ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ మీ డబ్బును భద్రపరచదు! మోసాలను అరికట్టాల్సింది మీరే?




అవును ఇది పూర్తిగా నిజం. మీరు మీ డబ్బును కాపాడుకోవాలి. మీరు సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ లేదా సివిల్ పోలీసులు ఏమీ చేయలేరు. మీరు కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ. ఇది వ్యవస్థను విమర్శించడం కాదు, ప్రాక్టికాలిటీకి సంబంధించిన వాస్తవ విషయాలను బహిర్గతం చేయడం.

సాధారణంగా సాధారణ నేరంలో నిందితుడి భౌతిక ఉనికి ఉంటుంది. అయితే  సైబర్ క్రైమ్ మోసం విషయానికి వస్తే, విషయం భిన్నంగా ఉంటుంది. వ్యక్తి తెర వెనుక పని చేస్తాడు. ఉదాహరణకు ఒక సైబర్ క్రైమ్ నేరస్థుడు మీ బ్యాంక్ ఖాతా నుండి రూ.10,000/- దొంగిలించబడినట్లయితే, ఆ నేరస్థుడు ఢిల్లీ, డెహరాడూన్‌లోని ఏదైనా రహస్య ప్రాంతంలో నివసిస్తుంటే. దర్యాప్తు బృందం, దర్యాప్తు చేయటానికి  ఖర్చు ఎంత? ఒకవేళ నిందితుడు USA, UK వంటి విదేశాలలో నివసిస్తుంటే.

నేరం భారీ మొత్తంలో ఉంటె తప్ప ఆచరణాత్మకంగా ఎటువంటి అవకాశాలు లేవు. 

ప్రస్తుతం నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆఫ్ ఇండియా వద్ద ఉన్న సమాచారం ప్రకారం సైబర్ క్రైమ్ నేరాలు 2019 నుంచి 11.8% పెరిగాయి 2019లో 44735 కేసులు నమోదు అయితే, 2020 నాటికి ఆ కేసులు 50 వేల 35 కేసులుగా పెరిగిపోయినాయ.

సైబర్ క్రైమ్ అంటే ఇంటలెక్చువల్ క్రైమ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో, చాలావరకు సైబర్ క్రైమ్ నేరస్తులు సరైన విధానంలో శిక్షణ పొంది ఒక ప్రణాళిక ప్రకారం చట్టంలో ఉన్న వెసులుబాటులను డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఎక్కడి నుంచి క్రైమ్ చేస్తే ఎవరిని టార్గెట్ చేస్తే పోలీసు వారు తమ వరకు రాలేరు అనే విషయన్ని  చూసుకొని మరి ఫైనాన్షియల్ ఫ్రౌడ్స్ చేస్తున్నారు.

వాస్తవానికి టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ క్రైమ్ నేరగాళ్లు చాలా లబ్ది పొందుతున్నారని చెప్పాలి. భారతదేశంలో జరిగే సైబర్ క్రైమ్ అన్నిటి లోను సైబర్ క్రైమ్ నేరస్తుడు డిజిటల్ మీడియా లో ఎడ్వర్టైజింగ్ కోర్సుని క్షుణ్ణంగా చదవడం దాన్ని నేర్చుకోవడం దాని ద్వారా సైబర్ క్రైమ్ బాధితులకు ఎరవేయటం చేస్తున్నారు.

ఆన్లైన్ జాబ్స్

ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్లు యొక్క పెట్టుబడి కేవలం ఎదుట వ్యక్తి యొక్క అత్యాశ మాత్రమే. వీళ్ళ టార్గెట్ నిరుద్యోగ యువత ఆన్లైన్ జాబ్స్ చేయాలనే యువత లేదా గృహనిలు లేదా గృహస్తులు వ్యాపారస్తులు.

మూవీ రూల్స్ లాంటి అతిపెద్ద పైరసీ సంస్థలను భారతదేశంలో సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకంటే ఈ మూవీ రూల్స్ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అటువంటి మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్ల వ్యవస్థాపకులను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు కట్టడి చేయలేకపోయింది. ఈ మూవీ రూల్స్ బాధితులు అందరూ ప్రొడ్యూసర్లు పెద్దపెద్ద ప్రొడ్యూసర్లు స్టార్ హీరోలు సినిమా ఇండస్ట్రీ వీరు తలుచుకుంటే కావాల్సిన ఆర్థిక వనరులు డిపార్ట్మెంట్ కి సమకూర్చి ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు కానీ మహా మహుల వలన ఈ పని కాలేదు. ఒక్కసారి ఆలోచించండి సామాన్య మధ్యతరగతి వారు ఇటువంటి సైబర్ నేరం భారిన పడితే తమ డబ్బు తమకు ఎప్పుడు రావాలి అసలు వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.

