ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జగన్ మోహన్ రెడ్డి పాయింట్ అఫ్ వ్యూ !

భారత దేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచం లో ఎక్కడ ఉండి ఉండదు.  ఇక్కడ ప్రజలు స్వేచ్చ స్వాతంత్రం తో విచ్చలవిడిగా , విలసవంతముగా జీవిస్తారు అనేది చాల మంది అభిప్రాయం. ఇక్కడ ఓటరు మహానభావులు ఒక్క ఒక్క ఎన్నికల ఖర్చుని  సామాన్యుడు ఎన్నికలలో పోటి చెయ్యాలంటే ప్యాంటు తడుపుకునే విధముగా పెంచేసారు. రాజకీయ నాయకులను పెట్టుబడిదారీగా  తీర్చిదిద్దిన అతి పెద్ద  ప్రజాస్వామ్య దేశ పౌరులు . కుక్కకి ముక్క పెట్టిన విశ్వాసముగా ఉంటుందు కానీ ఓటుకు రెండు వైపుల నోటులు తీసుకునే అతిపెద్ద ప్రజాస్వామ్యం లో రాజకీయాన్ని నెగ్గుకొని రావాలంటే సామాన్యుడికి సాధ్యపడదు . డబ్బు ఓపిక, సమర్ధత అన్ని ఉండాలి. రాజకీయం ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న ఆట.


వై ఏ స్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంత కాలం యువరాజుగా చలామణి అయ్యి ఒక్క మరక కూడా అంటకుండా కిర్తించబడిన జగన్ ఒక్కసారిగా ఆయన చనిపోయిన తరువాత నాణేనికి మరో వైపు కూడా చూడవలసి వచ్చింది. 


జగన్ సామర్థ్యం తెలిసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు, జగన్ రాజకీయ భవిష్యత్తు సాఫీగా వెళ్లకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అప్పటి వరుకు వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్న జగన్ , తన తండ్రి మరణం తరువాత రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా అడుగులు కదపటం ఏమాత్రం జీర్ణించుకోలేని కాంగ్రెస్ అగ్రనాయకులు ఒక్కసారిగా అతని యొక్క సంపాదన పైన దృష్టి పెట్టారు. ఒక మనిషిని మానసికముగా ఎంత బలహీన పరచలో అనే విషయం లో పి హెచ్ డి చేసిన పెద్దలు అంత కలిసి జగన్ అతని మద్దతుదారులు , స్నేహితులు, సన్నిహితులు అందరి పైన ఈ డి నీ దించారు. యువరాజు అనే పలికిన నోటితోనే నేరస్థుడు అనే పలుకులు పలికించారు. అప్పటి వరుకు ఎక్కడికి వెళ్ళిన బ్రహ్మరథం పట్టినవారే కనీసం అతని కోసం సమయం కేటాయించటనికి నిరాకరించి అవమాన భారంతో వెన్నకి పంపించిన సంఘటనలు ఎక్కువ . 
ప్రత్యామ్నాయ మార్గంగా తన తండ్రిని ఆదరించిన ప్రజలను తన కుటుంబాన్ని అభిమానించిన వారికి దగ్గరయ్యే  ప్రయత్నం చేశారు, తన తండ్రి మరణ  వార్త విని గుండె ఆగి చనిపోయారు అనే విషయం తెలియగానే అది నిజమా కాదా అనే విషయం పైన ఏటువంటి వివరణలు కానీ, ఎంక్వైరీ లు కానీ లేకుండా కుటుంబానికి రెండు లక్షలు ఆర్థిక సహాయం అందించాడు, అతను వెళ్ళని  ఉరు లేదు తిరగని చోటు లేదు పలకరించని  గ్రామం లేదు, ఒక రకముగా చెప్పాలంటే  శారీరకంగా మానసికముగా , అర్ధికముగా నలిగిపోయి మానవ ప్రయత్నం చేశాడు కానీ అప్పట్టికి కూడా 2014 లో ప్రధాన ప్రతిపక్షనేత గానే అతను పరిమితం అయినాడు. 
మానవ ప్రయత్నం ఉంటే దైవ అనుగ్రహం దక్కుతుంది అన్నట్టు పూజారి గా ప్రశాంత్ కిషోర్ దేవుడు గా నరేంద్ర మోదీ సమంతా రాజుగా కే సి ఆర్ తోడుగా ఉండటం తో సుష్మ స్వరాజ్ ఆదరణ తో చంద్రబాబు వ్యూహాలు బెడిసి కొట్టడంతో నవ్యాంధ్రకు రెండవ ముఖ్యమంత్రిగా ప్రస్తుత పాలక వర్గానికి అధినేతగా నిలతొక్కు కున్నడు. 

కానీ కాంగ్రెస్ పార్టీ రచించిన వ్యూహ రచన కు కేంద్రానికి విధేయుడు గా , గట్టిగా ప్రతిఘటించలేనిi పరిస్థితి లో అతను ఇరుక్కుపోయి  ఉన్నాడు.ఎవరికి ఎదురు చెప్పిన ఏ సమస్య వస్తుందో అనే సందిగ్ధ అవస్థ స్పష్టంగా కనిపిస్తుంది. 

జగన్ అనుకున్నది జగన్ సాధించాడు, కాంగ్రెస్ అనుకున్నది కాంగ్రెస్ సాధించింది. ఇక్కడ అతని వ్యుహాలన్ని ప్రత్యర్ది పార్టీ ని అనగతోక్కి తనకి జరిగిన అవమానాలకు పరోక్ష కారకులైన టి డి పి నాయకులను అంతకు మించి మనోవేదనకు గురిచేస్తున్నాడు, మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉనికిలేకుండా చేసి తనకున్న పరిధి తను చెయ్యగల నష్టం కాంగ్రెస్ కి రాజకియముగా కలిగిస్తున్నాడు. 

అతని పాయింట్ అఫ్ వ్యూ లో ఆలోచిస్తే తనకి సియం గా ఒక్క ఆవకాశం వస్తే అతను ఎదురుకున్న ప్రతి దానికి సమాధానం చెప్పాలి అనుకున్నాడు, చెపుతున్నాడు, తన లోపం లేకుండా మానవ ప్రయత్నం  చేసాడు, సాధించాడు  దానికి రాజకీయం కావాలి కాబట్టి ....? అనే ఉహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి.  ఇంకా రాష్ట్ర అభివృద్ధి విషయానికి వస్తే రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకున్నారో అదే జరుగుతుంది, వారికీ ఏమి కావాలో అదే దక్కుతుంది అనే ధోరణి  ఎక్కువ ఉన్నది.


In Association with