ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

" సిగ్గుతో చచ్చిపోతున్నాము " రాజధాని కోసం ఆమె కష్టం - బయో టాయిలెట్లు తీసేసారు - మహిళల పరిస్థితి ....?అసలే మహిళలు, ఆ పైన పోరాటం, న్యాయ పోరాటం, ధర్మ పోరాటం, న్యాయస్థానం టు దేవస్థానం, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వద్ద అనుమతి తీసుకోని మరి పోరాటం. ప్రస్తుతం రాజధాని మహిళా రైతు తన బాధ ను బోరున విలపిస్తుంది.
మేము మహిళలము, పది మందికి అన్నం పెట్టిన చెయ్య ప్రస్తుతం నడి రోడ్డు మీద అన్నం తినే పరిస్థితి తెచ్చారు మాకు అప్పటికి తట్టుకున్నాము కానీ బయో టాయిలెట్లును కూడా పికిస్తే ఎలాగా? అని  రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్న ఒక  మహిళా  స్వాతంత్ర భారత దేశం లో నడి రోడ్ మీద రోదిస్తుంది. భుదేవంత సహనం ఉన్న మహిళా ఒక్కసారిగా సహనం కొలిపోయి పాలకుల ను ప్రశ్నించింది. మహిళలు పాదయాత్ర చెయ్యటం అంటే అంత సులువైన విషయం కాదు, వారు తమ శక్తికి మించి శ్రమిస్తున్నారు కేవలం రాజధాని కోసం.  వారి పాదయాత్రను స్వాగతించకపోయిన, వారి పోరాటాన్ని పరిగణలోకి తీసుకోకపోయిన , కనీసం మహిళకు కనీస మర్యాద ఇస్తే బాగుండును అనే అభిప్రాయాలు లేకపోలేదు. ప్రకృతి సహజసిద్దముగా మహిళలకు కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని కూడా కనీసం పరిగణంలోకి తీసుకోకుండా బయో టాయిలెట్స్ ను తీసి పదవేయ్యటం వలన తము సిగ్గుతో చస్తున్నాం అని ఆమె బాధను చెప్పుకుంటుంది.

అమరావతి జే ఏ సి వారు  మహిళల గౌరవార్దం మరియు సౌకర్యార్ధం రైతుల పాదయాత్ర లో బయో టాయిలెట్స్ ఏర్పాటు చేసారు, కానీ వాటిని వారికీ అందుబాటులో లేకుండా పికించి పడేసారు. ఒక మహిళగా ఆమె ఆమె బాధను ఈ విధముగా ప్రజలకు అర్ధమయ్యే విధముగా చెపుతుంది.    
ఆమె బాధ ఈ వీడియో లో 

In Association with 
 News9 

Follow us in