కొన్ని సంస్థలు యువతకు ఆన్లైన్ జాబ్స్ ఇప్పిస్తామని లేదా డేటా ఎంట్రీ జాబ్స్ తాము ప్రొవైడ్ చేస్తామని దానికి వారు వారితో అగ్రిమెంట్ మీద సంతకం చేసి వారు చెప్పిన లేదా పంపించిన డేటా షీట్లను ఫిల్ చేసి వారికి తిరిగి పంపించవలసిందిగా చెప్పి ముందు వలలో వేసుకుంటున్నారు. ఆ తరువాత డేటా ఎంట్రీ లో ఎవరికైనా తప్పులు దొల్లటం అనేది సహజం, అదేవిధంగా కొత్తగా డేటా ఎంట్రీ చేసే వారికి ఎంట్రీ సీట్లలో తప్పులు రావడం అనేది చాలా సహజమైన విషయం. ఈ విషయం సైబర్ నేరగాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. ఒక నెల రోజులు పని పూర్తికాగానే మీరు మాకు ఇచ్చిన డేటా షీట్ లో తప్పులు ఉన్నాయని అలాగే మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో ఏ విధమైన పొరపాట్లు మీరు చేసిన సంస్థకు మీరు నష్టపరిహారం కడతానని ఒప్పుకొని యున్నారని అందుకుగాను మీ మీద మేము కేసు దాఖలు చేశామని కోర్టు వారు మీకు వ్యతిరేకంగా డిక్రీ ఉన్నారని మీరు వెంటనే ఆ డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని బెదిరింపులకు పాల్పడతారు. సహజంగా చట్టం పైన అవగాహన లేని నిరుద్యోగ యువత ఇటువంటి బెదిరింపులకు భయపడి వారు అడిగిన డబ్బులు కట్టివేస్తుంటారు చాలామంది ఇలాగా బాధితుల్లాగా మిగిలిపోయారు మరి కొంతమంది న్యాయ నిపుణుల సలహా తీసుకొని వారి బారి నుంచి బయట పడతా ఉంటారు.

ఇటువంటి జాబులు విషయంలో నిరుద్యోగ యువత ఒకటికి రెండుసార్లు రెండుసార్లు అసలు తమకు జాబ్ ఆఫర్ చేసిన కంపెనీ రిజిస్టర్ కంపెనీ నా కాదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అలాగే అసలు తమ పైన ఇటువంటి కేసులు దాఖలు చేసే వెసులుబాటు ఉందా లేదా అనే విషయాన్ని న్యాయ నిపుణులను సంప్రదించి తెలుసుకోవాలి.

ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో కొత్త పద్ధతి

ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లో మరో కొత్త పద్ధతిని సైబర్ క్రైమ్ ని నేరగాళ్లు ఎన్నుకున్నారు అది ఏమిటంటే ఫోన్ నెంబర్ల ద్వారా బాధితుల్ని వీరు కమ్యూనికేట్ అవుతారు వారికి తాము ఒక రిజిస్టర్ కంపెనీ నుంచి ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నామని వారితో చాటింగ్ చేసి లేదా మాటలు కలిపి సదర్ కంపెనీ ద్వారా తాము వ్యాపార అవకాశాలు చూపిస్తామని కేవలం వారు పంపించిన లింకుల్లో రిజిస్టర్ కావాల్సిందిగా బాధితుల్ని కోరతారు. అలా రిజిస్టర్ అయిన లింకులు మనదేశంలో రిజిస్టర్ కాబడి ఉండవు అయితే చైనాలో కానీ లేకపోతే మరొక దేశం లో కానీ రిజిస్టర్ కాబడి ఉంటాయి. 

రిజిస్టర్ అయిన తర్వాత బాధితుడికి టాస్కులు రూపంలో కొన్ని పనులు అప్పచెబుతారు అవేంటంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద సంస్థలను పోలియోన్న వెబ్సైట్ లింకులను బాధితుడికి పంపించి లేదా అందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి మీద మీరు పెట్టుబడి పెడితే ఆ ప్రోడక్ట్ అమ్ముడుపోయిన తర్వాత మీకు 20% కమిషన్ వస్తుంది అని మబ్బులోకి దించుతారు. మొదట జరిగే చిన్న చిన్న ట్రాన్సాక్షన్లకి డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత జరిగే లావాదేవీలకి ఎటువంటి డబ్బులు చెల్లించారు కనీసం వారు మీతో ఫోన్లో మాట్లాడటానికి కూడా తమకు తీరిక లేదని మీకు చాటింగ్ ద్వారా తెలియజేస్తారు. సదరు సైబర్ క్రైమ్ క్రిమినల్ యొక్క వివరాలు మీరు కనుక్కునే ప్రయత్నం చేసిన వారి పేరు మీద అసలును పోలిన నకిలీ పేర్లతో జీఎస్టీలు రిజిస్ట్రేషన్ కాబడి ఉంటాయి. వారంతా డిజిటల్ మీడియా సెక్టార్ సెక్టార్ లో ప్రావీణ్యులై ఉంటారు అందుకనే వారికి మనుషుల యొక్క పూర్తి మానసిక స్థితి పైన అవగాహన ఉంటుంది. రూపాయి పెడితే 20% లాభం వస్తుందని చాలామంది కక్కుర్తి పడి తమ డబ్బులు పోగొట్టుకొని ఉన్నారు.

