ఫ్లాష్ ఫ్లాష్

Viewers Count

Advertisement

Royal Enfield spares

Advertisement

రూ.30 లక్షల లంచం కేసులో రీజనల్ హెడ్ - అరెస్ట్

 రూ.30 లక్షల లంచం కేసులో రీజనల్ హెడ్, ఆగ్రో డివిజన్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ మరియు పుణేలోని రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ రికవరీ హెడ్‌ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది.

వాల్యుయేషన్ సర్టిఫికేట్ జారీ చేయడానికి కోటి రూపాయలు డిమాండ్ చేసారు అని బాధితులు ఫిర్యాదు చేసారు, ర్నగం లోకి దిగిన సి బి ఐ వారిని అరెస్ట్ చేసింది.

నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ యొక్క ఉద్యానవన పథకం యొక్క ఉత్పత్తి మరియు పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా కమర్షియల్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ పధకం ద్వార  ఫిర్యాదుదారు తన 12 మంది కుటుంబ సభ్యులతో కలిసి అగ్రి టర్మ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో ప్రభుత్వం మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో @ 50% సబ్సిడీని ఇస్తుందని తెలియచేసారు. ఒక్కో ప్రాజెక్టుకు 56 లక్షలు. సబ్సిడీ అందుబాటులో లేనందున, ఫిర్యాదుదారు & అతని కుటుంబ సభ్యుల యొక్క అన్ని అగ్రి టర్మ్ లోన్ NPA అయినందున, సబ్సిడీని పొందేందుకు, తనఖా పెట్టిన ఆస్తులకు వాల్యుయేషన్ సర్టిఫికేట్ అవసరమైనది .అందుకుగాను లంచం గా  రూ. 30 లక్షల కు బేరం కుదిరింది.

సమాచారం అందుకున్న సి బి ఐ  అహ్మదాబాద్‌లోని రీజినల్ హెడ్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, లంచం తీసుకున్న డబ్బు తో సహా అందరిని రికవరీ హెడ్ ని అరెస్ట్ చేసారు.
In Association with 






Advertisement