ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

అజీర్ణము ఆయుర్వేద చిట్కాలు



       
ఆహారమును, శిధిలము చేసి చిన్న చిన్న అణువులుగా మార్చి, శరీరంలోకి పంపే ప్రక్రియను జీర్ణ క్రియ అంటారు. ఇది సరిగా జరగనప్పుడు జీర్ణము కాలేదు లేదా అజీర్ణం అని అనబడుతుంది. సరిగా జీర్ణం కానీ ఆహారం పులిసి కడుపులో గ్యాస్ ను పుట్టిస్తుంది. జీర్ణం అయిన ఆహారం పులియలేదు కాబట్టి ఏ సమస్యను కలిగించదు.  ఆహారం పులిసి న తరువాత వచ్చే వాయువు (గ్యాసు) ముందుగ కడుపు ఉబ్బారాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితి కొన్ని రోజులు కొనసాగితే అన్ని రోగాలకు కారణం అవ్వుతుంది అదే అజీర్ణం.

కడుపులో నొప్పి, జీర్ణ శక్తీ మందగించడం, తిన్న ఆహారం అరగాకపోవడము, అరుచి, ఆకలి లేకపోవటం మొదలగు సమస్యలు మనలో జీర్ణ శక్తి తగ్గినప్పుడు కలుగుచుంటాయి. విపరీతముగా త్రేనుపులు, పొట్ట ఉబ్బరించినట్లుగా, ఆయసముగా ఉండుట కూడా జరుగును. తేనుపు చాలామందికి పుల్లగా ఉండి చాతిలో మండుట, కడుపులో మండుట కూడా కలిగించును. తినే ఆహారం పైన రుచి కలగదు. ఒక్కోసారి డోకులు లేద వాంతులు కలుగును. అజీర్ణము వలన వాంతులు చిన్న పిల్లలో కలిగే అవకాశం ఎక్కువ.

కారణాలు :
1 భోజనం శక్తి కి మించి సేవించడం
2. నీరు ఎక్కువ త్రాగడం
౩.ఒక సమయం ప్రకారం భోజనం చెయ్యకపోవడం
4.నియమిత సమయములో నిధ్రలేకపోవడం
5.కోపము, భయము, ఆందోళన ల కు గురైన సమయములో ఆహారం సేవించడం

తీసుకోవలసిన జాగ్రత్తలు
సులభముగా జీర్ణము అయ్యే ఆహారం తీసుకోవడం
బియ్యములో నీరు ఎక్కువ పోసి తీసిన చిక్కటి గంజిని త్రాగాలి.
పెసరపప్పు కట్టు త్రాగవలెను.
మజ్జిగ ఎక్కువ తీసుకోవలెను.
వంటలో ఇంగువ, వెల్లుల్లి , అల్లము ఎక్కువ వాడాలి.

నియమాలు:
కృత్రిమ పద్దతిలో చల్ల బరిచిన నిరు త్రాగరాదు.
ఏకాగ్రతతో భోజనం చెయ్యాలి
ముందు తిన్న ఆహారము జీర్ణం కాకముందే మళ్ళి తినకూడదు
15 నిమిషాల పగటి నిద్ర మంచిది. ఎడమ ప్రక్కన పోడుకోవాలి.
రోజులో మధ్య మధ్యన వేడి నీళ్ళు త్రాగాలి .
 







 Post by

 Quickandhra Independent Web Media Publication

Advertisement