Skip to main content

వాడు రాజు అయితే మంత్రి కుల వ్యవస్థ, భటులు వాడిని నమ్మిన వారు, ఎవరు చచ్చిన, బ్రతికిన అ ఆట ఆడే వాడికి కావలిసింది రాజ్యం       

మన భారత దేశం లో అపరాధి కి శిక్ష వేసేది కేవలం అతని లో మార్పు తీసుకోని రావటం కోసం ( రేఫోర్మటివ్  తియోరి) అంటే శిక్ష లు అనుభవించిన తరువాత  ఖైది తన బుద్ది మార్చుకుంటాడు అనే ఉద్దేశం తో , స్వేచ్చ ని హరిస్తే అ సమయం లో అతని లో మార్పు వస్తుంది అని భావించి ఈ పద్దతి ని అనుసరిస్తున్నారు.

మన భారత దేశం లో 75%  కేసు లు రాజకీయ నాయకుల (రాజకీయ కక్షల నేపధ్యం లో ) ఒత్తిడి వాళ్లనే రిజిస్టర్ చెయ్యడం జరుగుతుంది. దానికి నిర్భయ చట్టం కూడా మినహాయింపు కాదు అనే చెప్పాలి. అందుకే భారత దేశం లో తక్షణ న్యాయ నిర్ణయ  ప్రక్రియ సాధ్య పడదు అనే చెప్పాలి .

ఎందుకంటే ! ఒక వేళా  మీరు అంటే పడని వారు (ఒక రాజకీయ నాయకుడి హోదా లో ఉంటె ) వారు మీ మీద ఒక దొంగ కేసు బనాయించడం ఎంత సేపు అనే ప్రశ్న ఒక్కసారి వేసుకోండి!   సరైన విచారణ లేకుండా వెంటనే మీకు లైఫ్ శిక్ష పడితే ! లేదా ఉరి శిక్ష ఖాయం చేస్తే ! వెంటనే ఉరి తీసిని తరువాత మీరు నిర్దోషి అని తేలితే ! 

ముందు విచారణ చేసే వ్యవస్థ (పోలీస్ వ్యవస్థ ) మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడులు ఉండకుడదు, వారికీ సరిపడ  జీతం ఇవ్వాలి, మీకు తెలుసా ఆదివారం కూడా పోలీస్ వారికీ సెలవలు ఉండవు  ( జీతం తీసుకోకుండా పని చేస్తున్నర ఏంటి అని ప్రశ్నిస్తున్నారా?) వారి కి ఇచ్చే జీతం వారు చేసే పని కి చాల తక్కువ అనే చెప్పాలి. కనీసం తమ కుటుంబ సభ్యులతో సమయం గడపటానికి తగినంత సమయం వ్యచించలేని పరిస్థితి లో చాల మంది పోలీస్ లు ఉన్నారు.   
"కధువా" బాధితురాలి పరిస్థితి కి ఒక రకంగా మన వ్యవస్థ కారణం ! చాల మంది తమ రాజకీయ కక్ష లు తీర్చుకోవడానికి, లేదా వారి స్వప్రయోజననికి  ప్రభుత్వం గట్టిగ అమలు చేసిన 
కొన్ని చట్టాలను తమ స్వార్ధం కోసం వాడుకోవడం వాళ్ళ ఇప్పుడు ఆసిఫా కేసు లో తక్షణ న్యాయం పొందలేకపోతున్నాం .

స్త్రీ సంరక్షణ కోసం రూపొందించి 498-A, గృహ హింస చట్టం , మనోవర్తి కేసులు  ఎంత వరకు వాస్తవంగా నిజమైన అభియోగాల పైన నమోదు అవుతున్నాయి అనే విషయం అందరికి తెలిసిన విషయమే, సంసారం లో జరిగే చిన్న చిన్న తగాదాలు , పంచాయతి చేసే పెద్ద మనిషి అహం దెబ్బతిన్న , మాట్లాడుకుంటే సర్దుకొని పోయే సమస్యలు కు అహం అడ్డం వచ్చి ఇప్పటి వారుకు ఎన్ని సంసారాలు నాశనం అయ్యాయి! ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి !  మీ దృష్టి లో కి చాలానే వచ్చి ఉంటాయి.

చట్టాలు మనలని రక్షించుకోవడానికి, మన హక్కులను రక్షించుకోవడానికి అంతే కానీ  మనం వాటిని అడ్డుపెట్టుకొని  మన అహం సంతృప్తి పరుచుకోవడానికి కాదు.

కొంత మంది రేప్ కేసులు పెట్టి, చివరిగా బాధితురాలు ముద్దాయి మొహం నాకు తెలియదు అని చెప్పి కేసు కొట్టి వేయించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అక్కడ ఏమి జరిగి ఉంటుంది అనే ఆలోచన మీకే వదిలేస్తున్నాము. 

చట్టాల ను దుర్వినియోగం చేసి, తప్పుడు రిపోర్ట్ లు పోలీస్ వారికీ ఇచ్చి , చివరికి డబ్బులు తీసుకోని రాజి కుదిర్చుకొని కేసు లు కొట్టివేయించిన  ప్రతి ఒక్కరు ఈ రోజు ఆసిఫా కి జరగవలసిన న్యాయం  విషయం లో జరిగే ఆలస్యం కి కారకులా -కదా ? అనే ఆలోచన మీకే వదిలేస్తున్న .

ప్రస్తుతం  దేశం లో రాజకీయ నాయకుడి హోదా లో ఉంటె అవినీతి ఎంత చేసిన తప్పించుకోవచ్చు !
వారి అవినీతి మీద ప్రశ్నించిన వారి ఉద్యోగాలు తిసేయ్యవచ్చ్హు !
ఉద్యోగి కాకపోతే వారి మీద బురద చల్లవచ్చు !
పోలీస్ వారు వారి మాట వినకపోతే వారిని ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా ప్రమోషన్ లిస్టు లో నుంచి తోలిగిస్తారు , లేదా రుజువులు లేని అభియోగాలు మోపి వారిని దారికి తెచ్చుకుంటారు !

ఎందుకు ! ఎన్నుకున్న మనం ప్రశ్నించకుండా ఉండి పోవటం వలన ! మనం ఎన్నుకున్న వాడు మనలని ఏమి చేస్తాడో అనే భయం తో !  హ నా కుటుంబ నేను భాగానే ఉన్నాము కదా అనే మన ఆలోచనతోన!  

భారత దేశం లో  ఈ నాయకులకు కావలిసిన అన్ని కులాలు ఉన్నాయి ! మతాలు ఉన్నాయి ! అగ్రవర్ణాలు హింస  అని ఒకడు ఎదగాలని వేసే ఉచ్చులో కొంత మంది ! బడుగు బలహీన వర్గాలు  అని మరొకడు ఎదగాలని వేసే ఉచ్చులో ఇంకొంత మంది !

కుల వ్యవస్థ హద్దులలో  ఉంటె సమజానికి  మంచిది - ఎప్పుడు అయితే హద్దులు దాటుతుందో అప్పుడు దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనే విషయం మీ ఆలోచనకే వదిలేస్తున్నాము.  

కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే ఈ రోజు చస్తే రేపు ఏ వర్ణం లో పుడతము, అసలు పుడతమ లేదా  అనే ప్రశ్న కి ఎవడి దగ్గెర సమాధానం లేదు  . తెలుసుకోవలిసిన విషయం ఏమిటి అంటే ఒకడు రాజకీయ చదరంగం ఆడతాడు అ ఆట లో వాడు రాజు అయితే మంత్రి కుల వ్యవస్థ, భటులు వాడిని నమ్మిన వారు, ఎవరు చచ్చిన, బ్రతికిన అ ఆట ఆడే వాడికి కావలిసింది రాజ్యం. 

హిందువ - ముస్లిమా - క్రిస్టియన్  అనే విషయం ప్రక్కన పెడితే కధువా బాధితురాలు 8 సంవత్యరాల చిన్న పిల్ల- ఆమె ఒక స్త్రీ  - లోకం తెలియని అమాయకురాలు - మనం పోరాడలిసింది ఆమె కి జరగవలిసిన  న్యాయం మీద న్యాయ పోరాటం చెయ్యడం, ఆమె వైపు పోరాడుతున్న మహిళా న్యాయవాది కి రక్షణ కల్పించడం, మహిళకు మన భారత దేశం లో ఎంత వారుకు భద్రత ఉంది అనే విషయం పైన ఒక్క సరి ప్రశ్నించుకుంటే - సమాధానం మనకే దొరుకుతుంది.     

       Post by

 Quickandhra Independent Web Media Publication


In Association with

I
mage

Articles

Politics

Crime

National Politics

International Politics