ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

బందులు , రాస్తరోకలు, ముఖ్యమంత్రి గారి వాళ్ళ ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అనేది సమాధానం కాదు



       
ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి కేంద్రం నిధులు 90% గ్రాంట్ల గాను 10% అప్పు రూపములో నిధులు మంజూరు చేస్తారు. గ్రాంట్ల ద్వార వచ్చిన సొమ్మును తిరిగి చెల్లించనవసరం లేదు. పరిశ్రమలు ఏర్పాటు చెయ్యాలి అంటే 100% ఎక్సైజ్ డ్యూటీ రాయతి ఉంటుంది  అలాగే ఇన్కమ్ టాక్స్ లో కూడా రాయతి ఉంటుంది. అలాగే  పన్ను మినహాయింపు కూడా ఎక్కువ ఉంటుంది.


ఇది పారిశ్రామిక వేత్తలకు చాల లాభసాటి వ్యవహారం. ఆంధ్ర రాష్ట్రం లో పరిశ్రమలు స్థాపించడానిక పారిశ్రామిక వేత్తలను  ప్రభుత్వం ఆహ్వానించ వలిసిన అవసరం ఉండదు, వారె స్వయముగా వచ్చి ఇక్కడ తమ వ్యాపార వ్యవహారాలు నడుపుతము అని అర్జి దాఖలు చేసుకొని మరి పరిశ్రమలు స్థాపిస్తారు.   

ఆంధ్ర రాష్ట్రం ఉద్యోగాల కొలువు క్రింద మారుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల లో కూడా నిరుద్యోగం తగ్గుతుంది అనే చెప్పాలి. కేంద్రం స్పెషల్ స్టేటస్ కేటాయిస్తే నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పేరు తో చరిత్ర లో మిగిలిపోతుంది అనే చెప్పాలి.

ఎందుకంటె పారిశ్రామిక అభివృద్ధి అంటే నేటి తరం కలలు  కంటున్నా భవిష్యత్తు కి ఒక దారి చుపించినట్టే. ఇప్పుడు అక్షరాస్యత ఎక్కువ, అందరు ఉన్నత విద్యలు అభ్యసిస్తున్నారు, ప్రతి ఇంటికి ఉద్యోగం అవసరం ఈ సమయంలో ప్రత్యేక హోదా సాధించిన, ఇచ్చిన ఇప్పటి యువతరం హృదయం లో  చిరస్థాయిగా  నిలిచిపోతారు. గూగుల్  లాంటి పెద్ద సంస్థలు పన్ను రాయతిలకోసమైన ఇక్కడ ఒక  సంస్థను స్థాపిస్తాయి.

ఇటువంటి లబ్ది పక్కన పెట్టి ప్రత్యక పేకేజ్ ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగమె కానీ అభివృద్ధి ఎప్పటికి ఒక ప్రశ్నే. కేవలం ముఖ్యమంత్రి గారి వలెనే మేము ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అనేది వారిని భల పరచడానికి చెప్పే మాట అవుతుంది ఎందుకంటే పార్టీ లు , వ్యక్తులు పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రాతినిద్యం వహిస్తున్న ముఖ్యమంత్రి హోదా లో ఉన్నారు, ఒక మాట ఆయనని అన్న ప్రతి ఆంధ్రుడిని అన్నటే, అలాగే ప్రధానమంత్రి హోదా లో ఉన్న వారు కూడా మన దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారే అయన గురించి మాట్లాడేటప్పుడు మన దేశ ప్రధాని అనే ఒక విషయం మనసులో పెట్టుకొని వ్యవహరిస్తే దేశానికీ గౌరవం. ఎందుకంటె సోషల్ నెట్వర్కింగ్ అంటే ఒక దేశ పరిమితి ధాటి వ్యాప్తి చెందే విషయం. ఒక పార్టీ అభిమాని మరొక పార్టీ నాయకుడిని  దూషిస్తే వారు తిరిగి వీరిని దూషిస్తారు, ఈ మధ్యలో మనం దూషిస్తుంది , నిందిస్తుంది మన రాష్ట్ర, దేశ ఉన్నత స్థాయి లో ఉన్న వ్యక్తులని అని గుర్తుపెట్టుకోవాలి .

