ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మెక్సికోలో 95,000 మందికి పైగా అదృశ్యం
గత శుక్రవారం నాటికి, మెక్సికోలో 95,000 మందికి పైగా అదృశ్యమైనట్లు అధికారికంగా నమోదు కాబడింది. అందులో మహిళలు మరియు పిల్లల సంఖ్యలో అధికమైన పెరుగుదల ఉంది, మహమ్మారి సమయంలో ఈ సంఘటనలు మరింత దారుణముగా ఉన్నాయి, ముఖ్యంగా వలసదారులు  ప్రమాదంలో ఉన్నారు.

నవంబర్ 15 తారిఖు నుంచి  26 మధ్య జరిగిన  సందర్శనలో , బలవంతపు అదృశ్యాలపై UN కమిటీ సేకరించిన వివరాల ప్రకారం, వారు చేపట్టిన నిజనిర్ధారణలో మిషన్ లో  100 కంటే ఎక్కువ అదృశ్యాలు జరిగాయని తెలియచేసింది. ఒక ప్రకటనలో, కమిటీ మెక్సికన్ అధికారులను తప్పిపోయిన వారిని త్వరగా గుర్తించాలని, మరణించిన వారిని గుర్తించాలని మరియు అన్ని కేసులను దర్యాప్తు చేయడానికి సత్వర చర్య తీసుకోవాలని కోరింది.

యు యెన్  ప్రతినిధి బృందం 13 మెక్సికన్ రాష్ట్రాలకు వెళ్లి 80 కంటే ఎక్కువ వివిధ అధికారులతో 48 సమావేశాలు నిర్వహించింది. సభ్యులు దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతం నుండి వందలాది మంది బాధితులను  మరియు పౌర సమాజ సంస్థలను కూడా కలుసుకొని జరిగిన సంఘటనల పైన సమాచారం సేకరించారు. వారు మోరెలోస్, కోహూయిలా మరియు మెక్సికో రాష్ట్రంలో త్రవ్వకాలు మరియు శోధన యాత్రలను చూశారు, కోహుయిలాలోని మానవ గుర్తింపు కేంద్రాన్ని (Human Identification Centre) సందర్శించారు మరియు అనేక సమాఖ్య, రాష్ట్ర మరియు వలస నిర్బంధ కేంద్రాలకు వెళ్లి వివరాలు సేకరించారు.

కమిటీ 10 మంది స్వతంత్ర నిపుణులతో రూపొందించబడింది. పర్యటనలో నలుగురు సభ్యులు పాల్గొన్నారు. 2022 మార్చి 28 మరియు ఏప్రిల్ 8 మధ్య జెనీవాలో జరిగే 22వ సెషన్‌లో కమిటీ ప్లీనరీలో తుది నివేదిక చర్చించబడుతుంది మరియు ఆమోదించబడుతుంది.

In Association with 
 News9 

Follow us in