ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

" కమ్యూనిజం" - సాంప్రదాయ ఆలోచనతో " ఆచార్య "..?

మెగాస్టార్ చిరంజీవి ,  రామ్ చరణ్  ఒకే స్క్రీన్ షేర్ చేసుకుంటు, పవర్ఫుల్ సిన్స్ ఎలివేట్ చేస్తు ఆచార్య సినిమా ట్రైలర్ ను రెండు భాగాలుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. 

ట్రైలర్ లోనే కథ కాన్సెప్ట్ అర్ధమయ్యే విధముగా ,  ఏదో సమస్య పైన పోరాడుతున్న యోధుడిగా రామచరణ్ మరియు చిరంజీవి ని ఎలివేట్ చేసారు.  ట్రైలర్ లో సిన్స్ గమనిస్తే ఇంచు మించుగా సంఘ విద్రోహ  శక్తులతో కధనాయకులిద్దరు పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది. త్రిశూలం దగ్గర వచ్చిన సిన్ మాత్రం ప్రేక్షకులకు గుస్ బంప్స్ వచ్చే విధముగా ఉంది, కానీ దిన్ని సరిగ్గా గమనిస్తే కమ్యూనిస్ట్ పార్టీ లో ఒక పార్టీ గుర్తుగా కనిపిస్తుంది. 

ట్రైలర్ ని బట్టి ఇది అడివి ప్రాంతం లో జరిగే కథ నేపధ్యంగా కనిపిస్తుంది, అక్కడ జరిగే సమస్య పైన ఇరువురు కథానాయకులు పోరాటం చేస్తునట్టు తెలుస్తుంది. 
" ఇతరుల కోసం జీవించే వారు దైవం తో సమానం అలాంటి వారి జివితలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడవలసిన పని లేదు  " అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఎర్ర కండువ తో చిరంజీవి చెయ్య పైకి లేపటం దగ్గర ననుంచి గమనిస్తే స్టొరీ విప్లవాత్మకమైన కంటెంట్ కలిగి ఉంటుంది అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. స్క్రీన్ ప్లే సరిగ్గా ఉంటె ప్రేక్షకులకు ఇది మాత్రం ఒక  నూతన అనుభూతినిస్తుంది. ఎందుకంటె ఇటువంటి సినిమాలు ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేస్తాయి, అది కథ మీద కూడా ఆధారపడి ఉంటుంది, కథ విషయంలో కొరటాల మీద ఎలాగో ప్రేక్షకులకు నమ్మకము ఉంటుంది, కానీ ప్రస్తుత సమాజానికి దూరముగా ఉహ ప్రపంచంలో కథ ను చిత్రీకరిస్తే ప్రేక్షకుల స్పందన ఎలాగా ఉంటుంది అనేది కొంచెం ఆలోచించవలసిన విషయం.

రెండు ట్రైలర్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రెండ్ లో నే ఉన్నాయి, రిలీజ్ చేసిన పాటలు కూడా ప్రేక్షక ఆదరణ పొందిన విషయం తెలిసిందే , మ్యూజిక్ విషయం లో ఎటువంటి నెగటివ్ ఆలోచన అక్కరలేదు. కంటెంట్ మరియు టేకింగ్ బాగా ఉంటె ఖచ్చితముగా ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు . కంటెంట్ ఎలాగా ఉంది అనేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేము.


In Association with 
 News9 

Follow us in