ఇది భారతదేశంలో జరిగే ఒక రకమైన ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇంకా నైజీరియా అమెరికా లండన్ ఇటువంటి దేశాల నుంచి చాలామంది సైబర్ నేరగాళ్లు ఈ రకమైన నేరాలనే జీవన వృత్తిగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు. 

ప్రస్తుతం భారతదేశంలో మహిళల పైన జరిగే సైబర్ క్రైమ్స్ ని నివారించడంలో కూడా అతికొద్ది నైపుణ్యత మాత్రమే ఉన్నది. టెక్నాలజీ అనేది పూర్తిగా పెరిగింది కానీ, ఆ టెక్నాలజీ ద్వారా జరిగే అనార్థాలను నివారించడానికి కనీసం భారతదేశ ప్రభుత్వం వద్ద సరైన సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బంది కానీ సాంకేతిక పరమైన అభివృద్ధి గాని లేదు. భారతదేశంలో లభ్యం అయ్యే చాలా మొబైల్ అప్లికేషన్స్ తమ హెచ్చరికగా తమ సాఫ్ట్వేర్లు సురక్షితం అని ఎక్కడా కూడా తెలియపరచడం లేదు. కానీ, అవి మాత్రం మార్కెట్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి.

చాలామంది అత్యుత్సాహాలు స్పై సాఫ్ట్వేర్లని తమ మొబైల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆ సాఫ్ట్వేర్లు పూర్తి కంట్రోల్ ఆ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసిన ఎడ్మిన్ దగ్గర ఉంటుంది. అంటే ఒక స్పై కెమెరా సాఫ్ట్వేర్ ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఆ సాఫ్ట్ వేరు మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ మీ ఇంట్లో లేదా మీ యొక్క బెడ్ రూమ్ లో మీ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినప్పుడు అవసరమైతే ఆ సాఫ్ట్వేర్ ని గా రిమోట్ గా  ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన వ్యక్తి లేక సంస్థలు ఆపరేట్ చేయొచ్చు, అందుకు మీరు ఆ సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేసే సమయంలోనే ఆ సంస్థకు కాని ఆ వ్యక్తికి కానీ పూర్తి అనుమతులు ఇచ్చి ఉంటారు. అంటే ఒకవేళ మీరు కానీ మీ ఫోన్ ని ఏమరపాటుగా వదిలేస్తే మీ పర్సనల్ లేదా మీ ఇంట్లో ఉన్న ఆడవారి పర్సనల్ వీడియోస్ ని మీకు తెలియకుండానే చిత్రీకరించవచ్చు లేదా ఫోటోలు కూడా తీసుకోవచ్చు. వాటిని అంతర్జాలంలో వారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. మన ఫోను మనకు తెలియకుండానే మనం మాట్లాడే ప్రతి సమాచారాన్ని సేకరిస్తుంది, దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అని కూడా అంటారు.

ప్రస్తుతం భారతదేశాన్ని ఒకటే కాదు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఈ సమస్య అనేది విస్తృతంగా ఉంది. కేవలం భారత దేశంలో మాత్రమే సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ ని ని రాజకీయ సమస్య వస్తే తప్ప ఏ విధంగానో ఉపయోగించుకోవడం లేదు వారికి తగినంత నిధులు కూడా సమకూర్చడం లేదు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఆ ఖర్చు బాధితుడు పెట్టాలా ప్రభుత్వం పెట్టాలా అనేది వేరొక సమస్య. కానీ ఆర్థిక లావాదేవీలలో మోసపోయిన ఏ ఒక్కరికి కూడాను సమయానికి డబ్బు రికవరీ అవ్వదు, అవుతుందో లేదో అనే విషయం కూడా ప్రశ్నార్ధకమే?

అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. కష్టపడకుండా రూపాయి అనేది రానే రాదు, ఆశ అనేది కంట్రోల్ లో ఉంటే చాలా మంచిది. మీ యొక్క అత్యాశ అనే మానసిక వైకల్యం సైబర్ నేరగాళ్ళకి పెట్టుబడి. సైబర్ నేరగాళ్ల వలలో మీరు పడినట్లు అయితే కేవలం మీ తప్పితమే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సాంకేతిక నైపుణ్యత రిత్యా సైబర్ నేరం ఎక్కడ జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ సైబర్ నేరగాళ్లను చట్టపరిధిలోకి తీసుకురావటమే కష్ట సాధ్యం.




In Association with 
 News9 

Follow us in 





Advertisement