ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గ్రామాభివ్రుద్ది దేశాభివృద్ధికి ఆధారం - భారత రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు (నవంబర్ 17, 2021) హర్యానాలోని భివానీ జిల్లాలోని సుయి గ్రామాన్ని సందర్శించి, అక్కడ వివిధ ప్రజా సౌకర్యాలను ప్రారంభించారు. ఈ గ్రామాన్ని హర్యానా ప్రభుత్వ పథకం స్వ-ప్రేరిత్ ఆదర్శ్ గ్రామ యోజన (SPAGY) కింద మహాదేవి పరమేశ్వరిదాస్ జిందాల్ ఛారిటబుల్ ట్రస్ట్ 'ఆదర్శ్ గ్రామ్'గా అభివృద్ధి చేస్తోంది.

మన గ్రామాభివ్రుద్ది ఆర్థిక వ్యవస్థలో దేశాభివృద్ధికి ఆధారమని రాష్ట్రపతి అన్నారు. హర్యానా ప్రభుత్వం ఆదర్శ్ గ్రామ్ యోజనను రూపొందించి అమలు చేస్తున్నందుకు ఆయన ప్రశంసించారు. మనమందరం మన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తేనే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందన్నారు. మరికొందరు కూడా ఇలాంటి ఉదాహరణలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల అభివృద్ధికి ముందుకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.


In Association with