పోరాటం అంటే దూషించడం, నిందించుకోవడం కాదు, సమస్య పరిష్కారనికి మార్గం వెతకటం. ఆంధ్ర రాష్ట్రం కేంద్రానికి ఎంత టాక్స్ కడుతుందో తెలుసా ఒక్కసారి ఆలోచించండి. "Non Cooperation movement" " " సహాయ నిరాకర సమ్మె " మన భారత దేశం  యొక్క బానిస సంకెళ్ళు తెంచే క్రమంలో అప్పటి స్వాతంత్ర సమర యోధులు వాడిన  అస్త్రం, ఇప్పటికి ఇంగ్లీష్ వారు వెబ్ సైట్ లో ఈ ఉద్యమం గురించి వివరాలు పొందుపరిచారు. చరిత్ర లో నిలిచిపోయిన పోరాటం ఇది.

ఒకరిని ఒకరు దుషించుకుంటే ఏమొస్తుంది, చేసే పని కార్య రూపం లో చూపించి, సాధించి చూపిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలలో చిరస్థాయి లో నిలిచిపోతారు వారు ముఖ్యమంత్రి అయిన, ప్రధాన మంత్రి అయిన.

ఆలోచించండి ఆంధ్ర రాష్ట్రానికి హోదా కావాలి, అది గౌరవంగా. ఏమి చేస్తే హోదా వస్తుంది అనేది ప్రశ్న ......? ఎలాగా చేస్తే హోదా దక్కుతుంది అనేది ప్రశ్న ? హోదా వస్తే మన తరువాత తరం వారికీ లబ్ది ఉన్నదా ? లేదా ? అనేది ప్రశ్న ?

ఆలోచించండి బందులు , రాస్తరోకలు,  ముఖ్యమంత్రి గారి  వాళ్ళ ప్రత్యక హోదా ఇవ్వటం లేదు అనేది సమాధానం కాదు. ప్రతి తెలుగు వాడు, ప్రతి ఆంధ్రుడు  తరువాత తరం  కోసం  ఆలోచించవలిసిన ప్రశ్న. పార్టీ లు , వ్యక్తులు అన్ని ప్రక్కన పెట్టి ఆలోచించండి ఎవరిని సమర్దించకుండ, ఎవరిని దుషించకుండా ఆలోచిస్తే , ఆంధ్ర  రాష్ట్రానికి మంచి  విద్య సంస్థలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మనం, మన ముందల తరలు అ అభివృద్దిని చూస్తాము, అభివృద్ధి ఫలాలు అందుకుంటము అనే ఉహ ఎంత బాగుంది, అదే నిజం అయితే    అనే విషయం ఆలోచించండి , అందు కోసం ఏమి చేస్తే హోదా ని సాధిస్తాము అనే విషయం ఆలోచించండి. ఈ ముఖ్యమంత్రి మీద నిందలేసి హోదా ఇవ్వటం లేదు అంటున్నారు, రేపు అయన స్థానంలో మరొకరి మీద కూడా నిందలు వేసి కుదరదు అంటే ? అప్పుడు ? అప్పుడు పరిస్థితి ఏమిటి ?

ఐకమత్యం మహా భలం - ఇప్పుడు ఆంధ్రరాష్ట్ర ప్రజలు అందరికి రాష్ట్ర   హక్కు ను సాధించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతే కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవలిసిన పరిస్థితి ఉందా లేదా ? అనే  ప్రశ్న పాఠకుల ఆలోచనకే  వదిలేస్తున్నాము.

ఏ పార్టీ ని సమర్దించటం లేదు - ఏ పార్టీ ని దూషించటం లేదు- ఏ పార్టీ కి అనుకూలం కాదు - ఏ పార్టీ కి వ్యతిరేకం కాదు  - Independent Web Media Publication - www.quickandhra.com





 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement