేశ ఆర్ధిక వ్యవస్థ ఎంత చిన్న బిన్నం అవుతుందో.

ఇందుకు ప్రణాళిక రచించింది పెట్టుబడుదారులు అనటం లో ఏ మాత్రం సంకోచిన్చానవసరం లేదు. ప్రభుత్వ రంగం లో బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బ తిని దివాలా తీస్తే అందుకు ప్రత్యామ్నాయo కేవలం  ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థే. ఇప్పుడు చెప్పండి ఇది అంత మన పాలకులకు పర్యవేక్షణ లో జరుగుతుందా ? లేదా ? కార్పొరేట్ లాబీయింగ్ లో అప్పు ఎగాకొట్టే వారు అంత కేవలం తేరా వెనక ఉండి ఎవరో కదిపిన పాములు మాత్రమే, అసలు పాత్రదారులు, సూత్రదారులు భారత దేశం లోనే ఉన్నారు. అలాగే విద్య వ్యవస్థను కూడా చీల్చి చెండలుతున్న ప్రైవేట్ చెండలులు, ప్రభుత్వ పాఠశాల లను ఎదగనివ్వకుండా తొక్కి పెడుతున్నారు. విద్య కూడా ఇప్పుడు అమ్ముడుపోయే సరుకుగా సామాన్యుడు ఎందుకు పరిగినిచవలిసివస్తుంది.  పెట్టుపడి దారుడి వ్యవస్థే దీనికి మూలం.  

నిధులు , విధులు సక్రమంగా ఉపయోగించుకుంటే సంస్థల భారం ప్రభుత్వం మీద పడదు.  ప్రభుత్వ సంస్థల భారం ప్రభుత్వం మీద ఎందుకు పడుతుంది అంటే, ప్రజలను సోమరులను చేసే పధకాలు ప్రవేశ పెట్టి ఓటు రాజకీయం చేద్దాము అనే ఉద్దేశం తో  అధిక భారము రాష్ట్రం మీద రుద్ది , ఇప్పుడు ప్రభుత్వ సంస్థల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది అని నెత్తి, నోరు కొట్టుకుంటే ఏమి వస్తుంది, ఉన్నది ఉడటం, లేనిది రాలటం తప్ప. 

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థతి లో రాష్ట్ర ప్రభుత్వం లేదు అటువంటి పరిస్థితులు కల్పించారు. అసలు కొన్ని పధకాలలో తప్పుడు ధృవీకరణ పత్రలు జత పరచి  నెల నెల  లబ్ది  పొందుతున్న   అక్రమార్కులు ఎంతోమంది, అసలు రాజకీయ పార్టీ పేరు చెప్పి స్థానికి ప్రభుత్వానికి నష్టం చేకుర్చి ప్రభుత్వ ఆదాయానికి ఘండి కొట్టే వారు ఎంతమందో తెలుసుకుంటే,  అక్రమ లబ్ది దారులకు వెళ్ళే డబ్బులతో ఒక జిల్లాను దత్తత తీసుకోవచ్చు. ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో సర్వే  చేయ్యించి నకిలీ లబ్దిదారులకు వచ్చే ప్రభుత్వ లబ్ది ని ఆపితే రాష్ట్ర   ప్రభుత్వ ము దగ్గెర రాష్ట్రానికి సరిపడ నిధులు  ఉంటాయి. 

ఈ పధకాలు, బ్యాంకు ఋణాలు ఎగావేతలు , ప్రభుత్వ సంస్థలను ప్రైవేటికరణ చేద్దాము అనే ఆలోచనల తో త్వరలో భారత దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తియ్యటం ఖాయం ! చూస్తూ చూస్తూనే అంత జరిగిపోతుంది, అ సమయములో నిస్సహాయంగా సామాన్యులు వెర్రిచూపులు చూస్తూనే ఉంటారు.

 Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

Image