ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

" పుష్ప " పైన భారి అంచనాలు

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన తెరకెక్కుతున్న  "పుష్ప "  సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా ఒక్క ఒక్కటి గా రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచి ప్రేక్షకులలో అంచనాలను పెంచుతున్నారు.
"ఏయ్ బిడ్డ ఇది నా అడ్డ" అనే పాట ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ తమ అధికారిక యు ట్యూబ్ ఛానల్ లో లాంచ్ చేసారు నవంబర్ 19 వ తారీఖున ఈ పాటను రిలీజ్ చేసారు, ఇప్పటికి ఈ పాట కు 9,334,953  వ్యూస్ వచ్చినవి  , 19 వ తేది నుంచి 21 తేది మధ్యలోనే ఈ వ్యూస్ వచ్చాయి.


  
ఈ స్ట్రాటజీ చూస్తే పబ్లిసిటీ మేనజ్మేంట్ విషయం లో ఈ సినిమా నిర్మాతలు, దర్శకుడు చాల జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు అర్ధమౌతుంది. సునీల్ పోస్టర్ రిలీజ్ తో, విలన్ రోల్ మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయి, అదే విధముగా అల్లు అర్జున్ వేషధారణ, ఎర్రచందనం విజ్యుల్స్, యాక్షన్ సీన్స్, హీరోయిన్ను  పరిచయం చేస్తూ  వదిలిన విజ్యుల్స్ ఇలాగ చాల వరుకు  గమనిస్తే సినిమా విషయములో చాల జాగ్రత్తలు తీసుకోని రిలీజ్ కి మంచి సమయం కోసం వేచి చుస్తున్నాటు అర్ధమౌతుంది.

ఇంకా బన్ని (అల్లు అర్జున్)  విషయానికి  వస్తే " వరుడు " ఒక్క సినిమా లో తప్ప కధ విషయములో చాల జాగ్రత్తగా వ్యవహరించాడు, దర్శక నిర్మాతల విషయం లో రాజిపడడు. ఈ విషయాలు సాధారణ పరిస్థితులలో అయితే ప్రేక్షకులను ధియేటర్ వరుకు నడిపించేవి, కానీ ప్రస్తుతం పరిస్థితులలో ప్రేక్షకులను ఏ మేరకు ఈ సినిమా ధియేటర్ వరుకు నడిపిస్తుంది అనే విషయమె కొంచెం ఆలోచించవలసిన విషయం .  బహుశా ఇదే విషయం గురించి అల్లు ఫ్యాన్స్ నిరుత్యుహ పడకూడదు అనే ఆలోచనతో ఈ విధముగా పాటల ప్రయోగం మొదలపెట్టరేమో అనే సందేహాలు లేకపోలేదు.

ఏది ఏమైనా మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ కధను ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే అల్లు అర్జున్ గ్రాఫ్ స్టాండ్ అవుతుంది అనే అభిప్రాయాలు  అధికముగా ఉన్నాయి.


In Association with