ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

కుల వ్యవస్థ నిర్మూలన సాధ్యమేనా?



  • కుల వ్యవస్థ నిర్మూలన సాధ్యమేనా?
  • కుల వ్యవస్థ నిర్మూలన ఈ రోజుల్లో ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో సాధ్యపడుతుందా?
  • అసలు ఈ కుల వ్యవస్థను ఎవరు పెంచి పోషిస్తున్నారు?
  • భారతదేశంలో కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న విషయాలు ఏమిటి?
  • రాజ్యాంగం పేరు చెప్పుకునే వాళ్ళు ఆ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారా లేదా?
  • అసలు కుల వ్యవస్థనే పెంచి పోషిస్తుంది ఎవరు?
  • అంబేద్కర్ పేరు చెప్పుకొని ఆయన రాసిన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంది ఎవరు?

భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఒక మానసిక రుగ్మత కింద సంఘంలో వ్యాప్తి చెందుతుంది. చాలామందికి ఈ కుల వ్యవస్థ అనేది లేకుంటే భుక్తి తృప్తి అనేది ఉండదు, ఇంకొంతమందికైతే ఇది తమ మనుగడకు తమ ఉనికి చాటు చెప్పుకోటానికి ఒక బ్రహ్మాస్త్రం. కులాన్ని ఎవరు ఉద్ధరించరు అలాగే ఆ కులంలో ఉన్న వారిని ఎవరు ఉద్ధరించారు కానీ ఆ కులంలో ఉండే సంఖ్యాపరమైన విషయాలు వారికి ఎన్నికల సమయంలో గానీ తమ మనుగడని చాటి చెప్పుకోవడానికి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. అవినీతిని సంఘవిద్రోహ చర్యలను అసభ్యకరమైన చాష్టలను ఏ కులము అంగీకరించదు ఏ సామాజిక వర్గానికి చెందినవారు దాన్ని ఆక్షేపించారు. కాని ప్రస్తుతం నేటి సమాజంలో ఒక రాజకీయ నాయకుడు నగ్నంగా దర్శనం ఇచ్చిన అతన్ని సమర్థిస్తూ కుల సంఘాలు ఆ వ్యవహారాన్ని ఏమీ కాదు మా వాడే అని చెప్పుకునే స్థాయికి నేటి కుల వ్యవస్థ ఎదిగిపోయింది.

వాస్తవానికి అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ప్రతి మనిషి యొక్క భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి పౌరులను అనవసర కారణాల గురించి హింసించకూడదని స్పష్టంగా రాసి ఉంది. కానీ ఆయన పేరు చెప్పుకొని ఆయన దయవల్ల ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకునే చాలామంది అలాగే ఆయన కలలు నిజం చేయడానికే తాము ఉద్భవించామని ప్రగల్బాలు పలికే చాలామంది నేడు అదే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ భావవ్యక్తీకరణ స్వేచ్చను వినియోగించుకుంటున్న పౌరులను భౌతిక హింసలకు గురి చేయటం గమనార్హం, ఈ పరిణామాలన్నీ సమాజంలో కుల వ్యవస్థను ఎందుకు పోషిస్తున్నారు అనే విషయానికి ఒక పారదర్శకమైన సమాధానమానే చెప్పాలి.

కుల వ్యవస్థలను వ్యవస్థాపించి, తమ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని, నీతులు  చెప్పి విద్వేషపూరితమైన భావాలను ప్రజల మనసులో నింపే ఏ ఒక్కరు కూడా ఈ దేశంలో జరిగే అవినీతిని కానీ ఏ సంస్థలో నైనా జరిగే అవినీతిని కానీ నివారించలేకపోవడం గమనార్హం, కేవలం రాజ్యాధికారం పొందిన వారి మెప్పుకోసం ఇవన్ని అని చెప్పటానికి ఏ విధముగా సంకోచిన్చనవసరం లేదు, ఇప్పటికే కొన్ని వ్యవస్థల్లో బానిసత్వం అనేది పోలేదనే చెప్పాలి.

