ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

కష్టాల సేద్యంతో రైతులు !




కష్టాల సేద్యంతో అల్పాదాయాలతో మెజారిటీ రైతులు :


కష్టాల సేద్యంతో అల్పాదాయాలతో మెజారిటీ రైతులు ఏటికేడు రుణ ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉంటున్నా క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా ఎదురవుతున్న సమస్యల నుంచి రైతులు బయటపడలేకపోతుండటం శోచనీయం. ఏటా విత్తనాల అందుబాటు సహా మార్కెటింగ్ సమస్యలు రైతుల్ని వెంటాడుతున్నాయి. నికరాదాయం తగ్గి అప్పుల పాలై ఒక్క పూట తిండికీ నోచుకోలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడటంతో పలు పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారుతోంది. పంటల బీమా ఇందుకు ప్రధాన ఉదాహరణ. తాజాగా ఆహారభద్రత మిషన్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎం) కూడా నిధుల కొరతతో సతమతమవుతోంది. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసే లక్ష్యాన్ని అందుకోవాల్సిన తరుణంలో ఇటువంటి పథకాలకు నిధుల కోత పడటం అత్యంత దురదృష్టం. ప్రభుత్వాల ప్రాథమ్యాలు మారుతున్నప్పుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లోపించినప్పుడు నిధుల విడుదల నిలిపి వేస్తుండటం రైతులకు శాపంగా మారుతోంది. మెరుగైన సాగు విధానాలతో రైతుల ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తెచ్చే దిశగా ఇలా తప్పటడుగులు పడుతుండటం దురదృష్టం. సరిపడ కేటాయింపులు లేకపోవడంతో జాతీయ ఆహార భద్రత మిషన్ లక్ష్యాలు గాడితప్పే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా 60, 40 శాతం చొప్పున నిధులను సమకూర్చే ఈ పథకాన్ని ఐదేళ్లుగా అమలు చేస్తున్నారు. పంటల ఉత్పాదకతను పెంపొందించేందుకు అధిక దిగుబడినిచ్చే వంగడాలను అందించడం సాగ పోషక యాజమాన్యం చేపట్టడం, యంత్రాలు, పనిముట్ల పంపిణీ, భూసార పరిరక్షణ చర్యలకు తోడు మొక్కల సంరక్షణ చేపట్టాలి. ఆహారశుద్ధి యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించే అంశాల పట్ల రైతులకు శిక్షణ ఇవ్వడం.. మొత్తంగా పంత కోత అనంతర సాంకేతికతను అందించటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం సేద్యంలో వస్తున్న సరికొత్త మార్పులను పంట పొలాలకు చేరవేసే దిశగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) ఆధ్వర్యంలో రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, కృషి అందించాల్సి ఉంటుంది. హరిత విప్లవం తర్వాత ఆహారోత్పత్తుల్ని సాధించింది. కానీ ప్రజల కొనుగోలు శక్తిని పెంచలేకపోయాం. ఫలితంగా పౌష్టికాహార లోపాలు కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్యుల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపర్చడం ద్వారా ఆహార భద్రతను సాధించాలంటే పంట - ఉత్పత్తులు రెట్టింపయ్యే విధానాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాల్సి ఉంది. దీనికి భిన్నంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల తీరు విమర్శనాత్మకంగా ఉంది. ఏటా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నా వాస్తవానికి పైసా ప్రయోజనం కూడా రైతులకు దక్కడం లేదన్నది వాస్తవం.


కేంద్రం విడుదల చేస్తే రాష్ట్రం నిధులకు కోత పెడుతుండటం, రాష్ట్ర వాటా విడుదలైతే కేంద్రం నిధులు తగ్గించడం వంటి పిల్లి-ఎలుక చెలగాటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేటాయింపులు చేసిన స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదన్నది కేంద్రంపై ఆరోపణ. తమ వాటా సొమ్ము విడుదల చేయడం, వాటిని ఖర్చు పెట్టడంలో పలు రాష్ట్రాలు పదే పదే విఫలమవుతున్నాయని కేంద్ర ఆరోపిస్తోంది. ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఆరోపించుకోవడం అంతిమంగా రైతు ప్రయోజనాలను బలిపెట్టడమే. వీటికితోడు ఆహార భద్రత మిషన్ ఉత్పత్తి, పంపిణీ కంటే ఉత్పత్తి సాధనకు - అనుసరించాల్సిన విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. అందుకు సబ్సిడీలు భారమవుతున్నాయని భావించి నిధులకు కోత పెడితే మునుముందు ఆహారం కోసం దిగుమతులపై ఆధారపడే పరిస్థితి దాపురించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని , ఉత్పత్తి- పంపిణీ ఆహారశుద్ధి మార్కెటింగ్పై శ్రద్ధ పెట్టడం 5 ద్వారా రైతులు స్థిరమైన ఆదాయాలు పొందేలా సంస్కరణలు | ఇ తేవాలి. దేశంలో సరైన పోషకాహారం లేక తల్లడిల్లుతున్న వారికి పట్టెడన్నం పెట్టడం ముఖ్యమే. అదే సమయంలో ఆ తిండిగింజల్ని పండించే రైతుల్ని పస్తులుంచలేమని పాలకులు గ్రహించాలి. ఆహార భద్ర మిషన్ అందుకోవాలంటే తగిన నిధులు అందించడం ద్వారా పథకాల లక్ష్యాలను అమలు, రైతు శ్రేయంపై చిత్తశుద్ధిని చూపడం పాలకుల బాధ్యత.



In Association with 
 News9 

Follow us in 




Advertisement