ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

డిఫెన్స్ లోకి దిగిన జనసైనికులు! తగ్గేదే లేదు అనే రీతిలో వ్యూహరచనలు!


డిఫెన్స్ లోకి దిగిన జనసైనికులు!  తగ్గేదే లేదు అనే రీతిలో వ్యూహరచనలు!
  • పవన్ కళ్యాణ్ వైజాగ్ నిర్బంధం తర్వాత
  • తమ నాయకుడికి ఎటువంటి ఆపద వస్తుందో అనే పహారా
  • నిరంకుశత్వం పేట్రేగుతున్న ఆ సమయంలో చంద్రబాబు
  • పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం పైన విమర్శలు
  • ఓపిక కోల్పోయిన జనసైనికులు
  • గురువింద గింజ సామెతను గుర్తు చేసుకుంటున్నారు
  • 20 శాతం ఓట్ల మీద చూపించే ప్రతికూల ప్రభావాన్ని
  • ఒక తరం ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ఎక్కడా చూడలేదు

పవన్ కళ్యాణ్ వైజాగ్ నిర్బంధం తర్వాత రాష్ట్రంలో అనేక నిరసనల మధ్య టిడిపి జనసేన ఒక తాటిపైకి వచ్చి తమ రాజకీయ సమరాన్ని భవిష్యత్ కార్యాచరణను ఎటువంటి అనుమానం లేకుండా ధృవీకరించారు.  ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం పైన విమర్శలు చేయటం వైఎస్ఆర్ సీపీ నాయకులు   బాహాటంగానే పవన్ కళ్యాణ్ యొక్క వివాహ జీవితం గురించి మసాజ్ చేస్తూ అతని మరింతగా కొట్టారు.


పవన్ కళ్యాణ్ అభిమానులు వైజాగ్ లో  అతను బసా చేస్తున్న హోటల్ చుట్టూ తమ నాయకుడికి ఎటువంటి ఆపద వస్తుందో అనే పహారా కాస్తూ నే ఉన్నారు పోలీసుల ఆంక్షలు విధించిన  రిమాండ్ లోకి పంపిస్తున్న  తమ నాయకుడికి  ఏమి జరుగుతుందో అనే ఆందోళనతో వారు అక్కడే నిరసనలకు దిగారు. 


పరిస్థితి చేజారిపోయాయి పార్టీ కార్యకర్తలు అణిచివేతకు గురి కాబడే ఈ సందర్భంలో అధికార నిరంకుశత్వం పేట్రేగుతున్న ఆ సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేనున్నాను అంటూ పవన్ వద్దకు చేరుకొని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచాడు.అయితే మరో వైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలయక పైన విమర్శలు సంధిస్తూ వైయస్సార్ సిపి పార్టీ శ్రేణులు వారిరువురిని టార్గెట్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పైన కూడా విమర్శలు చేయడం మొదలుపెట్టారు అందుకు దీటుగా పవన్ కళ్యాణ్ నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న కానీ అది ఇది నా వ్యక్తిగత విషయం, వారికి చట్టప్రకారం భరణం ఇచ్చి వివాహం చేసుకున్నట్టు ధ్రువీకరించడమే కాకుండా, ప్రస్తుతం వికేంద్రీకరణ మూడు రాజధానులు కాన్సెప్టుతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అది ప్రజలకు సంబంధించిన విషయం అనే విధంగా బాహాటంగానే ప్రకటించారు. 


అయిన కూడా వైయస్సార్సీపి శ్రేణులు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం పైన విమర్శలు ఆపక పోవడంతో ఓపిక కోల్పోయిన జనసైనికులు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత యొక్క పూర్వీకుల వైవాహిక జీవితాన్ని గురించి ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఆ విషయాలు నిజమేనా అనే కోణంలో చాలా మంది  అనే కోణంలో ఆరా తీయడం జరుగుతుంది కొంతమందయితే గురువింద గింజ సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో  పవన్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని అవహేళన చేసినప్పుడు ఎవరు కూడా వాటి యొక్క పూర్వాపరాలు గురించి ఆలోచించలేదు  కొందరు చూసి ఆనంద పెడితే మరికొందరు ఓ అవునా అనే ఉద్దేశం లోకి వెళ్లారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు తమ  డిఫెన్స్ లో వైఎస్ఆర్సీపీ అధినేత యొక్క పూర్వికుల బంధువుల వైవాహిక జీవితం గురించి ప్రస్తావించిన అందరూ అదే అభిప్రాయానికి వస్తున్నారు. 


అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి  మీద ఉన్న కేసులు గురించి విమర్శలకు ప్రజలు ఎలాగైతే అలవాటు పడిపోయారు, అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం మీద చేసే విమర్శలు గురించి కూడా ప్రజలు అలాగే అలవాటుపడిపోయారు, అంటే విని విని జనాలకు కూడా  రోత పుట్టింది. మరో మాటలో చెప్పాలంటే ఈ విషయాన్ని, ఈ విమర్శలను ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో, రాష్ట్రంలో అటువంటి స్థితి గాని లేదు.


జనసేన టిడిపి ఈ కలయిక అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి  యొక్క నిరంకుశత్వం వ్యవహారశైలికి  ఫలితం అనే చెప్పాలి. రాజకీయ ప్రత్యర్థులను తన వ్యక్తిగత ప్రత్యర్థులు గా పరిగణించి వారి వ్యక్తిగత విషయాల గురించి బాహాటంగా విమర్శలు చేయటం మునుపెన్నడూ లేని ఒక సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడం జరిగింది. అది ప్రజల్లో ఒక వ్యతిరేక భావాన్ని కలగచేసింది. పాలనాపరమైన వైఫల్యాలను పక్కన పెడితే వ్యక్తిగతంగా మనుషుల యొక్క మనోభావాలను దెబ్బ తీయడమే కాకుండా ప్రత్యర్థి పార్టీ నాయకుల యొక్క ధర్మ పత్నులను సైతం వదిలిపెట్టకుండా చేసే విమర్శలు అభియోగాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అన్న విషయం మరువకూడదు ఇవన్నీ ఎన్నికల్లో మిగిలిన 20 శాతం ఓట్ల మీద చూపించే ప్రతికూల ప్రభావాని కి నాంది.


ప్రజల్లో సంఘంలో ప్రస్తుతం టిడిపి పైన గాని జనసేన పైన గానే ఎటువంటి వ్యతిరేకత భావం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తరం యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి ఇటువంటి దిగజారుడు రాజకీయాలను ఎక్కడా చూడలేదు చూసి ఉండరు కూడా బహుశా ఎన్ని తరాలు చూసినా ఇటువంటి దిగజారుడు రాజకీయాలు ఎన్నడు చూసి ఉండరు. వైఎస్ఆర్సిపి వాళ్ళు ప్రత్యర్ధి పార్టీల కుటుంబాల పైన ఎన్ని అబాండాలు వేసిన ఎన్ని అభియోగాలు చేసిన వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావన తెచ్చిన టిడిపి అధ్యక్షుడిగాని అతని కుమారుడు కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యుల పైన ఇప్పటివరకు బాహాటంగా ప్రజలకు తెలిసే విధంగా కానీ అసలు ఏ విధంగా అయినా కానీ విమర్శలు చేయలేదు వారి కుటుంబ సభ్యులు యొక్క వ్యక్తిత్వం గురించి వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. బహుశా టిడిపి జనసేన విచక్షణతో వ్యవహరిస్తున్నాయి అనే చెప్పాలి.In Association with 
 News9 

Follow us in 
Advertisement