ప్రస్తుతం మనదేశంలో  కుల వ్యవస్థ ,  ఇది ఒక మానసిక రుగ్మత, ప్రపంచమంతా వ్యాప్తి చెందిన మానసిక రుగ్మత, వాస్తవానికి ఇదొక మానసిక వైకల్యం అని చెప్పాలి. ప్రపంచమంతా ఈ  వైకల్యం ఉంది , అమెరికా లాంటి దేశంలో తెలుపు నలుపు అనే రెండు విషయాల్ని పరిగణలోకి తీసుకొని, మనుషుల యొక్క రంగుల ఆధారంగా వారికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది వివక్షకు గురి చేయటం,  ఇంకా ఇస్లాం దేశాల్లో సున్ని షియా అనే రెండు వర్గాలు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అందరికీ తెలిసిందే, ఇంకా క్రిస్టియానిటీ విషయానికి వస్తే ఇందులో కేథలిక్సన్ అని బాపిటిస్టులని మరియు ఇంకా చాలా వ్యవస్థలలో ఆధిపత్య పోరు, వివక్ష  నడుస్తుంది. 

పైన తెలిపిన ప్రతి విషయం కూడాను కేవలం వ్యక్తులు యొక్క ఉనికి కోసం లేదా వారి వ్యక్తిగత లాభాల కోసం లేదా రాజకీయ అవసరాల కోసం ఈ కుల వ్యవస్థలను ఈ మానసిక రుగ్మతను పెంచి పోషిస్తున్నారు. వృత్తులను బట్టి కులాలను పూర్వం ఎప్పుడో నిర్దేశించారు కానీ కాలం గడుస్తున్న కొద్ది అది ఒక వర్గం మీద వివక్ష కింద ఏర్పడింది, కానీ ఆ వివక్ష ఎందుకు వచ్చింది అనే విషయం పైన ఎవరికీ అవగాహన లేదు అలాగే ఏ సమయంలో ఏ సందర్భంలో ఎవరి మూలాన ఆ వివక్ష ఏర్పడింది అనే విషయం పైన ఎవరికీ అవగాహన లేదు. కుల వ్యవస్థ అనే మానసిక రుగ్మత ఎక్కువ మధ్యతరగతి సామాన్య జీవన విధానంలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ కుల వ్యవస్థను పెంచి పోషించే వారికి కూడా వాళ్లే అవసరం ఎందుకంటే వాళ్లు సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఉన్న వారు కావాలి, వారి వెంట నడిచి సమూహం కావాలి, వాళ్లకి జేజేలు కొట్టేవాళ్ళు పల్లకి మోసే వాళ్లు కావాలి కాబట్టి వాళ్లందరినీ ఒక తాటి మీదకు తీసుకురావాలి అంటే కుల వ్యవస్థ తప్ప వేరే ఒక అస్త్రం అనేది లేదు.

ఏ సామాజిక వర్గంలో నాయనా నోరెత్తిన వాడే అన్ని అనుభవిస్తాడు మిగతావారు గొర్రెలు కాపరి వెనుక గొర్రెల్లాగా మిగిలిపోతారు, ఒక్కసారి ఆ నోరెత్తిన వాడికి కావాల్సిన దొరికిన తర్వాత గొర్రెలు కాపరి కసాయివాడికి  గొర్రెను అమ్మేసి ఏ విధంగా సొమ్ము చేసుకుంటాడో, అదేవిధంగా ఈ సామాజిక వర్గ వ్యవస్థలో ఒక్కసారి నోరెత్తిన వాడు తానుకు కావలసిన దాన్ని తాను పొందిన తర్వాత తన వెనక నడిచిన వారిని అంతే కర్కోసకంగా సొమ్ము చేసుకుంటాడు.

కులమతాలు లేని రాజకీయం ఇప్పటివరకు దేశంలో లేదనే చెప్పాలి. కులాల వారీగా విభజన లేని, కేటాయింపులు లేని ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్ ఈ దేశంలో మీరు ఇప్పటివరకు ఎన్నడైనా చూశారా? మరి ఈ దేశంలో కుల వ్యవస్థల నిర్మూలన అనేది ఏ విధంగా సాధ్యమవుతుందని మీరు భావిస్తారు? సామాజిక వర్గాల్ని నిర్దేశించి మన రాజ్యాంగంలోనే ఉన్న వెసులుబాటును బట్టే కదా ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కేటాయింపు. సరే ఇది రాజ్యాంగ హక్కు వాస్తవానికి దీన్ని విమర్శించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు.

ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో ఉన్న మానసిక రుగ్మత గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి అవినీతికి పాల్పడిన సిగ్గులేకుండా బట్టలిప్పుకొని తిరిగిన వాడు మా వాడే నేనేమీ చేయలేను అనే పరిస్థితి మనం వ్యవస్థలో లేదా?

సైద్ధాంతిక పరంగా  కుల వ్యవస్థ నిర్మూలన అనేది చాలా మంచి విషయం కానీ ఇది క్యాన్సర్ రోగం లాగా సమాజంలో విపరీతంగా విస్తరించింది. దానిమీద ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న వినటానికి మనుషులే లేరు ఇప్పుడు. ప్రతి మనిషి యొక్క మానసిక స్థితి మీద కుల వ్యవస్థ అనేది బలమైన ప్రభావం చూపిస్తుంది. వాస్తవానికి ఇక్కడ వివక్షకి గురవుతున్న సామాజిక వర్గాలు వేరు వివక్ష పేరుతో ప్రచారం చేసుకుంటున్నా  సెల్ఫ్ స్టయిల్ నాయకులు వేరు. 

వాస్తవానికి కులం అనేది లేకపోతే ఈ రోజుల్లో చాలామందికి ఉనికి అనేది ఉండదు ఆ ఉనికి కోసం సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి లేని అభద్రతాభావాన్ని అలాగే దశాబ్దాల క్రితం గడిచిపోయిన సమయాన్ని కాలంలో కలిసిపోయిన సంఘటనలను పదే పదే ప్రస్తావించి యువత మనసులో విద్వేషపూరితమైన ఆలోచనలను ఏర్పరిచి వారిని తాము ఇప్పుడేదో వివక్ష గురవుతున్నాం అనే అభద్రతాభావానికి గురిచేసి తమ వెంట తిప్పుకోవడానికి తమ పల్లకీలు మోయడానికి ఉచితంగా జనాలను పోగు చేసుకోవడానికి చాలామంది చేస్తున్న కులవికృత చేష్టల్ని ఎవరు ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అన్ని కులాల్లోనూ ఈ మాదిరిగానే స్వలాభులు ఉన్నారు కాబట్టి.

వాస్తవానికి అమృత ప్రణయ్ విషయంలో ప్రణయ్ చనిపోయిన సమయంలో సోషల్ మీడియా మొత్తం హోరెత్తే లాగా హడలెత్తించిన పోస్ట్లు, ఉద్యమాలు, ఆ తర్వాత జరిగిన సంఘటనల్లో ఎక్కడా కూడా కనిపించలేదు, ఎందుకంటే అప్పటికి ఏదో ఒక సంస్థ దాని వెనకుండి ఆ విషయాన్ని వైరల్ చేసి ఒక మానసిక అభద్రతా స్థితికి ప్రజలను తీసుకొచ్చి, తమ ఉనికిని చాటుకొని తామంటూ ఒకరు ఉన్నామని తెలియజేసే ప్రయత్నం చేసి అందులో సఫలమై తమ ఉనికి చాటుకున్న తర్వాత తమకు కావలసిన గుర్తింపు తమకు వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. మిగత ఈ విషయాల పైన వారు స్పందించలేదు ఎందుకు ?

ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అటువంటి సంఘటనలు చాలానే జరిగాయి కానీ ఏ ఒక్కరు కూడా అంతగా రియాక్ట్ అవలేదు ఎందుకని? అప్పటికే గొర్రెలు కాపరి దగ్గరికి గొర్రెలన్నీ చేరుకున్నాయి అని అనుకోవాలా? 

వాస్తవానికి హైదరాబాదులో ఉన్న చింతకాయల విజయ్ అనే ఒక పార్టీకి చెందిన నాయకుడు ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న నాలుగేళ్ల చిన్నారిని మానసికంగా హింసించి తన తండ్రి తన తాత ఎక్కడున్నారు అనే విషయాన్ని కనుక్కునే ప్రయత్నం ఒక దర్యాప్తు సంస్థ చట్ట వ్యతిరేకంగా అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించింది. నిజంగానే ఇటువంటి దర్యాప్తు సంస్థలు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా? సదరు అధికారి ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఒప్పుకుంటుందా?

సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టారని ఒక పార్టీకి చెందిన వ్యక్తిని భౌతికముగా హింసించారు, దేశ అత్యున్నత న్యాయస్థానం 41 ఏ నోటీస్ ఇచ్చి వారికి ఆ నేరాలకు గాను స్టేషన్ బెల్ ఇవ్వాలని సూచించిన ఇవ్వకుండా వారిని నిర్బంధించి కోర్టుకి హాజరపరిచి, హాజరు పరిచిన కోర్టు కూడా ఆనిర్బంధాన్ని ఖండించిన, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులను కించపరిచిన వారి పైన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన పని చేయని దర్యాప్తు సంస్థలు దాన్ని నడిపేవారు భారతదేశ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు అనేనా? 

సాక్షాత్తు ఒక ఎంపీ నన్ను తీసుకెళ్లి భౌతిక దాడులు చేశారు అనే విషయాన్ని బహిర్గతంగా ప్రకటించడం కోర్టును ఆశ్రయించడం ఇవన్నీ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే విధానమేనా?

ఈ కుల వ్యవస్థ అనేది అధికారం పదవి కాంక్ష జనాదరణ ఉనికి చాటుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన బ్రహ్మాస్త్రం ఇది ఒక మానసిక రుగ్మత సంఘంలో వ్యాప్తి చెందిన మానసిక రుగ్మత దీనికి అంతం అనేది మనుషుల మార్పుతోనే ముడిపడి ఉంది అంతేకానీ సైదాంతకపరంగా ఎన్ని ప్రవచనాలు చేసినా ఎన్ని ప్రసంగాలు ఇచ్చిన వినిపోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఒక తెలివైన మనిషికి మిగతా వారిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు, ఎలాగంటే ఒక గొర్రెలు కాపరి కి తన వెనుక గొర్రెల మందను ఎట్లా నడిపించాలో తెలిసిన విధముగా, ఏ గొర్రెను ఏ సమయంలో ఏకాసాయికి అమ్మాలి అనే అంత విపులంగా తెలిసిన వాళ్లే ఈ కుల వ్యవస్థలను నడిపిస్తున్నారు.

మన భారత దేశంలో ఉద్యోగం, పెళ్లి, అధికారం, రాజకీయం, ఇటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కుల వ్యవస్థలపై ఆధారపడి ఉన్నాయి ఇవన్నీ అంతర్గతంగా ముడిపడిన విషయాలు వాస్తవకతను అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం ఉదాహరణగా మన దేశాన్ని పాలిస్తున్న ఏదో ఒక పార్టీ మేము కుల వ్యవస్థను నిర్మూలన చేస్తాము అనే ప్రకటన చేశారు కానీ రాజ్యాధికారమే ధ్యేయంగా పెట్టుకున్న వేరొక పార్టీ కుల వ్యవస్థను నిర్మూలన చేస్తే దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. మేము అధికారంలోకి రాని అనే కుల వ్యవస్థలను పునరుద్ధర్థన చేస్తాము అనే ప్రకటన చేస్తే చాలు సైద్ధాంతిక చర్యలు తీసుకోవాలనుకునే ముందు ప్రకటన చేసిన పార్టీ దేశంలో నిర్వీర్యం అయిపోతుంది పునార్ధారణ చేస్తానన్న పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది.
ఊహాగానాలకు ఆచరణాత్మక వ్యవహారాలకు ఎంత వ్యత్యాసం ఉందో కుల నిర్మూలన వ్యవస్థకు, కుల వ్యవస్థకు అంతే వ్యత్యాసం ఉంది. కుల నిర్మూలన అనేది ప్రజల్లో వచ్చే చైతన్యంతో తప్ప ఏ విధంగానో సాధ్యపడదు. ఇప్పటికే ఎంతోమంది చైతన్యత ప్రజలను ఉద్ధరిద్దాం అనే ఆలోచనలో కన్నుమూశారు.

చివరికి అవినీతిపరులు కూడా తమ కులానికి చెందిన వారే అని సమర్థించి కొమ్ముకాసే వారున్న ప్రస్తుత సమాజంలో ఏ దేశ నేత ఉన్న, ఏ సంఘ ఉద్ధారకుడు ఉన్న మనస్థాపానికి గురవక తప్పదు. 



Follow us in 




Advertisement