ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

సర్కార్ పైన సర్పంచుల తిరుగుబాటు ....
పార్టీ లకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ లో  సర్పంచులు కదం తొక్కారు. పోలీసుల ఆంక్షలను తప్పించుకొని రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిన 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని గర్జించారు. నిధులు ఇవ్వాలని, లేదంటే సర్పంచి పదవులను రద్దుచేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇన్నాళ్లూ ఓపిక పట్టామని, ఇక తాడో పేడో తేల్చుకుంటామని ఆగ్రహోదగ్రులయ్యారు. తాడేపల్లిలోని రాష్ట్ర " పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ముందు శుక్రవారం కనిపించిన వాతావర ణమిది. గ్రామ పంచాయతీలకు కేంద్రం కేటాయించిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.948 కోట్లను విడుదల చేయాలన్న డిమాండుతో పలు జిల్లాల సర్పంచులు కమిషనర్ కార్యాలయం ముట్టడికి శుక్రవారం యత్నించారు. ఒకరోజు ముందే సర్పంచుల సంఘం పిలుపునివ్వడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సర్పంచులు కార్య క్రమానికి హాజరుకాకుండా పోలీసులు ఆంక్షలు విధిం చారు. కమిషనర్ కార్యాలయానికి ఇతరులెవరూ వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. పలు జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న సర్పంచులు శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత కమిషనర్ కార్యాలయానికి చేరుకు న్నారు. తమ డిమాండ్లతో కూడిన నినాదాల ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు చుట్టుముట్టడంతో కాసేపు ఉద్రిక్తతత తలెత్తింది. ఈలోగా పంచాయతీరాజ్ శాఖ ఉపకమిషనర్లు డి. సత్యనారాయణ, నాగార్జు నసాగర్, గణాంకాధికారి వీరాంజనేయులు వచ్చి సర్పంచులతో మాట్లాడారు. సర్పంచులు మూకుమ్మడిగా ఆది కారులతో వాగ్వాదానికి దిగారు. సమస్యలపై వినతి పత్రం ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని అధికారులు చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేసేవరకూ కదిలేది లేదని సర్పంచులు పట్టుబట్టారు. పోలీసులు వారిని తరలించే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తతత వాతావరణం ఏర్పడింది. పలు వాహనాల్లో మంగళగిరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి 32 మందిని అరెస్టుచేసి, తర్వాత విడుదల చేశారు. అనంతరం సర్పంచులంతా అక్కడే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అరెస్టయిన సర్పంచులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మంగళగిరిలో కలిసి పార్టీ తరపున సంఘీభావం ప్రకటించారు.


In Association with 
 News9 

Follow us in 
Advertisement