ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

స్వపక్షం లో విపక్షం

క్విక్ ఆంధ్ర :- స్వపక్షం లో విపక్షం భరించలేని బాధ, విధి విధించిన శిక్ష, అహం  రేపిన కారు చిచ్చు.  

వల్లభనేని వంశీ : తెలుగు దేశం  వీరాభిమాని, పరిటాల శిష్యరికం, మంచి స్నేహ బాంధవ్యాలు, వెన్నుముక్క లేని చెయ్యగా గన్నవరం లో తిరుగులేని రాజకీయ శక్తి గా ఎదిగిన యువ నాయకుడు. తెలుగు దేశం లో చింతమనేనిది ఒక స్టైల్ అయితే వల్లభనేని వంశిది ఒక స్టైల్ . ఇద్దరు క్రేజ్ ఉన్న నాయకులె. కానీ వల్లభనేని వంశి ఒక్కసారిగా యు టర్న్ తీసుకున్నాడు అందుకు అతను చెప్పే ముఖ్యమైన కారణాలు 1. తనను అప్రతిష్ట పాలు చెయ్యటం 2. పార్టీ లో సరైన గుర్తింపు దొరకకపోవటం (దేవినేని ఉమా  వగైరా కారణాలు ) 3. పార్టీ అధినేత తో తనకు ఫ్రీ యాక్సెస్ లేకపోవటం.

కొన్నాళ్ళు  తెలుగు దేశం పార్టీ కి పక్కలో బల్లెం లాగా  ఎవరికి నిద్ర పట్టించలేదు. అసలే ఓటమి, అవమాన భారం, పార్టీ లో అంతర్గత కలహాలు,  పట్టరాని విమర్శలు, అవహేళనలు ఇవి గమనించే ప్రజలకు మాత్రం ఒక దశలో రాజకీయం అంటే చీదర పుట్టే దశకు రాజకీయాలు రాష్ట్రం దిగాజరిపోయవి.

రఘు రామకృష్ణరాజు :  పుత్రుని అఘయత్యాలు చూడలేక కళ్ళులేని దృతరాష్ట్రుడు ఏమి తప్పు చేసాడో తెలియదు కానీ, కంటి కి కనపడే విషయాలలో జోక్యం చేసుకోలేని వై ఎస్ ఆర్ పార్టీ అధినేత   మాత్రం  రఘు రామకృష్ణ కు పైన  జరిగిన  అధికారుల, అనాధికారిక  భౌతిక దాడిని ఆపలేకపోయాడు. అసలు రఘురామా కృష్ణరాజు కి పార్టీ లో ఎవరితో అంతర్గత విభేదం ఉన్నది అనే విషయం ఇప్పటికి చాల మంది రాష్ట్ర ప్రజలకు  ప్రశ్నార్ధకమే?

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ వదిలిన బాణం   వల్లభనేని వంశీ అయితే  టి డి పి  వదిలిన బాణం  రఘు రామకృష్ణరాజు అనే చెప్పాలి. కాకపోతే  రఘు రామకృష్ణరాజు అసలు ఎక్కడ తగ్గేదేలే అనే కోణం లో ఏ మీడియా సపోర్ట్ లేకుండా తనంతట తనే సోషల్ మీడియాను  ఒక అస్త్రం లాగా చేసుకొని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కి పక్కలో బల్లెం  లాగా  ఎవరిని నిధ్రపోనివ్వటం లేదు.

151 సీట్లు ఉన్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ స్వపక్షములో విపక్షములాగా   వల్లభనేని వంశీ  లో ఉన్నా వ్యతిరేకతను ఏ విధముగా నైతే రాజకీయముగా ఉపయోగించుకొని తెలుగు దేశం పార్టీ నేతలను మానసికముగా క్రుంగ తియ్యటానికి ప్రయత్నం చేసిందో ఇంచుమించు రఘు రామకృష్ణ రాజుని కూడా అదే విధముగా  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ లో ...............

In Association with 
 News9 

Follow us in 




Share in Whatsapp

Advertisement