ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రాజధానుల విషయం లో బి జే పి కి స్కోప్ లేదు - జగన్ అక్కడ !




మూడు రాజధానుల అంశం పైన  చిన్న వార్త భయటకు రాగానే, అమిత్ షా చొరవే అని రాజధాని ప్రజలంతా కృతజ్ఞతల వర్షం కురిపించారు. అసెంబ్లీ సమావేశం అవ్వగానే అక్కడ జరిగిన పరిణామాలు చూసి నిరుకర్చారు. అమిత్ షా సూచనల మేరకు జగన్ వెన్నకి తగ్గినాడు అనే భ్రమ  లోకి అందరు వెళ్ళిపోయారు అక్కడ ఉన్నది జగన్, కాంగ్రెస్ దేశాన్ని ఎలుతునప్పుడే ఎవరిని లెక్కచెయ్యలేదు, ఉక్కుపాదాన్ని సైతం మోసుకుంటూ వచ్చాడు కానీ ఎక్కడ నలిగిపోలేదు ఇంకా అమిత్ షా మాట అక్కడ చెల్లుబాటు అవుతుంది అనే అభిప్రాయానికి రావటం మురిసిపోతున్నవారి అమాయకత్వం .

అమిత్ షా కాదు కదా మోడీ దిగి వచ్చిన ఇక్కడ జగన్  నిర్ణయానికి విరుద్ధముగా ఏది జరగదు. 151 సీట్ల మెజారిటీ, రాజధాని ప్రాంతం లోనే గెలుపు, ఇటువంటి పరిస్థితిలో జగన్ జాతీయ నాయకుల మాట వింటాడు అనే భ్రమ లో ఉండటం, అతను నొక్కి మరి చెపుతున్నాడు రాజధానికి వ్యతిరేకముగా ఉన్నారు కాబట్టే 2019 లో మాకు పట్టం కట్టారు అని, రాజధాని వికేంద్రికరణ లో తన స్పష్టమైన ధోరణి వెల్లడి చేసాడు.

నిజంగా రాజధాని ప్రజలకు రాజధాని కావాలనుకుంటే టి డి పి కి అంత తక్కువ మెజారిటీ ఎందుకు వస్తుంది. ఇందులో భిన్న అభిప్రాయాలూ ఉన్నాయి అక్కడ ఉన్న ప్రజలు ఒకటి జగన్ రాజధాని అక్కడనుంచి మార్చాడు అని బలముగా నమ్మి ఉండవచ్చు, లేదా అక్కడ స్థానిక నాయకుడు బలహీనపడి ఉండవచ్చు . కాకపోతే వెయ్య రెండు వేల ఓట్లతో తో గెలిచినా  ఖచ్చితముగా దాన్ని గెలుపే అంటారు, కానీ టఫ్ ఫైట్ అంటారు . రాజకీయముగా ఓడిన గెలిచినా ఆ ఆ ప్రాంతాలలో బలమైన పట్టు ఇరు పార్టీలకు  ఉంది అనే చెప్పవచ్చు.

ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఏడు వేల ఎకరాలలో రాజధాని అభివృద్ధి  అనేది సాధ్యపడదు ఇది జగన్ వాదన, అందుకు రాజధాని మార్చవలసిన అవసరం ఏమిటి విస్తిరణ తగ్గిస్తే సరిపోతుందిగా అనేది చాల మంది అభిప్రాయం. చట్ట పరమైన సమస్యలు , కోర్టులో కేసులు 150 పిటిషన్లు  అంటే ఎంత మంది రాజధాని మార్పు పైన  వ్యతిరేకత ఉంది అనే విషయం అర్ధం చేసుకోవాలి, వేల సంఖ్యలో కోర్టుకి వెళ్లి అనుమతి తీసుకోని రాజధాని మార్పు పైన నిరసన వ్యక్తం చేస్తూ పాదయాత్ర చ్సేస్తున్నారంటే, అక్కడ పాదయాత్ర చేస్తున్న వారు, వారి కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే వారంత ఖచ్చితముగా జగన్ మోహన్ రెడ్డి రాజధాని లో ఎటువంటి మార్పులు చేయ్యుడు  అనే నమ్మి ఉండాలి, వారు  అప్పుడు  జగన్ మోహన్ రెడ్డి ని నమ్మినారు ఇప్పుడు అతని నిర్ణయానికి వ్యతిరేకముగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంటే దాని అర్ధం ?

ఒక్క రాజధానిని అభివృద్ధి చెయ్యటానికి ఆర్ధిక స్థోమత లేదు అటువంటిది మూడు రాజధానులను ఏ విధముగా అభివృద్ధి చేస్తారు ? వైజాగ్ ఇప్పటికే అభివృద్ధి కాబడింది, మరి మిగత ప్రాంతాలు భారమే కదా ? ఇంత ఓపెన్ గా ఉన్న ఈ విషయాన్ని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది ? ఇది నిజంగా అభివృద్ధి వికేంద్రికరననేనా ?

ఈ ప్రాంతం పైన ఎటువంటి వ్యతిరేకత లేదు ? మరి వ్యతిరేకత ఎవరి మీద ? ఎన్నికల మేనిఫెస్టో లో మూడు రాజధానుల ప్రస్తావన ఎందుకు లేదు ? ప్రతిపక్ష నాయకులను తిట్టటం తప్ప అసెంబ్లీ లో రాష్ట్ర అభివృద్ధి ప్రస్తావన ఏది ? ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది ? రోడ్లు పరిస్థితి ఏమిటి ? రైతుల పరిస్థితి ఏమిటి ? వాణిజ్య కేంద్రాల పరిస్థితి ఏమిటి ? 

ఇవేమీ లేకపోయినా 151 సీట్లు గెలుచుకున్న  జగన్ సేనను ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజాదరణ ఉన్నప్పుడు అమిత్ షా సూచిస్తే ఏమిటి ? మోడీ సూచిస్తే ఏమిటి ? తన నిర్ణయం తను ఎందుకు మార్చుకోవాలి ? వాళ్ళని ఎందుకు లేక్కచేయ్యాలి ? అనే అభిప్రాయాలూ లేకపోలేదు . ఒక వేళా జగన్ ప్రభుత్వం 2024 లో ఏర్పడిన ఏర్పడకపోయినా అతనికి వచ్చిన నష్టం ఏమి లేదు , జీవితం లో ఎన్ని ఒడిదుడుకులు చూడాలో అన్ని చూసేసాడు, . రాజకీయ నీతి ఏంటంటే పెద్ద తలకాయలు ఎప్పుడు పెద్ద తలకయలె ,మధ్యలో వచ్చి ఎగిరే తలకయల్కు డిప్ప వాస్తుంది.  



 
In Association with 






Advertisement