ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సాంకేతిక విద్యలో బాలికల భాగస్వామ్యత తక్కువ - రాష్ట్రపతి 


కాన్పూర్‌లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ హాజరయ్యారు,  HBTU వంటి సంస్థలు తమ విద్యార్థులలో ఆవిష్కరణలు మరియు వ్యవస్థాపకత స్ఫూర్తిని పెంపొందించాలని భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ అన్నారు. సాంకేతిక విద్యలో బాలికల భాగస్వామ్యత తక్కువగా ఉందని తెలియచేసారు, తాను దేశవ్యాప్తంగా అనేక విద్యాసంస్థల కాన్వకేషన్‌లకు హాజరయ్యానని, అక్కడ బాలికల పనితీరు ఎంతగానో ఆకట్టుకుంటుందని గమనించానని చెప్పారు. కానీ సాంకేతిక విద్యా రంగంలో బాలికల భాగస్వామ్యం సంతృప్తికరంగా లేదు. సాంకేతిక విద్యారంగంలో మరింత మంది బాలికలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించడం నేటి ఆవశ్యకమని అన్నారు. ఇది మహిళా సాధికారతను పెంపొందిస్తుందని అయన తెలియచేసారు .In Association with