ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

47 జిల్లాలు 7,287 గ్రామాలకు 4 జి సేవలు - రూ. 6,466 కోట్ల అంచనా

 ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర & ఒడిశాలోని ఐదు రాష్ట్రాల్లోని ఆకాంక్షాత్మక జిల్లాల్లోని అన్‌కవర్డ్ గ్రామాలలో మొబైల్ సేవలను అందించడానికి USOF స్కీమ్‌ను క్యాబినెట్ ఆమోదించింది.

సుమారు రూ. 6,466 కోట్ల అంచనా వ్యయంతో 4G ఆధారిత మొబైల్ సేవలను పొందడానికి ఐదు రాష్ట్రాల్లోని 44 ఆకాంక్షాత్మక జిల్లాలకు చెందిన 7,287 గ్రామాలనుఎంపిక చేసారు. ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర & ఒడిశాలోని ఐదు రాష్ట్రాలలోని ఆకాంక్షాత్మక జిల్లాల అన్‌కవర్డ్ గ్రామాలలో మొబైల్ సేవలను అందించడానికి ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర మరియు ఒడిశాలోని ఐదు రాష్ట్రాలలోని 44 ఆకాంక్షాత్మక జిల్లాల్లోని 7,287 ఎంపిక  గ్రామాల్లో 4G ఆధారిత మొబైల్ సేవలను 5 సంవత్సరాల కార్యాచరణ ఖర్చులతో సహా ,రూ. 6,466 కోట్ల అంచనా వ్యయంతో అందించాలనేది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాజెక్ట్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (USOF) ద్వారా ఇందుకు  నిధులు సమకూరుస్తుంది. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 18 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవుతుంది,  నవంబర్ 23 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం ఉంది.