ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

మెగా ఫ్యామిలీ ను ఆర్ జి వి ఎందుకు టార్గెట్ చేసాడు ?



రామ్ గోపాల్ వర్మ మీడియా మేనేజ్మెంట్ లో దిట్ట, అంతకు తగ్గ స్కిల్, తక్కువ మొత్తం లో సినిమా తీసి పెట్టుబడికి సరిపడ లాభాలు అర్జించాగల మేధావి, మీడియా  మేనేజ్మెంట్ తెలిసిన  వ్యక్తీ. కరెక్ట్ గా సినిమాకి ముందు ఒక కాంట్రావేర్సి తో ఎంట్రీ ఇచ్చి , యాడ్ ఏజెన్సీకి ఇవ్వవలిసిన రెవిన్యూ ను డిబేట్ కి ఖర్చు చేస్తే సినిమా తో పాటు తనకి పబ్లిసిటీ ఉంటుంది అనే ప్రణాళిక రచించి సినిమా ఇండస్ట్రీ లోనే తనకంటు ఒక క్రేజ్ని  సంపాదించుకున్న డైరెక్టర్. శివ సినిమా తో  ఒక మెరుపు మెరిపించిన ఆర్ జి వి కి పైన కి కనిపించే శత్రువులు కన్నా లోపాయకారిగా సహకరించే మిత్రులే ఎక్కువ అని చెప్పాలి.  మెట్ట వేదాంతం చెప్పిన నోర్లు అప్పగించుకొనే తనేమి చెపుతున్నాడు అనే విషయాన్ని తిక్షణముగా వీక్షిస్తున్న ప్రేక్షకులకి, తన వేదాంతానికి ఎదురు ప్రశ్నలు వేసే మీడియా ప్రతినిధులు అన్న ఆర్ జి వి కి చిరాకు.  

మొత్తానికి ఆర్ జి వి మార్కెట్ ను తిక్షణముగా పరిశీలించి ఏ సబ్జెక్టు మీద సినిమా చేస్తే తన ప్రోడక్ట్ కి మినిమం మార్కెట్ ఉంటుందో అదే సబ్జెక్టు పైన అర్ధరహితమైన కధ తో ప్రేక్షకులు ఒక్క సరైన  తన సినిమా చూసే విధముగా జాగ్రత్తలు తీసుకుంటాడు.

కానీ మెగా ఫ్యామిలీ పైన దృష్తి పెట్టవలిసిన అవసరం ఆర్ జి వి కి ఎందుకు వచ్చింది అనే అంశల పైన అనేక కోణాలు ఉన్నాయి , స్నేహానికి అత్యంత విలువనిచ్చే ఆర్ జి వి తన స్నేహితుడైన పూరి జగన్నాధ్  కు ఇచ్చిన మాట తప్పారు అనే కారణం తో మెగా ఫ్యామిలీ పైన సినిమాలు తిసడనేది ఒక వాదాన. ఒక వేళా అదే జరిగుంటే అలాగా ఎందుకు జరిగుంటుంది అనే ప్రశ్న కు ఇప్పటికి సమాధానం లేదు.

చిరంజీవి 150 వ సినిమా  వాస్తవానికి పూరి జగన్నాధ్ తో చేస్తాను అని బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ముందు ఒక సందర్భం లో మాట ఇవ్వటం జరిగింది. కానీ సిన్ కట్ చేస్తే అదే సినిమా వి  వి వినాయక్ తో తెరకెక్కింది. దాన్ని సాకుగా  చూపించి  చాల మంది ఆర్ జి వి కి ఎందుకు కోపం వచ్చింది అనే విషయం పైన చర్చించారు కానీ, ఎందుకు అ సినిమా మెగాస్టార్ చిరంజీవి వి వి వినాయక్ తో చేసాడు అనేది ఇప్పటికి ఒక చిక్కుముడే.

  • చిరంజీవి అంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తీ , శివ సినిమా హిట్ అయినతరువాత ఆర్ జి వి వాస్తవానికి మెగా స్టార్ తో సినిమా చెయ్యాలి, కానీ అప్పటికే బాలీవుడ్ లో అవకాశం రావటం తో ఆర్ జి వి బొంబాయి ట్రైన్ ఎక్కేసాడు.
  • " బ్బుద్ధ హోగా తేరా బాప్"  అమితాబ్ బచ్చన్ తో సినిమా తియ్యాలనే పిచ్చి కోరికతో ఉర్రుతలుగుతున్న పూరి జగన్నాద్ , అమితాబ్ తో అత్యనత సన్నిహిత్యం ఉన్న వర్మ కు ఒక పర భాష సినిమా కధ చెప్పితే సొంతముగా ఆలోచించు అనే సలహా ఇచ్చాడు, అంతటితో పురిజగానాథ్ తన బుర్రకు పదును పెట్టి  " బ్బుద్ధ హోగా తేరా బాప్" పోకిరి సినిమా లో ఫ్లేవర్ ను మిక్స్ చేసి ఒక కథ ను రెడీ చేసి ఆర్ జివి తో కలిసి బాలీవుడ్ బిగ్ బి ని కలిసాడు.
  • కథ విషయంలో చిన్న మేన్యుప్లేషణ్ జరిగింది అని స్వయంగా పూరి ఒప్పుకున్నాడు. అమితాబ్ స్థాయికి సినిమా రీచ్ కాలేకపోయింది. 
  • అప్పటి పరిస్థితులలో చిరంజీవి రాజకీయ జీవితాన్ని విరమించుకొని, వెండితెర పైన రి ఎంట్రీ కి నిర్ణయించుకున్నారు. బలహీన క్షణాలలో బిగ్ బి వద్ద లాక్ అయిన చిరంజీవి తరువత జరిగిన పరిణామాలను దృష్టి లో పెట్టుకొని తన కెరీర్ ప్లానింగ్ లో ఒక నిర్ణయం ఎందుకు తీసుకోని ఉండకూడదు ? 150 వ చిత్రం చిరంజీవి కెరీర్ కి చాల అవసరమైన చిత్రం, ఒక వేల ఫ్లోప్ అయిన, సానుకూల ఫలితం రాకపోయినా , సబ్జెక్టు బాగోకపోయినా అది తన 2వ ఇన్నింగ్స్ పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది, అందుకే చిరంజీవి రీమేక్ చిత్రమైన ఖైది నెంబర్ 150 ను ఎంచుకోని ఉండవచ్చు ?
తన మాట కాదన్నారు అనే నెపముతో   అహం దెబ్బతిన్న ఆర్ జివి కావాలనే మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేసారు అనే అభిప్రాయాలూ లేకపోలేదు.  కొనసాగుతుంది ............?

   



In Association with 






Advertisement