ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

" అఖండ "పైన " వినయ విధేయ రామ " ప్రభావంకొరటాల శివ బోయపాటి వద్ద పనిచేస్తున్నప్పుడు తనకి సరైన  గుర్తింపు దొరకలేదు అని చెప్పి బాధ పడిన విషయం తెలిసిందే. కొరటాల శివ బోయపాటి ని వదిలి వెళ్ళిన తరువాత వినయ విధేయ రామ తో ఘోర పరాజయం చవి చూసిన బోయపాటి, అతని ఫ్లోప్ లిస్టు లో అది ఒక మైలు రాయగా మిగిలిపోయింది. అసలు ఎప్పుడు ఎందుకు ఏమి జరుగుతుంది అనే విషయం అర్ధంకాని ప్రేక్షకులు ఈ సినిమా ఎందుకు తీసారు రా బాబు అనే స్థాయికి ఆ సినిమా టాక్ రావటంతో బోయపాటి కొంచెం గ్యాప్ తీసుకున్నాడు.
ఇప్పుడు అఖండ సినిమా తో బాలయ్య బోయపాటి శ్రీను కి ఒక అవకాశం ఇచ్చాడు, కానీ కథ రాసింది కొరటాల కాదు, కంటెంట్ ఉన్న ఘోస్ట్ రైటర్ మిస్సింగ్. అంతు పొంతూ లేని, అర్ధవంతమైన సీన్స్ ఏమైనా ఉంటె సినిమాను ఒక్కసారి ఫాన్స్ అయితే ఎలాగో చూస్తారు కానీ బోయపాటి కెరీర్ కు ఇది అంత మంచి పరిణామం అవ్వదు.అఘోర రోల్ లో బాలయ్య, అదే విధముగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాగా సినిమా ప్రేక్షకులలోనూ మరియు ఫాన్స్ లోను మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది, చిత్రం పైన అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య కెరీర్ అయితే పదిలం, ఈ సినిమా కాకపోతే మరొక సినిమా వస్తుంది, బాలయ్య బోయపాటి కి పునర్జన్మ ప్రసాదించే ప్రయత్నం చేస్తున్నాడు అనే చెప్పాలి. కానీ బాలయ్య తో ఈ కాంబినేషన్ మీద అంచనాలు, ఓపెనింగ్స్ ఎక్కువే ఉంటాయి .


  
బీహార్ గెటప్ లు, దైవికం తో ఒక గెటప్, పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో ఒక గెటప్  కి మరొక గెటప్ కి ఎక్కడ కూడా సంబంధం లేదు, సింహ లెజెండ్ ఫ్లేవర్ తగలాలంటే ఖచ్చితముగా అక్కడ కొరటాల శివ ఉండాలి, ఇక్కడ అతను మిస్సింగ్.  ట్రైలర్ లో సంభందం లేని సెట్ లు, భౌగోళిక మార్పు ఖచ్చితముగా కనిపిస్తుంది. ఒక వేల ఈ సినిమా హిట్ అయితే బోయపాటి కి వచ్చిన నెగటివ్ మార్క్ దెబ్బతో తూడుచుకు పోయినట్టే, తన స్టాండ్ తను నిరుపించుకొని ఇండస్ట్రీ లో నిలతోక్కుకునట్టే.  కొరటాల దెబ్బకి సెల్ఫ్ స్కిల్ లేదు అనే ముద్ర పడిన బోయపాటికి బాలయ్య, బన్ని లైఫ్ ఇచ్చినట్టే.  


In Association with 
 News9 

Follow us in