ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగుల జీతాల పెంపు

 అమరావతి: ఆర్టీసీలో ఒప్పంద, పొరుగుసేవల కింద పనిచేస్తున్న కార్మికులు, భద్రతా సిబ్బంది జీతాలను పెంచుతూ యాజమాన్యం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. నెలకు నైపుణ్యం లేని కార్మికులకు రూ.294, కొంత నైపుణ్యం ఉన్నవారికి రూ.349, నైపుణ్య కార్మికులకు రూ.428, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.322, అటెండర్లకు రూ.294, భద్రతా సిబ్బందికి రూ.304 చొప్పున పెంచారు. ఈ పెంపు అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నారు.

 ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు గతంలో పెంచిన జీతాలే ఇవ్వడంలేదని, వాటిని గుత్తేదారులు జేబుల్లో వేసుకుంటున్నారని ఒప్పంద ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నూర్‌ మహ్మద్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.