ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

వేరే దేశంలో జరిగిన నష్టానికి భారత దేశంలో కన్జ్యూమర్ కోర్టులో నష్టపరిహారం కోరవచ్చా?

వేరే దేశంలో జరిగిన నష్టానికి భారత దేశంలో కన్జ్యూమర్ కోర్టులో నష్టపరిహారం కోరవచ్చా?

నరేంద్ర పాల్ సింగ్ అనే వ్యక్తి ఫిలిపెన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ ,  బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS) అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2007 నుంచి 2008 సంవత్సరకాలంలో ఎమిలియో ఎగువయ్య ఆగినల్డి ద్వారా అడ్మిషన్ పొంది ఉన్నాడు. హెచ్ సి ఎం ఐ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఫీజు కూడా కట్టివేసి ఉన్నాడు. హెచ్ సి ఎం ఐ ఎడ్యుకేషన్ సంస్థ వారు కాలేజ్ తరపునే కాదు గవర్నమెంట్ తరుపున కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ని ఇస్తున్నామని ఒక బ్రోచర్ని పాల్ సింగ్ ఇచ్చి ఉన్నారు. పాల్ సింగ్ కాలేజ్ నుంచి ఆఫర్ లెటర్ తీసుకొని 2007-2008 సంవత్సరంలో కాలేజీలో జాయిన్ అయినాడు. కానీ రిపబ్లిక్ ఆఫ్ ఫిలిపెన్స్ ఒక తీర్మానాన్ని పాస్ చేసింది, అదేమిటంటే 2007 నుంచి 2008 లోపల జరిగే మెడికల్ కాలేజీలో అడ్మిషన్ ప్రోగ్రాములు ఓవర్సీస్ అడ్మిషన్ ప్రోగ్రాములు నిలిపివేస్తూ తీర్మానం చేసింది.

అందుచేత పాల్ సింగ్ యొక్క విద్య మధ్యలోనే ఆగిపోయి తిరిగి భారతదేశం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం పైన పాల్ సింగ్ హెచ్ సి ఎం ఐ ఎడ్యుకేషన్ సంస్థకు వ్యతిరేకంగా కన్జ్యూమర్ కమిషన్  వద్ద ఫిర్యాదు చేశాడు. సదరు వ్యాజ్యంలో హెచ్ సి ఎం ఐ ఎడ్యుకేషన్ సంస్థ తమ వాదన దాఖలు చేయునందు మూలాన కోర్టు ఎదుట హాజరుకానందు మూలాన కోర్టు వారు వారికి వ్యతిరేకంగా తీర్పునిచ్చి ఉన్నారు. సదరు తీర్పు పైన హెచ్ సి ఎం ఐ ఎడ్యుకేషన్ సంస్థ భారత దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని  ఆశ్రయించగా వారు గవర్నమెంట్ ఆఫ్ ఫిలిపెన్స్ తీసుకున్న నిర్ణయానిక హెచ్ సి ఎం ఐ విద్యాసంస్థలకు సంబంధం లేదని అలాగే నేషనల్ కమిషన్ కన్జ్యూమర్ ఫారం తీర్పుని కొట్టి వేసినారు.

వేరొక దేశము యొక్క ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతదేశంలో నష్టపరిహారం ఇవ్వటం కుదరదనేది దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పేసింది.

In Association with 
 News9 

Follow us in 




Advertisement